S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆడపిల్లల హక్కులను పరిరక్షిస్తేనే బంగారు తెలంగాణ సాధ్యం

కొత్తకోట, మే 13: ఆడపిల్లల హక్కులను పరిరక్షించినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమని జిల్లా కలెక్టర్ శ్రీదేవి అన్నారు. శుక్రవారం కొత్తకోటలోని శివగార్డెన్‌లో బాలల, మహిళల చట్టాలపై వనపర్తి, గద్వాల డివిజన్ సంబందించిన ఆర్‌డిఓ, తహశీల్దార్, ఎంపిడిఓ, సిడిపిఓ, వైద్యాధికారుల సమావేశానికి ఆమె పాల్గొని మాట్లాడారు. మనస్పూర్తిగా దేనినైనా కోరుకుంటే ఆది నేరవేరుతుందని, జిల్లా వెనకబాటు తనానికి బాల్య వివాహాలను రూమాపాలని, చట్టాలను అమలు చేయడంలోఎవరు బాధ్యతగా వ్యవహరించకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, అందరు చట్టాలను తెలుసుకొని వాటిని అమలు చేయాలని ఆమె అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 116 బాల్యవివాహాలను అడ్డుకున్నామని, జిల్లా బాల్య వివాహాల్లో అగ్రస్ధానంలో ఉన్నామని, అలాగే మాత శిశుమరణాల్లో అగ్రస్ధానాల్లో ఉన్నట్లు ఆమె తెలిపారు. బాల్య వివాహాలు, మాత శిశుమరణాలను తగ్గించేందుకు ఆధికారులు కృషి చేయాలని, పల్లె వికాసంలో గర్బిణిలను, బాలింతలను గుర్తించేందుకు ఆధికారులు పని చేస్తున్నారని, వెనకబడ్డ జిల్లాలో ఎంతో ఖర్చు పెట్టి బాల్య వివాహాలను చేసుకుంటున్నపుడు ఆధికారులు ఆడ్డుకుంటే వారికి విలన్‌లుగాఅగుపిస్తారని, అలాంటి వివాహాలకు పెట్టిన పురోహితుడు, బందువులు, పెళ్లి భోజనం చేసిన వారిని శిక్షిస్తామని ఆమె అన్నారు. వయస్సు నిర్ధారించే వైద్యాధికారులు జాగ్రత్తలు వహించాలని, ఆధికారులు చిత్త శుద్దితో పని చేయాలని ఆమె అన్నారు. బాల్య వివాహాలు జరుగుతున్నపుడు సమాచారం వస్తే జాప్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. కెజిబివిలో జిల్లాలో 65 పాఠశాలలు ఉన్నాయని, ఈ విద్యా సంవత్సరం నుండి 10 కెజిబివి పాఠశాలల్లో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టేందుకు బడ్జట్‌ను రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆడపిల్లలకు స్వేచ్చకల్పిస్తే ఉన్నత స్థానాలకు ఎదుగుతారని, గ్రామ స్థాయిలో చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే సమాజంలో వివక్షత ఉండదన్నారు. విద్యతో బాల్యవివాహాలను అడ్డుకోవచ్చునని, విద్యలేక పోవడమే వెనుకబాటు తనానికి ప్రధాన కారణమన్నారు. బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని అమె సూచించారు. అంతకు ముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు జెసి బాలాజి రంజిత్ ప్రసాద్, ఆర్డీఓలు రాంచందర్, అమీద్, ఐసిడిఎస్ పిడి జోత్స్న, జడ్పీటిసి పిజె బాబు, సర్పంచ్ చెన్నకేశవ రెడ్డి, వివిద మండలాల తహశీల్దార్, ఎంపిడిఓలు, విఆర్‌ఓలు పాల్గొన్నారు.