S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఈశాన్యంలో బెడ్‌రూమ్ ( వాస్తు)

ప్రీతిరావు (గుంటూరు)
ప్రశ్న: ఈశాన్యంలో గల బెడ్‌రూం వివాహమైన జంట వాడవచ్చా?
జ: ఈశాన్యంలోగల బెడ్‌రూం వివాహం అయిన జంట వాడకూడదు. ఇందులో వున్నంత కాలం ఇద్దరి మధ్యన కీచులాటలు. ఒకవేళ గర్భవతి అయినట్లయితే ఆ గర్భం పోవడానికి కూడా అవకాశం కలదు.
ఆదిత్య (రావులపాలెం)
ప్రశ్న: మా ఇంటికి నైరుతి మూలలో పక్కవారి ఇంటి ప్రహరీ గోడ పోటు ఉన్నది. అలా వుండవచ్చునా? వాళ్లు ప్రహరీ గోడ నిర్మాణం చేసిన దగ్గర నుండి సమస్యలు వస్తున్నాయి.
జ: అలా ప్రహరీ గోడ తగలడం పెద్ద దోషం అవుతుంది. దీనివల్లనే అనారోగ్య సమస్యలు తలెత్తాయి. అలాగే అనుకోకుండా ఇబ్బందులు కూడా వుంటాయి. దీనికి దోష నివారణ జరిపించండి.
మాధవరావు (నిడదవోలు)
ప్రశ్న: మేం నూతనంగా ఇంటి నిర్మాణం మొదలుపెట్టాం. కానీ ఏ పనీ ముందుకు సాగడంలేదు. ఎప్పుడూ పనివాళ్లతో గొడవలు. అలాగే మెటీరియల్ ఇచ్చే వాళ్లతోటి డబ్బు విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతున్నది? మేం నిర్మాణం చేస్తున్న స్థలంలో ఏమైనా దోషాలు ఉన్నాయా?
జ: మీరు నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి సంబంధించిన స్థలానికి ‘స్థల దోషాలు’ ఉన్నాయి. అలాగే ప్లాన్ ప్రకారం నైరుతి మూల గది పెరిగింది. ఈ రెండింటి వలన ఇలా జరుగుతున్నది. కావున ఈ రెండు దోషాల నివారణ చేసుకొన్నట్లయితే మీ ఇంటి నిర్మాణంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు.
సుభాష్ (ఒంగోలు)
ప్రశ్న: నా పేరు ప్రకారం ఏ దిశలో గల స్థలం/ ఇంటిని కొనుగోలు చేయవచ్చు?
జ: మీ పేరు ప్రకారం ఉత్తరం రోడ్డుగల స్థలం/ ఇంటిని కొనుగోలు చేయండి. చాలా బాగా కలసి వస్తుంది.
సుభద్ర (నిజామాబాద్)
ప్రశ్న: మేం 15 సం.ల క్రితం ఇంటి నిర్మాణం చేశాం. చాలా బాగుంది. కానీ ఇటీవల అంటే ఒక సంవత్సరం క్రితం మా ఇంటి పక్కనే దేవాలయ నిర్మాణం చేశారు. ఆ దేవాలయ నిర్మాణం మొదలుపెట్టిన దగ్గర నుండి మాకు సమస్యలు మొదలయ్యాయి. పరిష్కారం తెలుపగలరు.
జ: దేవాలయం యొక్క నీడ ఇంటి మీద/ స్థలం మీద గానీ పడిన దగ్గర నుండి సమస్యలు అధికంగా వస్తుంటాయి. దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా పరిష్కారం కలదు.
రాజిరెడ్డి (కర్నూలు)
ప్రశ్న: మెట్ల కింద టాయిలెట్ నిర్మాణం చేయవచ్చా? అలాగే దాని కిందనే సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం కూడా చేయవచ్చా?
జ: ఏ దిశలో నిర్మించినా మెట్ల కింద అయినా టాయిలెట్, సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేయకూడదు. దీనివల్ల ఆ ఇంట్లో నివసించే వారికి సమస్యలు వస్తాయి. అవి దీర్ఘకాలిక రోగాలు కావచ్చు/ ఆర్థిక బాధలు కావచ్చు. కాబట్టి అలా చేయకండి.

-వాస్తు శిఖామణి చివుకుల రాఘవేంద్ర శర్మ -96 42 70 61 28