S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సుఖశాంతులతో జీవితాన్ని గడపడం ఎలా?

మన జీవితాన్ని ఆనందంగా సుఖశాంతులతో గడపడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ప్రధానంగా మనిషి జీవితానికి చుక్కాని అతని ఆలోచనలే.
రిమనిషి తన ఆలోచనలతో శాంతి, ఆరోగ్యం, ధైర్యం, ఆశలతో మనసును సుసంపన్నం చేసుకోవాలి.
రిశత్రువులు అనేక కారణాలుగా తయారవుతారు. వారి మీద ద్వేషం పెంచుకుని పగ సాధించాలనే ధోరణి మొదలయితే శత్రువుకు జరిగే హానికన్నా మీకే ఎక్కువ హాని కల్గుతుంది.
రిఎదుటివారికి ఉపకారం చేయడంలో వెనుకాడకూడదు. కాని ఉపకారం పొందిన వాని వద్ద నుండి కృతజ్ఞత కోసం ఎదురుచూడకూడదు. అది చాలా నిరాశపరచి మనసును కలచి వేస్తుంది.
రిఇతరులకు ఇవ్వడంలోని ఆనందాన్ని పొందాలి.
రితరచూ మీకు ఎదురవుతున్న కష్టాలను గుర్తు తెచ్చుకుని కృంగిపోకూడదు. మీకు లభించిన సుఖాలను జ్ఞప్తికి తెచ్చుకుని పొంగిపోవాలి.
రిమీరు ‘మీలాగే’ ఉండాలి. ఇతరుల వలె ఉండాలనే ప్రయత్నం చేయకూడదు. అనుకరణ ఆత్మహత్యతో సమానమని మరువకండి.
గుర్తుంచుకోండి!
రిమనకి సంతోషకరమైన ఆలోచనలు ఉంటే ఆనందంగా ఉంటాం.
రిఎప్పుడూ బాధల గురించి ఆలోచిస్తూ ఉంటే బాధపడుతూనే ఉంటాం.
రిభయంతో కూడిన ఆలోచనలు ఉంటే భయపడుతూ జీవిస్తాం.
రిఅనారోగ్యం గురించి ఆలోచిస్తే అనారోగ్యం ముట్టడిస్తుంది.
రిఓటమి గురించి ఆలోచిస్తే ఓటమి పాలవుతాము.
రితన మీద తను జాలిపడే వారిని ఎవ్వరూ ఇష్టపడరు.
రిమనిషి వ్యతిరేక దృక్పథానికి బదులు అనుకూల దృక్పథం అలవరచుకోవాలి.
రిమీ సమస్యల గురించి మీరు పట్టించుకోవాలి. మధనపడకూడదు.
రిసమస్యలను పట్టించుకోవడం అంటే సమస్యను అర్థం చేసుకుని, పరిష్కార మార్గాలు అవలంబించడం.
రిమనం పొందే మనశ్శాంతి, ఆనందం మన మనోవైఖరిపై ఆధారపడి ఉంటుంది. బాహ్య పరిస్థితులకు వీటికి ఎటువంటి సంబంధం ఉండదు.
మరచిపోకండి!
రిమనసు ఎంత గొప్పది అంటే అది తనలోని నరకాన్ని స్వర్గంగా మార్చగలదు. స్వర్గాన్ని నరకంగా మార్చగలదు.
రిమన శరీరంలోని ఒక వ్రణాన్ని తొలగించడంకన్నా మనసులోని ఒక చెడు ఆలోచనను తొలగించడం కష్టం. దాని గురించి తీవ్రంగా ఆలోచించాలి.
రిఆసుపత్రిలో చేరే రోగుల్లో ఎనభై శాతం మంది భావాల ఒత్తిడీ, అణచివేత కారణంగా జబ్బులు తెచ్చుకుంటున్న వారే అని ఒక మానసిక శాస్తవ్రేత్త అన్న మాటలు ఎవరూ మరచిపోకూడదు.
