S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (15.3.2020 నుంచి 21.3.2020 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త పడాలి. అనుకోని ఇబ్బందులు. అనారోగ్య భావనలు. సంతృప్తి లోపం. ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలి. లాభాలు కోల్పోయే అవకాశం. వ్యాపారాదుల్లో జాగ్రత్త వహించాలి. ఊహించని సంఘటనలకు అవకాశం ఉంటుంది. వారం మధ్యమంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. లక్ష్యాలను సాధించే యత్నం. ఆథ్యాత్మిక యాత్రలకు అవకాశం ఉంటుంది. కొంత అసంతృప్తి. గుణాత్మకమైన నిర్ణయాదులు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలపై దృష్టి. విందులు, విహారాలు, వినోదాలుంటాయి. వారాంతంలో అధికారికమైన ఖర్చులకు,ప్రయాణాలకు అవకాశం. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. శ్రమాధిక్యం. ఒత్తిడులను అధిగమించాలి. సౌకర్యాలు సమకూర్చుకుంటారు.
వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాలపై దృష్టి, పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. ఆథ్యాత్మిక యాత్రలకు అనుకూలం. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాలపై దృష్టి. వ్యాపారాదుల్లో శుభపరిణామాలు. సామాజిక గౌరవం పెంచుకుంటారు. కార్యనిర్వహణ దక్షత. వారం మధ్యమంలో అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాలి. కొత్త పనులను మానుకోవాలి. నిర్ణయాదులకు దూరంగా మెలగాలి. శ్రమతో కార్యాలు. ఖర్చులు అధికం. విందులు, వినోదాలు, విహారాలకు వ్యర్థంగా కాలం, ధనం వెచ్చించే అవకాశం. ముందు జాగ్రత్తలు అన్ని పనుల్లోనూ అవసరం. వారాంతంలో కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం. ఆథ్యాత్మిక వ్యవహారాల వల్ల మరింత మేలు కలుగుతుంది.
మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో వ్యతిరేకతలు అధికం. పోటీలు, ఒత్తిడులను అధిగమించే శక్తి ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. శ్రమ తప్పకపోవచ్చు. కొన్ని అనుకోని నష్టాలకు కూడా అవకాశం. ఉన్నత లక్ష్యాలపై దృష్టి. వ్యాపారాదులు కొంత కాంపిటీషన్ ఉంటుంది. విజయసాధన సంభవం. వారం మధ్యమంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు, స్నేహానుబంధాలు పెంచుకుంటారు. కొంత ఆథ్యాత్మిక దృష్టి ఉంటుంది. అనుబంధాల్లో కొంత అప్రమత్తంగా మెలగాలి. వేరు వేరు రూపాల్లో ప్రయోజనాలు అధికం. పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తాయి. వారాంతంలో కార్యనిర్వహణలో లోపాలు. అన్ని పనుల్లోనూ ముందు జాగ్రత్త అవసరం. కాలం, ధనం వ్యర్థం కావచ్చు. వృత్తి ఉద్యోగాదుల్లో అధికారులతో అప్రమత్తంగా మెలగాల్సి వస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో ఆలోచనలకు రూపకల్పన. ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తారు. నూతన కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త అవసరం. వ్యాపారాదుల్లో ఊహించని లాభాలకు అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్ విషయంలో కొంత జాగ్రత్త. క్రియేవిటీ రాణిస్తుంది. