S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అడుగులు (సండేగీత)

మా మిత్రుడు చదరంగం బాగా ఆడేవాడు. చదువూ బాగా చదివేవాడు. సివిల్స్ రాసి కలెక్టర్ అవ్వాలని అతని కోరిక. యూనివర్సిటీలో ఉన్నప్పుడు మూడుసార్లు సివిల్స్ రాశాడు. కానీ సెలెక్ట్ కాలేదు. మూడవసారి ఇంటర్వ్యూ దాకా వెళ్లాడు. కానీ సివిల్స్ మిస్సయ్యాడు. దాంతో బాగా అసంతృప్తికి లోనైనాడు.
కొంతకాలం బయటకు రావడం కూడా మానేశాడు. ‘చెస్’ ఆడటం వదిలేశాడు. నిరాసక్తంగా ఉండటం మొదలుపెట్టాడు. అతన్ని మామూలు మనిషిని చేయడం నా చేత కాలేదు. ఎవిడెన్స్ ఆక్ట్ చెప్పే మా ప్రొఫెసర్ దగ్గరికి తీసుకొని వెళ్లాను. ఫలితం లేకపోయింది.
చివరికి కాలేజీలో మాతో చెస్ ఆడే లెక్చరర్ దగ్గరికి వెళ్లాను. వాడి సంగతి చెప్పాను. ఆ లెక్చరర్ ‘చెస్’ బాగా ఆడేవాడు. అతనితో గెలవడం అంత సులువైన విషయం కాదు. పదిసార్లు అతనితో ఆడితే ఒకసారి గెల్చేవాళ్లం. మా మిత్రుడిని తీసుకొని రమ్మని చెప్పాడు. అతి కష్టం మీద మా మిత్రున్ని తీసుకొని వెళ్లాను. మా లెక్చరర్‌తో నేను చెస్ ఆడాను. ఎంత బాగా ఆడినా గెలుపు మా లెక్చరర్‌దే అయ్యింది.
మా మిత్రుడికి కూడా ఉత్సాహం వచ్చింది. అతను మా లెక్చరర్‌తో, చెస్ ఆడాడు. ఆ ఆటలో మా మిత్రుడు గెలిచాడు. ఆ ఆటలో మా మిత్రుడు బాగా ఆడినాడా లేక మా లెక్చరర్ కావాలని ఓడిపోయాడో తెలియదు. కానీ ఆ రోజు మా మిత్రునికే విజయం లభించింది.
‘ఈ ఆట వల్ల నీకేం అర్థమైంది?’ అడిగాడు మా లెక్చరర్.
మాకేమీ అర్థం కాలేదు.
‘మీరేం ఆడుతున్నారో అర్థం కాలేదు’ అన్నాడు మా మిత్రుడు.
‘చదరంగం ఆట చాలా ముఖ్యమైన ఆట. ఈ ఆట మనకు మూడు మాటలు చెబుతుంది. అవే జీవన మంత్రం లాంటి మాటలు. ‘అడుగులు వేస్తూ ఉండు’ మన జీవితం చదరంగం లాంటిది. అడుగులు వేస్తూనే ఉండాలి. మనం గెలవాలంటే అడుగులు వేస్తూనే ఉండాలి. మన జీవితంలో కూడా ఎన్నో ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. ఆ ఆటంకాలను దాటుకుంటూ లేదా కొత్త దారులు వెతుక్కుంటూ ప్రయాణం కొనసాగిస్తాం. ప్రతి కొత్త అడుగుల కోసం అనే్వషిస్తాం. మన అడుగుల వల్ల రెండింట్లో ఒకటి లభిస్తుంది. అది విజయం కావొచ్చు. వైఫల్యం కావొచ్చు’ చెప్పాడు మా లెక్చరర్.
మా లెక్చరర్ చెప్పింది మా మిత్రుడికి అర్థమైంది. అసంతృప్తి నుంచి బయటపడ్డాడు. తనేమిటో ప్రపంచానికి చూపించాడు. మంత్రం లాంటి మూడు పదాలను పాటిస్తూ అడుగులు వేశాడు. న్యాయవాదిగా స్థిరపడ్డాడు. సివిల్ సర్వెంట్స్ కేసులని ప్రముఖంగా వాదించే న్యాయవాదిగా పేరొందాడు.