S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పనిమనిషి

నేను మేజిస్ట్రేట్‌గా ఉద్యోగంలో చేరిన తరువాత ట్రైనింగ్ కోసం హాస్టల్లో వున్నాను. ప్రతి క్లాసుని శ్రద్ధగా విని నోట్స్ రాసుకొని శ్రద్ధగా చదువుకునేవాడిని. ఎప్పుడు ఏ టెస్ట్‌ని పెట్టినా, క్విజ్‌ని పెట్టినా నేను మొదటి ఐదుగురిలో వుండేవాడిని.
ఒకరోజు క్విజ్‌లో చివరి ప్రశ్న ఈ విధంగా ఉంది. ‘రోజూ మీ క్లాస్‌రూంని తుడిచే మనిషి పేరేమిటి?’ ఆ ప్రశ్న ఏదో సరదాగా వేశారేమోనని అన్పించింది.
మా క్లాసురూంని శుభ్రపరిచే మహిళని చాలాసార్లు చూశాను కానీ ఆమె పేరును తెలుసుకోలేదు. ఆమె బక్కగా తెల్లగా ఉంటుంది. యాభై సంవత్సరాలు దాటి ఉంటాయి. ఆ ప్రశ్నకి జవాబు రాయకుండా వదిలేశాను. 49 ప్రశ్నలకి ఒక్కో మార్క్ అయితే ఆ ప్రశ్నకి పది మార్కులు కేటాయించారు. అది అన్యాయంగా తోచింది. ఆమె పేరు మాకు ఎందుకు తెలుస్తుందని చాలామంది అనుకున్నారు.
ఆ ప్రశ్నకి జవాబు ఎవరూ రాయలేదు.
అందరి మార్కులు చెప్పి మా డైరెక్టర్ ఇట్లా చెప్పారు.
‘ఈ ప్రశ్నకి ఎవరూ సమాధానం రాయలేదు. ఒకరిద్దరు రాశారు కానీ కరెక్టుగా రాయలేదు. మీ ఉద్యోగ కాలంలో ఎంతోమంది వ్యక్తులని చూస్తారు. అందరూ ప్రత్యేకత వున్నవాళ్లే. మీ దృష్టి వాళ్లందరి మీదా అవసరమే! ఓ చిరునవ్వుతో వాళ్లని పలకరించాలి. వాళ్ల పేరుతో పలకరించాలి. పనిమనిషిగా కాదు.’