S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వధూవర గణ పొంతన

ప్రశ్న: కంప్యూటర్ ప్యాకేజీలలో వధూవర గణ సమ్మేళనం - పొంతనలు చూసేటప్పుడు ఏకదశా దోషం అని చెబుతారు. అది ఎంతవరకు గ్రాహ్యము.
-కె.రాఘవశర్మ (విజయవాడ)
జ: ముందుగా కొన్ని విషయాలు అవగాహన చేసుకోవాలి. ఒకే నక్షత్రం వధూవరులకు వున్న యెడల పాద భేదం ఉంటే గ్రాహ్యమే. మరొకటి ఒకే రాశి వధూవరులకు పక్కపక్కన నక్షత్రాలు అయితే విశేషమే. ‘ఆయుర్ద్వాదశగే ద్వికే’ అనే భకూటమి ప్రకారం అమ్మాయి రాశికి వెనుక రాశి అబ్బాయిది అయితే శ్రేష్ఠం. అనగా ఉదాహరణ చూస్తే, సింహరాశి అబ్బాయిది, కన్యారాశి అమ్మాయిది అయితే శ్రేష్ఠం అన్నారు. మరి ఇదే ‘్భకూటమి’లో ‘శుభంచ నవమ పంచకం’ అన్నారు. మరి ఉదాహరణకు మేషరాశి అమ్మాయికి ధనూరాశి అబ్బాయికి భకూటమి విశేషం అన్నారు. అలాగే మహేంద్ర కూటమిలో ‘వధ్వాదీనాం చతుస్సప్త దశమంచ త్రయోదశ షోడశైకోన వింశవ్చ ద్వావింశః పంచవింశతిః’ అనే సూత్రం ప్రకారం జన్మతారలు రెండవ నవకం మూడవ నవకంలో ఉన్నవి విశేషం అని చెప్పారు. ఇంతేకాక నాడీ కూటమిలో ఆదినాడీ వారికి అంత్య మధ్య నాడీ వారిలోనూ మధ్యనాడీ వారికి అంత్య నాడీ ఆదినాడీ వారితోను వివాహం శ్రేష్ఠం అని చెప్పారు కదా. ఈ పై కాంబినేషన్స్ ఏవి చూసినా వధూవరులకి ఏకదశా అవకాశములు ఎక్కువ. వధూవర గణ సమ్మేళనం కూలంకషంగా లాజికల్‌గా పై మాదిరి ‘ద్వాదశ కూటమి’ విధానం అంతా పరిశీలిస్తే ఏకదశా దోషం వధూవరుల విషయంలో దోషం లేని అంశం అని తేలుతుంది. ద్వాదశ కూటమి అనే సబ్జెక్ట్ శాస్ర్తియము అని నమ్మితే ఏకదశా దోషం అనే సబ్జెక్ట్ అశాస్ర్తియం అని తేలుతుంది. ఏకదశా దోషం అనేది వధూవరుల విషయంలో చెప్పబడినది క్రియేటివ్ సబ్జెక్ట్. ఇది చాలా తప్పు. మరి వధూవర గణ సమ్మేళనం పట్టిక కూడా చాలా తెలివిగలవారు తయారుచేసిన క్రియేటివ్ తప్పుడు పట్టిక అని తెలుసుకున్నాం కదా. శాస్త్ర గ్రంథాలు, ముహూర్త సుధ, ముహూర్త దర్పణం, ముహూర్త చింతామణి, ముహూర్త మార్తాండం ఇంకా పూర్వకాలామృతం గ్రంథాలు చదవండి. విశేషాలు తెలుస్తాయి.
ప్రశ్న: రత్న శాస్త్ర వివరాలు పూర్తిగా తెలియజేయగలరు.
-రజనీకుమారి (హైదరాబాద్)
జ: రత్న శాస్త్రం విషయంలో ఇక రత్నపరీక్షా విధానాలు మాత్రమే ఇవ్వవలసి వున్నది. ఇక మిగిలిన ధారణా అంశాలు చాలావరకు విశదీకరించాం. రత్న పరీక్ష అనేది టెక్నికల్ సబ్జెక్ట్. దాన్ని పత్రికాముఖంగా విశదీకరించడం చాలా కష్టం. రత్న ధారణ విషయంలో ఏవైనా అనుమానాలు ఉంటే మీరు అడిగితే సంశయ నివృత్తి చేద్దాం.
*

కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు) కామకోటినగర్, శంకరమఠం వీధి, నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012.