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ పోటీలు ఎదురవుతాయి. శ్రమతో కార్యక్రమాలను నిర్వహించాలి. పనుల్లో ఒత్తిడులు, చికాకులు తప్పకపోవచ్చు. వ్యతిరేకుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. దైవధ్యానం వల్ల మేలు కలుగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. పదోన్నతులకు అవకాశం. సామాజిక గౌరవం పెంచుకుంటారు. వారాంతంలో భాగస్వామ్యాలపై ప్రత్యేక దృష్టి. అనుబంధాలను పెంచుకునే ప్రయత్నం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఈ వారం ప్రారంభంలో సౌకర్యాలు సమకూర్చుకునే ప్రయత్నం. ఆహార విహారాలపై దృష్టి. శ్రమతో కార్యాలు. కొన్ని విషయాల్లో పోటీలుంటాయి. భాగస్వామ్యాల్లో అనుకూలత. వ్యాపారాదులు సంతోషంగా నిర్వహిస్తారు. సామాజిక అనుబంధాలు విస్తరించుకునే ప్రయత్నం. విందులు, వినోదాలుంటాయి. వారం మధ్యమంలో ఆలోచనలకు రూపకల్పన. క్రియేటివిటీ పెంచుకునే అవకాశాలు. కొంత నిరాశ కూడా ఉంటుంది. సంతాన వ్యవహారాలపై దృష్టి. నూతన కార్యక్రమాల నిర్వహణ, ప్లానింగ్, ఉన్నత వ్యవహారాలుంటాయి. లక్ష్యాలను సాధిస్తారు. సుదూర ప్రయాణాదులకు అవకాశం. వారాంతంలో పోటీ రంగంలో గుర్తింపు లభిస్తుంది. శ్రమాధిక్యం. కార్యనిర్వహణలో అనుకూలత. చికాకులున్నా పురోగతి ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోదరవర్గ వ్యవహారాలు చర్చిస్తారు. ఇతరుల సహకారం లభిస్తుంది. నిర్ణయాదులు ఆలస్యం కావచ్చు. వార్తల విషయంలో కొంత అప్రమత్తంగా మెలగాలి. వ్యాపార వ్యవహారాల్లో శుభపరిణామాలు. కార్యనిర్వహణలో ఒత్తిడులుంటాయి. వారం మధ్యమంలో సౌకర్యాలు సమకూర్చుకునే ప్రయత్నం. ఆహార విహారాల్లో జాగ్రత్త వహించాలి. విద్యా రంగంలోని వారికి ఒత్తిడులుంటాయి. సౌఖ్య లోపం. కొన్ని అనుకోని ఇబ్బందులు. స్ర్తి వర్గంతో అప్రమత్తంగా మెలగాలి. అసంతృప్తి ఉంటుంది. కుటుంబ ఆర్థికాంశాల్లో జాగ్రత్త అవసరం. ఊహించని సంఘటనలు. వారాంతంలో ఆలోచనలకు రూపకల్పన. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. సృజనాత్మకత.
తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో అనుకూలత. ఆర్థిక వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. బంధువర్గ వ్యవహారాలపై దృష్టి. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ఆలోచనలకు రూపకల్పన. క్రియేటివిటీ పెరుగుతుంది. సృజనాత్మక వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. వ్యాపారాదులకు అనుకూలం. వారం మధ్యమంలో సంప్రదింపులపై దృష్టి. ఆథ్యాత్మిక వ్యక్తుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాదుల్లో జాగ్రత్త. భాగస్వామితో సంతోషం. అనుబంధాలు విస్తరిస్తాయి. కొత్తపనులపై దృష్టి పెరుగుతుంది. కాంట్రాక్టు వ్యవహారాలకు అనుకూలం. విందులు, వినోదాలు, విహారాలు అధికమవుతాయి. అన్ని పనుల్లోనూ అనుకూలత. వారాంతంలో సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. సౌఖ్యంగా కాలం గడిపే ప్రయత్నం. విద్యారంగంలోని వారికి శ్రమ.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కొత్త పనుల నిర్వహణపై దృష్టి. బాధ్యతలు విస్తరిస్తాయి. కార్యనిర్వహణ దక్షత. సేవక వర్గంతో సంప్రదింపులకు అనుకూలం. ఆహార విహారాలుంటాయి. గృహ వాహనాది సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. వారం మధ్యమంలో కుటుంబంలో ఒత్తిడులు తప్పవు. ఆర్థిక నిల్వలు తగ్గే సూచనలు. మాటల్లో కొంత నిరాశ ఏర్పడుతుంది. వ్యతిరేకతలు అధికం. హార్మోన్ సమస్యలుంటాయి. తొందరపాటు కూడదు. విజయ సాధన విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వారాంతంలో దగ్గరి ప్రయాణాలకు అవకాశం. సంతానవర్గ వ్యవహారాలుంటాయి. ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కుటుంబ, ఆర్థికాంశాల్లో అప్రమత్తం. మాటల్లో తొందరపాటు కూడదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఈ వారం ప్రారంభంలో ఖర్చులు, పెట్టుబడులు అధికమవుతాయి. కాలం, ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. ప్రయాణాదులకు అవకాశం. విశ్రాంతి కోసం ప్రయత్నం ఉంటుంది. పరామర్శలకు అవకాశం. కుటుంబంలో కొంత ఒత్తిడి, సంప్రదింపులకు అనుకూలం. వ్యాపారానుబంధాలు మెరుగుపడతాయి. వారం మధ్యమంలో నిర్ణయాదులను సమీక్షించుకోవాలి. తొందరపాటు కూడదు. ఆలోచనలకు అనుకూలం. క్రియేటివిటీ పెంచుకుంటారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా కాపాడుకోవాలి. కొన్ని విషయాలలో నైరాశ్య ధోరణి ఉంటుంది. చికాకులను అధిగమించాల్సి వస్తుంది. వారాంతంలో ఆర్థిక నిల్వలపై దృష్టి. మాటల్లో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ వ్యవహారాల్లో చికాకులకు అవకాశం. సౌకర్యాలు శ్రమకు గురిచేస్తాయి. ఆహార విహారాల్లో జాగ్రత్త.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి ఉంటుంది. పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నం. నూతన కార్యక్రమాలపై దృష్టి. ఆలోచనలు వికసిస్తాయి. నిర్ణయాదులు ఆలస్యమయ్యే సూచనలు. కుటుంబంలో అనుకూలత. మాటల్లో చమత్కార ధోరణి పెరుగుతుంది. వారం మధ్యమంలో ఖర్చులు, పెట్టుబడులు పెరుగుతాయి. కాలం, ధనం కోల్పోయే అవకాశం. వ్యర్థమైన ప్రయాణాలు లేకుండా చూసుకోవాలి. ఆథ్యాత్మిక యాత్రలకు అనుకూలం. దానధర్మాల వల్ల మరింత మేలు కలుగుతుంది. ఆహార విహారాల కోసం వెచ్చిస్తారు. విందులు, వినోదాలు విహారాలుంటాయి. స్ర్తి వర్గ వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. వారాంతంలో నిర్ణయాదులు ప్రాధాన్యం వహిస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. బాధ్యతలు విస్తరిస్తాయి.
కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. పని ఒత్తిడి పెరిగే అవకాశం. అనేక కార్యక్రమాల బాధ్యతలుంటాయి. సామాజిక గౌరవం పెంచుకునేందుకు శ్రమ పడాల్సి వస్తుంది. కొంతకాలం వ్యర్థం కావచ్చు. ప్రయాణాదుల్లో జాగ్రత్త. నిర్ణయాదులకు అనుకూలం. వ్యాపార వ్యవహారాలు రాణిస్తాయి. కొన్ని అనుకోని సమస్యలు కూడా ఉంటాయి. వారం మధ్యమంలో ప్రయోజన దృష్టి పెరుగుతుంది. లాభాపేక్ష ఉంటుంది. ఆథ్యాత్మిక మార్గంలోని వారికి మరింత అనుకూలత. లేకుంటే ఆశించిన ప్రయోజనాలు అందక నిరాశకు గురి కావచ్చు. స్ర్తి వర్గంతో సంప్రదింపులుంటాయి. వారి సహకారం అమితంగా అందుతుంది. వారాంతంలో ఖర్చులు, పెట్టుబడులు అధికం. విశ్రాంతి కోసం అధికమైన ప్రయత్నం. పరామర్శలకు అవకాశం.
మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ వారం ప్రారంభంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నిస్తారు. సుదూర ప్రయాణాదులు ప్రభావితం చేస్తాయి. ఆశించిన ప్రయోజనాలు కొన్ని అందక పోవచ్చు. వ్యాపారాదుల్లో పెట్టుబడులు అధికమవుతాయి. విహార యాత్రలకు, వ్యాపార ప్రయాణాలకు అవకాశం. వారం మధ్యమంలో సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం. వృత్తి, ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అధికారుల వల్ల కొంత అసంతృప్తి తప్పకపోవచ్చు. ఆశించిన పదోన్నతులు కూడా శ్రమతో సాధించాలి. కుటుంబ ఆర్థికాంశాల్లో శుభపరిణామాలు. మాట విలువ పెరుగుతుంది. బంధువర్గ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. వారాంతంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆథ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలం.

-డాక్టర్ సాగి కమలాకర శర్మ