S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హరిత విప్లవం

హరిత విప్లవం గాలి నుంచో, మబ్బు నుంచో ఊడిపడలేదు. దీని వెనుక ఎన్నో పరిశోధనలు, వాటి పొడిగింపు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నాయి. 1940-70ల మధ్యకాలంలో హరిత విప్లవానికి పునాదులు పడ్డాయి. హరిత విప్లవం వల్ల ప్రపంచవ్యాప్తంగా పంటల దిగుబడి పెరిగింది. ఈ పెరుగుదల 60’వ దశకం చివరలో ప్రారంభమైంది. హరిత (సస్య) విప్లవానికి పునాదులు వేసిన అమెరికా శాస్తవ్రేత్త నార్మన్ బోర్లాగ్ ఇంకా ముందు చూపుతో మానవాళి కోసం, ఆహార భద్రత కోసం ఆలోచించాడు. 1940లో మెక్సికోలో ఆయన పరిశోధనలు ప్రారంభించాడు.
క్రిమి దాడులను తట్టుకోగల అధికోత్పత్తి గోధుమ వంగడాలను ఆయన అభివృద్ధి చేశాడు. బోర్లాగ్ అభివృద్ధి చేసిన గోధుమ రకాలకు, నూతన వ్యవసాయ యాంత్రిక పరిజ్ఞానం జోడించడంతో 1960లో మెక్సికో అత్యధిక గోధుమ ఎగుమతి దేశంగా అభివృద్ధి చెందింది. 1961లో భారతదేశంలో దారుణమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రముఖ వ్యవసాయ శాస్తవ్రేత్త, అప్పటి కేంద్ర వ్యవసాయ మంత్రికి సలహాదారు అయిన ఎం.ఎస్.స్వామినాథన్ బోర్లాగ్‌ను భారతదేశానికి ఆహ్వానించారు. స్వామినాథన్ ప్రపంచంలోని ప్రముఖ వ్యవసాయ శాస్తవ్రేత్తలలో ఒకరు. 1960 నుంచి 1982 వరకు భారతదేశంలో ‘సస్య విప్లవం’ విజయవంతం కావడం వెనుక వున్న గొప్ప శాస్తవ్రేత్త. ఆయన వంగడాల జన్యు సంపదను శోధించటం, రాసి, వారి పెరిగేలా జన్యువులను అభివృద్ధి చేయడం, గోధుమ, వరి, బంగాళా దుంపల పంట దిగుబడి పెరిగేలా చూడటం, చీడ పీడల నుంచి రక్షించడం వంటి రంగాల్లో విశేష కృషి చేశారు. పొట్టి గోధుమ వంగడాన్ని ఆయన భారతదేశానికి పరిచయం చేశారు. అధిక దిగుబడులకు శ్రీకారం చుట్టారు. 1971లో రామన్ మెగసెసే అవార్డు, 1972లో పద్మభూషణ్, 1988లో పద్మవిభూషణ్ అవార్డులు వచ్చాయి.

-బి.మాన్‌సింగ్ నాయక్