S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మానవ గోపురం

స్పెయిన్‌లో ఒక ఉత్సవం జరుగుతుంది. అది మన దేశంలో కృష్ణాష్టమికి ఉట్టికొట్టే ఉత్సవం లాంటిది. దానిని ‘లామెర్సి’ అంటారు. దీనిని ‘కాటలోనియా సంస్కృతి’ అంటారు. ఉత్సవంలో ఉత్సాహవంతులంతా బృందాలుగా పాల్గొంటారు. వంద నుండి రెండు వందల మంది వరకూ ఉండే ఈ బృందంలోని వారు కలిసి అత్యంత ఎతె్తైన గోపురం నిర్మించాలి. ఏ బృందం ఎతె్తైన గోపురం నిర్మిస్తే వారే విజేతలుగా ప్రకటించబడతారు. స్పెయిన్ రాజధాని బార్సినాలో జరిగే ఈ ఉత్సవం అత్యంత ప్రాముఖ్యత పొందింది.

ఎలక్ట్రానిక్ డ్రెస్
జర్మనీలోని బెర్లిన్ నగరంలో ఈ మధ్యన జరిగిన అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ మేడ్ ఎగ్జిబిషన్‌లో పలు రకాల వెరైటీలుగా తయారుచేసిన ఎలక్ట్రానిక్ పరికరాల ప్రదర్శన ఘనంగా జరిగింది. అయితే ఒక సంస్థ మాత్రం ఏకంగా ఎలక్ట్రానిక్ డ్రెస్‌లను ప్రదర్శించింది. ‘స్మార్ట్ డ్రెస్’ పేరుతో ఇవి వేసుకున్న మోడల్స్ వీటి పనితీరును వివరించడం జరిగింది. ఈ దుస్తుల నేతలోనే అతి సూక్ష్మ ఎలక్ట్రానిక్ పరికరాలను అమర్చడం విశేషం. ఈ యంత్ర దుస్తులు వాతావవరణ ఉష్ణోగ్రతను కనిపెట్టి శరీర సౌకర్యానికి తగిన ఉష్ణోగ్రతను అందిస్తాయి.

గొరిల్లాలు
మధ్య ఆఫ్రికా గొరిల్లాలు, చింపాంజీలకు స్వర్గం లాంటిది. అయితే ప్రపంచంలోకెల్లా ప్రమాదకరమైన వ్యాధిగా పేర్కొనే ‘ఎబోలా’తో వేలాది గొరిల్లాలు, చింపాంజీలు చనిపోతున్నాయి. ఇప్పుడు ఈ వ్యాధి కాంగోలో విస్తృతంగా ఉంది. ఇక్కడి లొస్సి గొరిల్లా సంరక్షణ కేంద్రంలో సగం గొరిల్లాలు ఈ వ్యాధిన పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి వలన త్వరలోనే ఎక్కువగా గొరిల్లాలు చనిపోయే ప్రమాదం ఉందని జంతు పరిరక్షక సంఘం వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

-పి.వి.