S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లీలావతి (శాస్ర్తియ ఆవిష్కరణలు)

క్రీ.శ.1150లో ప్రఖ్యాత గణిత శాస్తవ్రేత్త మరియు వేద సంప్రదాయ ఖగోళశాస్తజ్ఞ్రుడు అయిన భాస్కరాచార్య తన పెద్ద గ్రంథం ‘సిద్ధాంత శిరోమణి’లో ప్రథమ భాగమైన లీలావతిని పూర్తి చేశాడు. ఈ గ్రంథం సంఖ్యాగణితము, బీజ గణితము, రేఖా గణితము, క్షేత్ర గణితములకు సంబంధించిన సమగ్ర విస్తృత వివరణతో కూడి వున్నది. ఇంకా సంఖ్యా సిద్ధాంతము మరియు ఇతర సంబంధిత విషయాలు కూడా ఇందులో పొందుపరచబడ్డాయి. ‘లీలావతి’ ఒకే ప్రామాణికమైన పాఠ్య పుస్తకంగా 800 సంవత్సరాలు ఉపయోగించబడింది. సరళమైన, విద్యాపరమైన మరియు సాహితీపరమైన ఈ గొప్ప పుస్తకం అనేక భాషలలోనికి అనువాదం చేయబడింది.
అతడి సంఖ్యా గణితానికి సంబంధించిన పుస్తకం, ఆసక్తికరమైన గాథలకు మూలం. ఇది ఆయన తన కుమార్తె లీలావతి కోసం రాసినదని స్పష్టం చేయడం జరిగింది. లీలావతికి పర్షియన్ తర్జుమాలో కనపడిన విషయం - భాస్కర-2 లీలావతి యొక్క జాతకాన్ని పరిశీలించి, ఒక ప్రత్యేక సమయంలో వివాహం గనుక జరుగకపోయినట్లయితే, వివాహం జరిగిన వెంటనే ఆమె భర్త మరణిస్తాడని జోస్యం చెప్పాడు. ఆమెను సరైన సమయానికి అప్రమత్త పరచడానికి ఆయన అడుగున చిన్న రంధ్రంగల ఒక కప్పను, నీటితో నింపబడిన ఒక పాత్రలో వుంచాడు. అది ఓ ప్రత్యేక ఘడియ ప్రారంభ సమయంలో మునిగిపోయే విధంగా ఆయన ఏర్పరచటం జరిగింది. ఈ పరికరాన్ని ఆయన ఒక గది మూలలో వుంచి, లీలావతిని దాని దగ్గరకు వెళ్లవద్దని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె కుతూహలంతో అక్కడకు వెళ్లి చూడటం, ఆమె ముక్కు రింగులో నుండి ఒక ముత్యం జారి అందులో పడి, దానిని భగ్నం చేయడం జరిగింది. ఆమె వివాహం ఒక సరైన కాని సమయంలో జరిగి వెంటనే ఆమె వితంతువుగా మారిపోయింది.
ఈ పుస్తకంలో సంఖ్యాశాస్త్ర సంబంధమైన పదాలు, వడ్డీ లెక్కలు, ప్లేన్ జామెట్రీ, నీడ గడియారపు ముల్లు అనిశ్చయ సమీకరణలు మరియు కూడికల యొక్క సమీకరణాల సాధన కోసం ఉపయోగించే కట్టుక పద్ధతి, ప్రధానంగా నిర్వచనాలతో కూడిన 13 అధ్యాయాలున్నాయి.

-బి.మాన్‌సింగ్ నాయక్