S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రాజెక్టుల్లో అడుగంటిన నీరు

కామారెడ్డి, మే 13: జిల్లారైతాంగానికి వరప్రదాయినిలుగా నిలుస్తున్న నిజాంసాగర్ ప్రాజెక్ట్, మధ్యతరహా ప్రాజెక్ట్ అయిన పోచారం ప్రాజెక్ట్, ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన కల్యాణి, సింగితం ప్రాజెక్ట్‌ల్లో నీరు పూర్తిగా అడుగంటిపోయంది. నిజాంసాగర్, పోచారం ప్రాజెక్ట్‌ల్లో జలకళ లేకుండా పోయి ఎడారిగా దర్శనిమిస్తోంది. జిల్లా రైతాంగానికి ఎలాగు పంటలకు నీరు అందించని నిజాంసాగర్ ప్రాజెక్ట్ కనీసం జిల్లా ప్రజానీకానికి తాగునీరు సైతం అందించలేని దుస్థితికి చేరింది. కామారెడ్డి డివిజన్‌లోని ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లోని పోచారం ప్రాజెక్ట్, కల్యాణివాగు ప్రాజెక్ట్, సింగితం ప్రాజెక్ట్‌ల్లో జలకళ లేకుండా పోయిది. గత రెండేళ్లుగా ఆయకట్టు రైతులకు నీరు సరిగ్గా అందక పోవడంతో చేసిన అప్పులు కంటి ముందు కన్పిస్తుంటే పిడికెడు మెతుకులకు నోచక, చేసిన అప్పులు తీర్చాలంటే వలసలు తప్పవంటూ ఇప్పటికే కామారెడ్డి, బోధన్ డివిజన్‌లలోని జుక్కల్, ఎల్లారెడ్డి సెగ్మెంట్‌ల నుండి భారీ సంఖ్యలోనే బతుకు దెరువు కోసం చాలా మంది పట్టణాల వైపు వలసబాట పట్టారు. వరుస కరువులతో రైతన్నలకు వలసలు తప్పడం లేదు. గత ఏడాది కూడా వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సీజన్ చివరలో వర్షాలు కురిసినప్పటికీ రైతులు పంటలు పండించుకోలేక పోయారు. వర్షాకాలం చివరన కురిసిన వర్షాలకు పోచార ప్రాజెక్ట్‌లో నీరు వచ్చినప్పటికీ, ఈనీరు రబీలో ఎల్లారెడ్డి మండల రైతులకు వదిలి నప్పటికీ, నీరు సరిపోక చివరి ఆయకట్టు రైతులు వేసిన పంటలు ఎండిపోయి నష్టపోక తప్పలేదు. వంతులవారీ పద్ధతిన ఎల్లారెడ్డికి రబీ పంట వచ్చినా లాభం లేకుండా పోయింది. ఈసారి అయితే నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి రెండు మండలాల రైతుల పంటలు పండించుకోలేక పోయారు. బోర్‌బావుల వద్ద అది కూడా బోరుబావుల్లో కాస్తో కూస్తో నీరున్న రైతులు కొన్ని ఎకరాల్లో పంటలు పండించుకున్నప్పటికీ అవి కూడా దిగుబడి లేక రైతన్నకు దిగాలు తప్పలేదు. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుండి వర్షాలు నిరాశజనకంగా ఉండటంతో డివిజన్‌లోని పోచారం ప్రాజెక్ట్, కల్యాణివాగు ప్రాజెక్ట్‌లో నీరు లేకుండా పోయింది. పోచారం ప్రాజెక్ట్ 2013లో కురిసిన వర్షాల వల్ల నిండిపోయి జలకళతో ఉట్టిపడి పర్యాటకుల మదిని దోచింది. కాని రెండేళ్లుగా పోచారం ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులకు మాత్రం నిరాశే మిగిల్చింది.
పోచారం ప్రాజెక్ట్ ఆయకట్టు కింద నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో అధికారికంగా 10,500ఎకరాలు మాత్రం ఉన్నప్పటికీ, ప్రాజెక్ట్ నిండితే ఈ ప్రాజెక్ట్ 20వేల ఎకరాల వరకు నీరు అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌కు పర్యాటక సొబకులు వస్తాయనుకుంటే నేటికీ ఎక్కడి గొంగళి అక్కడే అన్నచందంగా ఉంది. ఏది ఏమైనా పోచారం ప్రాజెక్ట్ ఆయకట్టు పరిధిలో ఖరీఫ్‌లో రెండు మండలాల రైతులు పంటలు పండిస్తే, రబీలో మాత్రం వంతుల వారీ పద్ధతి కొనసాగిస్తూ పంటలు సాగుచేస్తుంటారు. బోరుబావుల్లో సైతం నీరు అడుగంటడంతో వందలాది ఎకరాల్లో పంటలను కొందరు దునే్నయగా, మరి కొందరు పశువులను మేతకు వదిలేయక తప్పలేదు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో ఈ ఎండకాలం ఎండలతో అల్లాడిపోతున్న రైతన్న వర్షాల కోస ఎదురు చూడక తప్పదు. పోచారం ప్రాజెక్ట్‌సాగునీటితో పాటు తాగునీరు కూడా అందిస్తోంది. కానీ నీరు లేక పోవడంతో ఈసారి తాగునీటి ఎద్దడి ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల్లో తీవ్రంగా ఉంది. నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు జూన్, జూలైలో 1టిఎంసీ నీటిని అందించేందుకు డివిజన్‌లోని ఎల్లారెడ్డి మండలంలోని కల్యాణివాగు ప్రాజెక్ట్ అయితే పూర్తిగా ఎండిపోయింది. కనీసం కల్యాణివాగులో చుక్కనీరు లేక పోవడంతో ఈ ప్రాజెక్ట్ చుట్టు పక్కల బోరుబావులు సైతం వట్టిపోయాయి. ఈ ఖరీఫ్‌లో చుక్కనీరు కూడా నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు అందించలేక పోయింది. ప్రతిసారి సెప్టెంబరులో కొద్దిపాటి నీటిని అయినా నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు అందించే కల్యాణివాగు ప్రాజెక్ట్ వర్షాభావ పరిస్థితుల వల్ల వట్టిపోయింది. ఎండిపోయిన ప్రాజెక్ట్‌లో మళ్లీ ఎప్పుడు జలకళ వస్తుందో తమ అప్పులు ఎప్పుడు తీరుతాయోనని రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు భాగానే కురుస్తాయిన్న సమాచారం మాత్రం రైతుల్లో కొత్త ఆశను చిగురింప చేస్తోంది.