రిభావనలు వెనుక చర్యలు వస్తాయి. (లేదా) భావనలు చర్యలు కలిసే ఉంటాయి. అందుకే మన మనశ్శక్తిని అదుపులో పెట్టగల చర్యలను క్రమబద్ధం చెయ్యగలిగితే మన అదుపులో లేని భావాలను మనం పరోక్షంగా క్రమబద్దం చేసుకోగల్గుతాం.
రిఒక వ్యక్తి ఎదుటి వారి పట్ల తన ఆలోచనలను సమూలంగా మార్చుకున్నట్లయితే ఆ మనుషులు మారినట్లు అతనికి అనిపిస్తుంది.
రిమనం చెడు అనుకునే దాంట్లో ఏదో ఒక బలాన్ని ఇచ్చే ఔషధం ఉండవచ్చు. అందుకే బాధపడుతున్న వ్యక్తి దృక్పథాన్ని భయం నుంచి పోరాటం వైపు మళ్లించాలి.
పగ అసలైన శత్రువు
రిశత్రువులను ద్వేషించి పగ పెంచుకోవడం వల్ల ఆ పగ మీకు అసలైన శత్రువు అవుతుంది.
రిపగ కారణంగా మన నిద్ర, ఆకలి, ఆరోగ్యం, ఆనందం శత్రువు ఆధీనంలోకి వెళ్లేటట్లు అవకాశం ఇస్తారు.
రిమన పగ, ద్వేషం శత్రువుని ఏమీ చేయలేవు కాని అవి మన జీవితాన్ని నిరంతరం నరకప్రాయం చేస్తూ ఉంటాయి.
రిఎవరైతే మిమ్మల్ని వారి స్వార్థానికి వినియోగించుకుంటారో లేదా అలా ప్రయత్నిస్తారో వారికి దూరంగా ఉండాలి. వారి మీద పగ సాధించే ప్రయత్నాలు చేయకూడదు.
రిమనిషికి ఎడతెగని ద్వేషం ఉంటే అతడికి నరాల ఒత్తిడి, గుండె జబ్బులు వస్తాయి.
రిద్వేషం, పగ వల్ల మనలోని శక్తి తగ్గిపోతుంది. సులువుగా అలసటకు గురవుతూ ఉంటాం. మన ఆయుష్షు కూడా తగ్గుతుంది.
రిమీ శత్రువుకు మీ మెదడులో చోటు ఇచ్చారంటే అది మిమ్మల్ని కాల్చేస్తుంది.
రిఇష్టంలేని వారి గురించి ఆలోచించి మీ సమయాన్ని వృధా చేసుకోకండి.
మీ సంపదలు తలచుకోండి!
రితనకు జోళ్లు లేవని బాధపడిన వ్యక్తి కాళ్లు లేని మనిషిని చూసి తనకు కాళ్లు ఉన్నాయని అది తన సంపనుకున్నాడు!
రిమనం మనకున్న దాని గురించి అరుదుగాను, లేని దాని గురించి తరచుగాను ఆలోచిస్తూ ఉంటాం. ఇది మానవ నైజంలో ఒక గొప్ప విషాదం.
రిమనిషి విసుక్కోవటం, కోపం తెచ్చుకోవడం వంటి అవలక్షణాలు పోగొట్టుకోకపోతే అతని ఆరోగ్యం, వ్యాపారం దెబ్బతినడమేగాక, కుటుంబాన్ని, స్నేహితులను కూడా దూరం చేసుకుంటాడు.
రిప్రతి సంఘటనలోను మంచి చూడడం అలవరచుకుంటే ఏడాదికి కోటి రూపాయలు సంపాదించిన దానికన్నా విలువైన సంపద మీ చెంత ఉన్నట్లే.

-సి.వి.సర్వేశ్వరశర్మ