S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

టీవీ జ్ఞాపకాలు- సండేగీత

ఇప్పటి తరం బెడ్‌రూంలో కూర్చొని పల్చటి టీవీలో చానల్స్ మారుస్తూ టీవీ ప్రోగ్రామ్స్ చూడటం గమనించినప్పుడు మా చిన్నప్పటి విషయాలు గుర్తుకొచ్చి ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటి టీవీల్లో ఎంత స్పష్టత, ఎంత శ్రావ్యత. ఓహ్! ఈ తరం అద్భుతమైన బొమ్మల్ని, కదిలే చిత్రాలని చూస్తోందని అన్పించింది.
నా చిన్నప్పుడు టీవీ లేదు. ఉన్నది ఒకే ఒక్క మర్ఫీ రేడియో. అందులో వచ్చేవి రెండే రెండు ప్రోగ్రామ్స్. బుధవారం రోజు ‘బినాకా’ గీత్‌మాలా. అది సిలోన్ కేంద్రం నుంచి. హైదరాబాద్ ఆకాశవాణి నుంచి కొన్ని వినోద కార్యక్రమాలు వచ్చేవి. అందులో ముఖ్యమైంది. రెండున్నరకి బాలానందం. మూడు గంటలకి సంక్షిప్త శబ్ద చిత్రం. అందరమూ గుమిగూడి తక్కువ సౌండ్‌తో రేడియో పెట్టి వినేవాళ్లం. అది కూడా ఒక్క ఆదివారం రోజే.
ఆ తరువాత నేను యుక్త వయస్సులో వున్నపుడు మా ఇంటికి నలుపు తెలుపు టీవీ వచ్చింది. అప్పుడది అద్భుతం. ఓ గొప్ప సంచలనం. దూరదర్శన్ తప్ప అందులో వేరే ఛానల్స్ ఏవీ వచ్చేవి కావు. వారంలో ఒక్క తెలుగు సినిమా. ఒక్క రోజు చిత్రలహరి. వాటినే ఎంతో ఇష్టంగా చూసేవాళ్లం. నలుపు తెలుపు టీవీని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాళ్లం. దానికి ఓ స్టాండ్. దాని మీద ఓ డబ్బాలో టీవీ. దాని స్క్రీన్ పగలకుండా చుట్టూ తలుపులు. కొద్ది రోజులు లైట్లు ఆర్పి చూసేవాళ్లం. అది మంచిది కాదని లైట్ వెలుతురులో చూడటం మొదలుపెట్టాం. టీవీలో అప్పుడప్పుడు బొమ్మ సరిగ్గా రాకపొయ్యేది. చుక్కలు చుక్కలు వచ్చేవి. అప్పుడు పరుగెత్తి బంగ్లా మీదికి వెళ్లి ఆకాశంతో పోటీ పడుతున్న ఆంటెన్నాని అటు ఇటూ కదిపి బొమ్మ మంచిగ వచ్చిన దిశగా దాన్ని మార్చి టీవీ చూసేవాళ్లం.
ఆదివారం రోజు మా హాలు జాతరలాగా వుండేది. రామాయణ, మహాభారత సీరియల్స్. ఎంతో దీక్షగా వాటిని చూసేవాళ్లు మా ఇంటి చుట్టుపక్కల వున్న వాళ్లంతా. మా ఊరు ఊరంతా స్తంభించిపోయి ఆ సమయంలో టీవీలను చూసేవాళ్లు.
ముప్పై నలభై సంవత్సరాల్లో చాలా మార్పులు వచ్చేశాయి. ఇప్పుడు సీరియళ్లు, సినిమాలు, వార్తా ఛానళ్లు ఎన్నని చెప్పేది. అయితే ఒకటే భేదం కన్పిస్తుంది. అప్పుడు మహాభారత, రామాయణాలకే అంకితమయ్యేవాళ్లు. ఇప్పుడు టీవీలకే అంకితమై పోయారు.