S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆమోదం

కాలేజీ జీవితానికి, యూనివర్సిటీ జీవితానికి చాలా భేదం ఉంటుంది. కాలేజీల్లో వున్నప్పుడు అంత పరిపక్వత చాలామంది విద్యార్థుల్లో ఉండదు. యూనివర్సిటీకి వచ్చేవరకు పరిపక్వత వస్తుంది. ప్రేమల విషయం కూడా అంతే! యూనివర్సిటీల్లో ప్రేమించుకున్న వ్యక్తులు చాలామంది వివాహాలు చేసుకుంటారు.
మేం యూనివర్సిటీ చదువుతున్నప్పుడు శ్రీకాంత్ రవళితో ప్రేమలో పడ్డాడు. ఆరు సంవత్సరాలపాటు వారి ప్రేమ మహా జోరుగా సాగింది. ఆర్ట్స్ కాలేజీ దగ్గర నుంచి, లైబ్రరీ వరకు ఎక్కడ చూసినా వాళ్లే కన్పించేవాళ్లు. అపర ప్రేమికులని పిలిచేవాళ్లం.
శ్రీకాంత్ పిహెచ్‌డి అయిపోయిన తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నాం. కానీ అలా జరుగలేదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అది జీవితం కాదు కదా!
ఇద్దరి మధ్య ఏదో విషయంలో విపరీతమైన చర్చ జరిగింది. అలాంటి చర్చలు గతంలో చాలా జరిగాయి. అలాంటిదే అని మేం అనుకున్నాం. ఆ చర్చ తరువాత ఇద్దరూ దూరమయ్యారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకోనంతగా దూరమయ్యారు. ‘నా జీవితంలో ఎప్పుడూ ఇంతగా గాయపడలేదు’ అన్నాడు శ్రీకాంత్. చాలా ఆవేశపడ్డాడు. జీవితంపై విరక్తి కలిగిందని చెప్పాడు.
రవళితో మాట్లాడదామని ప్రయత్నిస్తే ఆమె ఆచూకీ దొరకలేదు. అప్పుడు సెల్‌ఫోన్లు, ఫేస్‌బుక్స్ లేవు. ఓ నెల తరువాత తెలిసింది రవళి అమెరికాకు వెళ్లిపోయిందని. దాంతో శ్రీకాంత్ మరీ గాయపడ్డాడు. రవళి వాళ్లింటికి వెళ్లి గొడవ చేస్తానని చెప్పాడు. వాడిని మా ప్రొఫెసర్ దగ్గరికి తీసుకొని వెళ్లాను. విషయం తెలుసుకొని అతనూ ఆశ్చర్యపోయినాడు.
శ్రీకాంత్‌ని దగ్గరికి తీసుకొని నచ్చజెప్పాడు.
‘నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం శ్రీకాంత్. నువ్వు గాయపడ్డావు. గాయపడిన అంశాన్ని నువ్వు ఆమోదించాలి. ఆమోదిస్తేనే నీకు ప్రశాంతత చేకూరుతుంది. నువ్వు ఆమోదించలేదనుకో. కోపం వస్తుంది. ఆ కోపంలో నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటావో చెప్పలేం. ఒక విషయం గుర్తు పెట్టుకో. రవళి విషయమే కాదు ఎవరూ నిన్ను బాధ పెట్టినా బాధపడకుండా దాన్ని ఆమోదించడం అలవాటు చేసుకోవాలి. ఆమోదిస్తే అది క్షమించడం అవుతుంది. ఆమోదించకపోతే మనలో పగ ద్వేషం పెరిగిపోతాయి. ఏదైనా విషయాన్ని ఆమోదించి వ్యవహరిస్తే అది పాజిటివ్ భావోద్వేగం అవుతుంది. ఆమోదించక వ్యవహరిస్తే నెగెటివ్ భావోద్వేగం అవుతుంది.’
శ్రీకాంత్ ఏమీ మాట్లాడలేదు. తన థీసిస్ మీద దృష్టి కేంద్రీకరించాడు. ఆ తరువాత అమెరికా వెళ్లిపోయాడు. చాలాకాలం తరువాత తెలిసింది అమెరికాలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని.

మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు పంపించవచ్చు.

-జింబో 94404 83001