S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘రసవిద్య’ కోవిదుడు

క్రీ.శ.931లో గుజరాత్‌లోని సోమనాథ్ క్షేత్రం సమీపాన దైహక్‌కోట్ గ్రామంలో పుట్టిన నాగార్జునుడు గొప్ప రసాయనిక శాస్తవ్రేత్త. వైద్యుడు. ‘రసవాది’గా ప్రఖ్యాతుడు. తను దైవ ప్రతినిధిని అన్న ప్రచారానికి నాగార్జునుడు ఈ ఆస్కారం ఇచ్చాడు. ఆయన రచించిన ‘రసత్నాకరం’ అనే గ్రంథం తనకూ దేవతలకూ మధ్య సంభాషణ జరిగినట్టు తెలియపరుస్తుంది.
‘రస’ అంటే పాదరసము. దీంతో వివిధ సమ్మేళనాలు (కాంపౌండ్స్) ఎలా తయారుచేయాలో ఈ గ్రంథంలో వివరంగా ఉంటుంది. ఆనాటి భారతదేశంలో వున్న లోహ సంగ్రహణ పరిజ్ఞానాన్నీ, నాగార్జునుడి రసవాద ప్రక్రియలను ‘రసరత్నాకరం’ ద్వారా తెలుసుకోవచ్చు. వెండి, బంగారం, తగరం, రాగి లోహాలను వాటి ముడి ఖనిజాల నుండి సంగ్రహించి శుద్ధి చేసే పద్ధతులను నాగార్జునుడు వివరించాడు.
పాదరసం నుంచి జీవరసాన్ని (అమృతాన్ని) ఇతర పదార్థాలను తయారుచేయడానికి ఆయన అనేక జంతు వృక్ష సంబంధ ఉత్పత్తులను, ఖనిజాలు, క్షారాలతోపాటు వినియోగించాడు. వజ్రాలను, ముత్యాలను ఫలరసాలతో మూలికల కషాయాలతో కరిగించవచ్చని ఆనాడే కనిపెట్టాడు. ద్రావాన్ని కాయడం, భస్మంగా మార్చడం, లోహాలను రంగులు తెప్పించడం వంటి ప్రక్రియలను నాగార్జునుడు కనిపెట్టాడు. వీటిని రసరత్నాకరంలో వివరించాడు. లోహాలను బంగారంగా ఉత్పరివర్తనం చెందించడంపై ఆయన ఈ గ్రంథంలో సుదీర్ఘంగా చర్చించాడు.
ఈ ప్రక్రియలో బంగారం కాకున్నా, బంగారంలా మెరిసే పచ్చటి లోహాలు తయారవుతాయి. సినాబార్ నుంచి, తగరం లాంటి కాలమైన్ నుంచి పాదరసం మాదిరి పదార్థాలు తయారుచేయడాన్ని నాగార్జునుడు కనిపెట్టాడు. పాదరస సమ్మేళనాలపై శాస్తవ్రేత్తలు ఇప్పటికీ రసరత్నాకరాన్ని తిరగేస్తారు. నాగార్జునుడు ‘ఉత్తర తంత్ర’ అనే వైద్య గ్రంథం రాశాడు. ఇది శుశ్రుత సంహితకు అనుబంధం లాంటిది. దీనిలో వివిధ రకాల ఔషధాల తయారీ విధానాలు వివరంగా ఉన్నాయి. ఆరోగ్య మంజరి అనే ఆయుర్వేద గ్రంథాన్ని, కక్షపుతంత్ర, యోగ శాస్త్ర, యోగ శతక పుస్తకాలు రాశాడు. నాగార్జునుడు నలందలో విద్యాభ్యాసం చేసిన తరువాత అప్పటి ఆంధ్ర దేశం వచ్చి లోహ సంగ్రహ విధానాలపై, రసవిద్యపై పరిశోధనలు చేశాడు. తర్వాత వివిధ రసాయనిక సమ్మేళనాలతో ఔషధాల తయారీపై దృష్టి పెట్టి వైద్యంలోనూ ప్రముఖుడయ్యాడు.
ప్రాచీన ప్రపంచంలో ఆల్‌కెమీ (రసవిద్య) ప్రస్తావనే లేదు. మధ్యయుగాల యూరప్‌లోనే ఈ మాట వినిపిస్తుంది. అరబ్బుల మాతృభూమి లోహ ఖనిజాలు దొరికే చోటు కాదు. లోహాల సంగ్రహణ, ఆల్‌కెమీ విద్యలను వారు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి సాధారణ లోహాలను బంగారం వంటి లోహాలుగా మార్పిడి చేసే ఆల్‌కెమీ ప్రక్రియను భారత్ నుంచే వారు సంగ్రహించి ఉంటారన్నది చరిత్రకారుల వాదన. ఆల్‌కెమీ అనే పదం సైతం ‘ఆల్‌కిమియా’ అనే అరబిక్ వాడుక నుంచి వచ్చిందే. బంగారం లాంటి లోహాలు తయారుచేసే భారతీయ ప్రక్రియను వారు ‘ఆల్‌కిమియా’ అనేవారు. కిమియా అంటే లోహాలను బంగారంగా ఉత్పరివర్తనం చెందించడం అని అర్థం. ఆల్‌కిమియాకు సంకర రూపమే ‘ఆల్‌కెమీ’ అనే ఇంగ్లీష్ పదం. పాశ్చాత్యులకు ఈ రసవిద్య తెలిసిన దాఖలాలు చరిత్రలో లేవు. దీన్ని వారు అరబ్బుల ద్వారా తెలుసుకుని ‘ఆల్‌కెమీ’ అన్నారు.

-నాయక్