S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రత్న నిర్ధారణ ( గ్రహానుగ్రహం)

వృషభ లగ్నం: సహజంగా జన్మనక్షత్రం ప్రకారం ఒక రాయి నిర్ధారణ చేస్తాం. అందరికీ ఈ విషయంలో అనుమానం ఉండదు. అయితే ఇక గ్రహాలు, దశలు అంతర్దశల ద్వారా జాతిరాయి ధారణ విషయం పరిశీలన చేసినట్లయితే మరో అనుమానం వెంటాడుతుంది. అందుకే వరుస క్రమంలో ‘వృషభలగ్న జాతకుల’ విషయంగా ఉదాహరణ ఇస్తున్నాం. వృషభ లగ్నంలో పుట్టినప్పుడు అనూరాధ, పుష్యమీ, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారు నీలం ధరించవచ్చు. అయితే వృషభ లగ్నమునకు శని మేష, ధనూ రాశులలో ఉన్నప్పుడు ధరించినా లేక గురువు, కుజులతో కలిసినా అప్పుడు ఈ నక్షత్రాల వారు నీలం ధరించిన యెడల ఇబ్బందులు రాగలవు. మరి ఎందుకు అంటే గతంలో చెప్పుకున్న రీతిగా శనిషష్ఠాష్టములలో వ్యయంలో వున్నప్పుడు నీలం ధరించడం మంచిది కాదు. ఇక రెండవ విషయం - వృషభ లగ్నమునకు శని బాగా అనుకూలమయిన గ్రహం. ఆయన అనుకూలించే స్థానాలలో వున్న యెడల.. వృషభ లగ్న జాతకులు నీలం ధరించవచ్చు. అనుకూలించని స్థానాలలో వుంటే నీలం ధరించడం శ్రేయస్కరం కాదు.
* ఆధిపత్య రీత్యా మంచి స్థానాలలో వున్న మంచి గ్రహం యొక్క జాతి రాయిని ధరించవచ్చు. మంచి గ్రహం అంటే ఆధిపత్య రీత్యానే నిర్ణయించాలి.
* ఆధిపత్య రీత్యా దుష్ట స్థానాలలో వున్న మంచి గ్రహము, చెడు గ్రహము యొక్క జాతి రాయి ధారణ ఎప్పుడూ ప్రమాదకరమే.
* ఆధిపత్య రీత్యా మంచి గ్రహం లగ్నాత్ కేంద్ర కోణాలలోను, లాభస్థానం ద్వితీయం వంటి వాటిలో వుండి స్థానబలం లేని యెడల అప్పుడు ఆ గ్రహమునకు సంబంధించిన జాతి రాయి ధారణ సర్వదా శ్రేయస్కరం. స్థానబలం అంటే నీచ, శత్రు క్షేత్రం వంటి వాటిలో వున్నారు అనుకుందాం. ఉదాహరణకు వృషభ లగ్నం శుక్రుడు కన్యలో వున్నాడు. వృషభ లగ్నం వారికి వజ్రం మంచిది. అయితే శుక్రుడు పంచమంలో ఉండడం యోగమే. కానీ స్థానబలం లేని శుక్రుడు కదా! వజ్రం ధరించిన యెడల యోగం బాగా పెరుగుతుంది. స్థానబలం లేని దోషం పోయి, శుక్రుడి ద్వారా మంచి ఫలితాలు పెరుగుతాయి. వజ్రం పెట్టుకోము ఏం అవుతుంది? శుక్రుడు యోగ గ్రహం అయి ఉండి యోగించే స్థానంలో వుండి స్థానబలం లేని కారణంగా ఆయన ఏ విధమయిన మంచి ఫలితాలు ఇవ్వలేడు. అందువలన వజ్రం ధరించిన యెడల చాలా చక్కటి ఫలితాలు అందుకుంటారు.
* మరొక ఉదాహరణ - గురువు వృషభ లగ్నాధికి అవయోగి. ఆయనకు సంబంధించిన జాతి రాయి ధారణ చాలా ప్రమాదం. ఆయన ఒకవేళ లగ్నంలో వున్నాడు అనుకోండి. పెద్దగా చెడు చేయడు. మరి మనం ఒకవేళ పుష్యరాగం ధరించాం అనుకోండి. మనమే ప్రత్యేకంగా సమస్యలు కొని తెచ్చుకున్నట్లు. అదే గురువు సింహంలో వున్నారు అనుకోండి. పుష్యరాగం ధరించిన యెడల గృహ, మాతృ, వాహన, సుఖ సమస్యలు పెంచుకున్నట్లు. ఇలా ప్రతి లగ్నాన్ని శోధించాలి.

...........................................
కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)
కామకోటినగర్, శంకరమఠం వీధి, నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012.

కప్పగంతు సుబ్బరామశర్మ -9848520336