S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హోమియోలో..

నావల్ కరోనా వైరస్ రాకుండా హోమియో వైద్య విధానంలో ‘ఆర్సెనికం ఆల్బం-30’ అనే మందు ఉపయోగపడుతుంది. ఈ మందును రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళ్లలో ఆరు మాత్రల చొప్పున మూడు రోజుల పాటు వేసుకోవాలి. కేంద్ర ఆయుష్ శాఖ కూడా ఇదే మందును సిఫార్సు చేసింది. ప్రభుత్వ హోమియో ఆసుపత్రుల్లో ఇది అందుబాటులో ఉంది. ప్రైవేట్ మందుల దుకాణాల్లో కూడా తక్కువ ధరకే ఇది లభిస్తుంది. ఆర్సెనికం ఆల్బం-30 కేవలం నావల్ కరోనా వైరస్ నివారణ కోసం తయారు చేసిన మందేమీ కాదు. జలుబు, దగ్గు, జ్వరం, కళ్లమంట, తదితర లక్షణాలతో బాధ పడే వారికోసం తయారు చేసిన మందు. నావల్ కరోనా వైరస్ సోకితే వచ్చే జబ్బు లక్షణాల్లో జలుబు, దగ్గు, జ్వరం, చలి, ఉండటం వల్ల ఆర్సెనికం ఆల్బం-30 మందును సిఫార్సు చేస్తున్నాం. ప్రభుత్వ చేసిన విస్తృతమైన ప్రచారం మూలంగా ప్రజల్లో ఈ వైరస్ పట్ల అవగాహన బాగా కలిగింది. ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన అవసరమే. ఈ వైరస్ సోకిన వ్యక్తితో చాలా దగ్గరగా ఉంటూ మాట్లాడటం, చేతులు కలపడం, ఆలింగనం చేసుకోవడం, తుమ్ములు, దగ్గినప్పుడు వాటి తుంపర్లు ఇతరులపై పడటం తదితర కారణాల వల్ల ఆరోగ్యవంతులకు కూడా ఇది సోకవచ్చు. మన దేశంలో ఇప్పటివరకైతే ఈ వైరస్ ప్రభావం అంతగా లేదు. మనదేశంలో వేడి వాతావరణం ఎక్కువగా ఉండటం వల్ల నావల్ కరోనా వైరస్ జీవించడం కష్టం. పైగా ఈ వైరస్ ప్రాణాంతకమైంది ఏమీ కాదు. అయినప్పటికీ ప్రజల్లో ఒకరకమైన ఆందోళన కనిపిస్తోంది. విస్తృతమైన ప్రచారం వల్ల ఈ ఆందోళన రేకెత్తి ఉండవచ్చు. ఆందోళన రేకెత్తడం కూడా ఒక రకంగా మంచిదే. జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రజలు ముందుకు వస్తారు. పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రభుత్వం జారీ చేసిన సూచనలను, సలహాలను ప్రజలంతా పాటించాల్సిన అవసరం ఉంది.
-డాక్టర్ ఏ. రాజేందర్‌రెడ్డి,
ఆయుష్ రాష్ట్ర కమిషనర్ (రి).