S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆ రెండూ ధరించొద్దు

మిథున లగ్నం: మిథున లగ్న జాతకుల విషయంలో చాలా విచిత్ర స్థితి ఉంటుంది. పుష్యరాగం, పగడం ధరించటం శ్రేయస్కరం కాదు. వీరికి సహజంగా పచ్చగానీ, ముత్యం కానీ సరిపడతాయి. అయితే కేవలం పచ్చ విషయంలో కూడా జాతకంలో బుధ సంచారం అధిక స్థాయి శోధన చేసిన తరువాత మాత్రమే నిర్ణయింపజేయాలి. కారణం బుధుడు నైసర్గిక శుభ గ్రహం అయిననూ ‘బుధః పాప యుతః పాపః’ అనే సూత్రం ప్రకారం పాపగ్రహములతో కలిసినప్పుడు పాప గ్రహం అవుతారు. అటువంటి సమయంలో ఫలితాలు మార్పులు తీసుకుంటాయి. ఇక వజ్రధారణ చూద్దాం అంటే శుక్రుడికి వ్యయాధిపత్యం వున్నది. నీలం విషయం చూస్తే శనికి అష్టమాధిపత్యం వున్నది. పగడం విషయంలో కుజుడికి షష్ఠ్ధాపత్యం. ఇలాగ మిశ్రమ ఆధిపత్యాలు మరియు అనుకూలం లేని జాతిరాళ్లు అవుతున్నాయి. ఇక మరొక విషయం ఈ మిథున లగ్నం వారు తరచుగా జాతి రాళ్లు మార్పు చేస్తూ ఉంటారు. అదీ గమనించాలి. కారణం ఏ రత్నమూ కూడా పూర్తిగా ప్రశాంత ఫలితాలు ఇవ్వదు. ఇక మరో విషయం. నవరత్నాలు కలిపి ధరిస్తే ఇటువంటి లగ్నాల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక లగ్నం జన్మ లగ్నంగా వున్న వారికి కూడా కొంత పోలిక ఉంటుంది. వీరికి పుష్యరాగం విషయంలో గురువుకు షష్ఠ్ధాపత్యం దృష్ట్యా నీలం విషయంలో శనికి అష్టమాధిపత్యం దృషాట్య ఈ రెండూ ధారణకు తగవు. పచ్చ, వజ్రం ఎప్పుడూ నిషేధమే. వీరికి కెంపు మరియు ముత్యం, పగడం విషయం సర్వదా శ్రేయస్కరం. ఇలాగే ప్రతీ లగ్నమునకు శోధన చేయవలెను. ఈ రీతిలో సింహ లగ్న జాతకులకు ముత్యం, వజ్రం, పుష్యరాగం, నీలం ధారణ విషయంలో ప్రత్యేకమయిన శ్రద్ధతో కూడిన పరిశీలన అవసరం. కెంపు, పచ్చ, పగడం విశేషంగా యోగిస్తాయి. మరి పగడం విషయంలో కూడా సింహ లగ్న జాతకులు ధనిష్ఠ 1,2 పాదములలో పుట్టిన వారికి పగడము, ఆశ్రేష నక్షత్రంలో పుట్టిన వారికి పచ్చ మరియు ఉత్తరాషాఢ 2,3,4 పాదములలో పుట్టిన వారికి కెంపు శ్రేష్ఠం కాదు. ఇలాగే ఇతర లగ్నముల విషయంగా కూడా పరిశీలించాలి.
నక్షత్ర సంచారం దృష్ట్యా కేవలం రాయి నిర్ణయం చేయడం అనే అంశం ఆధారంగా ఫలితాలు చెప్పరాదు.
* నక్షత్రాధిపతికి లగ్నాత్ వచ్చిన ఆధిపత్యాలు దృష్టిలో వుంచి నిర్ణయించాలి. * లగ్నాత్ ఆధిపత్యాలు మంచి చెడు శోధించాక దానికి సంబంధంగా వున్న నక్షత్ర స్థితి ఆధారంగా మరి జాతి రత్నం నిర్ధారించాలి. * జన్మ నక్షత్రం, లగ్నాత్ ఆధిపత్యాలు, ఆధిపత్యాల రీత్యా చంద్ర సంచారం సరి చూడకుండా నిర్ణయం చేయు జాతి రత్నాలు శ్రేయోదాయకమయిన ఫలితాలు ఇవ్వవు. ఉదాహరణ - మకర లగ్నం వారికి వజ్రం అనుకూలమే. అయితే పుబ్బ, పూర్వాషాఢ జన్మ నక్షత్రాలుగా వున్న మకర లగ్నం వారు వజ్రం పెట్టుకుంటే ఇబ్బంది తప్పక పొందుతారు.
--
కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)
కామకోటినగర్, శంకరమఠం వీధి, నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012.

కప్పగంతు సుబ్బరామశర్మ -9848520336