S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉమ్మడి సర్వేకు ముహూర్తమెప్పుడో..?

బోధన్, మే 13: మహారాష్ట్ర - తెలంగాణ రాష్ట్రాల నడుమ ప్రవహిస్తున్న మంజీర నది పై మహారాష్ట్ర ఆధిపత్యం ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది. సమైక్య పాలనలో మొదలైన మరాఠా దోపిడీ నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆగడం లేదు. నదిలో ఉన్నటువంటి ఇసుక నిలువలను మహారాష్ట్ర సర్కారు ఎంచక్కా అమ్మేసుకుని అక్కడి ఖజానా నింపుకుంటోంది. ప్రతీ వేసవిలో ఎడాపెడా ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంతో క్వారీల నిర్వాహకులు మహారాష్ట్ర భూ భాగం దేవుడెరుగు కానీ తెలంగాణ భూభాగంలోని ఇసుక నిలువలను దర్జాగా దోచేస్తున్నారు. ఈ నిలువు దోపిడీ కళ్లెదుటే ఏళ్ల తరబడి జరుగుతున్నా సరిహద్దుల వ్యవహారం ఎటూ తేలకపోవడంతో తెలంగాణ ప్రాంత అధికారులు సైతం ఏమీచేయలేక పోతున్నారు. నాలుగేళ్ల క్రితం ఈ దోపిడీ వ్యవహారం వివాదాస్పదంగా మారడంతో అప్పటి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వరప్రసాద్ మంజీరాలో జరుగుతున్న మరాఠా దోపిడీకి కళ్లెం వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దాంతో దిగివచ్చిన మహారాష్టక్రు చెందిన రెవెన్యూ అధికారులు ఉమ్మడి సర్వేకు శ్రీకారం చుట్టారు. అప్పుడు నిజామాబాద్ జిల్లా సంయుక్త కలెక్టర్ హర్షవర్థన్, బోధన్ ఆర్డీవో సతీష్ చంద్రల ఆధ్వర్యంలో మంజీరా నదిలో మహారాష్టల్రోని నాందేడ్, ధర్మాబాద్, బిలోలి తాలూకాలకు చెందిన రెవెన్యూ అధికారులు మ్యాప్‌లు తీసుకొని వచ్చి సర్వేలకు శ్రీకారం చుట్టారు. మంజీరా నదిలో రెండు రాష్ట్రాల నడుమ తాత్కాలిక సరిహద్దులు ఏర్పాటు చేశారు. కానీ ఈ సర్వేలు ఆ ఒక్క సంవత్సరానికే పరిమితం కావడంతో మరాఠా దోపిడీ మళ్లీ మొదటి కొచ్చేసింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు ఉమ్మడి సర్వే నిర్వహించి పక్కా హద్దులు పెడితే గానీ మంజీర దోపిడీకి కళ్లెం పడే అవకాశాలు కనిపించడం లేదు. మంజీరా దోపిడీ వలన తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లడమే కాకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన రోడ్లు సైతం దెబ్బతింటున్నాయి. అక్కడి ఇసుకను నింపుకుని వందలాది లారీలు తెలంగాణ లోనికి వస్తుండటం వలన ఇక్కడి రోడ్లన్నీ దెబ్బతింటున్నాయి. ఇసుక నిలువల తవ్వకాల అనుమతుల పేరిట కోట్లాది రూపాయలు మరాఠా ఖజానాలో పడుతున్నాయి. మంజీరాలో అడ్డగోలు తవ్వకాలకు మరాఠా అధికారులు కూడా అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల నడుమ ఉన్నటువంటి మంజీరాలో ఇసుక క్వారీల నిర్వాహకులు అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతున్నారని తెలిసి గత ఏడాది అప్పటి నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించిన ప్రస్తుత మెదక్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ మంజీరా పరివాహక మండలాల రెవెన్యూ అధికారులు పడుతున్న ఇబ్బందులు చూసి, మరాఠా దోపిడీకి కళ్లెం వేసేందుకై కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఓవర్‌లోడ్‌లతో వచ్చే లారీలకు భారీగా జరిమానాలు విధించడమే కాకుండా క్వారీల నిర్వాహకులు తెలంగాణ భూభాగంలో చొచ్చుకొని రాకుండా మరిన్ని కట్టుదిట్ట మైన చర్యలు చేపట్టారు. మహారాష్టల్రోని నాందేడ్ జిల్లా కలెక్టర్‌కు నాలుగు సార్లు లేఖలు కూడా రాశారు. అయినా ఇప్పటి వరకు ఉమ్మడి సర్వేలకు మాత్రం మోక్షం కలుగకుండా పోయింది. గత ఐదేళ్లుగా బోధన్ ఆనుకుని ఉన్న మహారాష్టల్రోని ఏస్గీ, బోలేగాం, గంజుగామ్ క్వారీల నుండి పెద్ద ఎత్తున ఇసుక దోపిడీకి గురయిన సంగతి విదితమే. ఈ తంతు నేటికీ కొనసాగుతుండటమే కాకుండా మంజీరా తలాపునే ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలు ఒట్టిపోతున్నాయి. ఈ దోపిడీకి శాశ్వత పరిష్కారం కేవలం ఉమ్మడి సర్వేలు జరిపి సరిహద్దులు తేల్చాల్సిందేనని స్పష్టంగా కనిపిస్తున్నా అందుకు అనుగుణంగా రెండు రాష్ట్రాలలో కూడా చర్యలు కనిపించడం లేదు. సాగునీటి పథకాల విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపుతున్నప్పటికీ మంజీరా సరిహద్దుల విషయంలో చొరవ చూపక పోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఈ మంజీరా నది వలన మరాఠా సర్కారుకు కాసుల వర్షం కురుస్తుండగా తెలంగాణకు మాత్రం పూర్తిగా నష్టం వాటిల్లుతోంది. మంజీర దోపిడీకి కళ్లెం వేసేందుకు సమైక్య పాలకులు చొరవ చూపకున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వమైనా ప్రత్యేక చొరవ చూపి మంజీరా ఇసుక నిలువలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. ఉమ్మడి సర్వే జరిపి సరిహద్దులు ఏర్పాటు చేస్తే మంజీరాలో మరాఠా దోపిడీకి పూర్తి స్ధాయిలో కళ్లెం పడే అవకాశాలు ఉన్నాయి.