S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎడారిలో వైద్యం

జర్మన్‌లోని పశు వైద్యురాలు అయిన డా.ఇల్సె కొహ్లెర్ ఏడాదిలో సగం రోజులు భారతదేశంలోని థార్ ఎడారిలోనే గడిపేస్తుంది. రాజస్థానీ సంపద అయిన ఒంటెలను, వాటినే నమ్ముకుని జీవించే తెగల ప్రజలను రక్షించడమే ఈ జర్మన్ డాక్టర్ ధ్యేయం. పశ్చిమ దేశాల మందులను, సంప్రదాయక పద్ధతులతో జోడించి రాజస్థానీ సంపదను రక్షించడమే కాక ఒంటెల కాపరుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచే ప్రయత్నం చేస్తున్నదీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వున్న జర్మన్ పశు వైద్యురాలు.

పక్షి కేంద్రాలు
పక్షి జాతులను, జంతుజాలాన్ని పరిరక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్ వంద సంవత్సరాల క్రితమే విజయవంతమైన ప్రయోగాలు చేపట్టాడు. పెలికాన్ వంటి రకరకాలైన పక్షులను పలు రకాల ప్రయోజనాల కోసం అంతం చేస్తున్నారని తెలుసుకున్న రూజ్‌వెల్ట్, పెలికాన్ ఐలాండ్ రిజర్వేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇది నేషనల్ వవైల్డ్ లైఫ్ రెఫ్యూజ్ సిస్టమ్‌గా తర్వాత పేరు పొందింది. అమెరికా అధ్యక్షుడిగా తన పదవీ కాలంలో 51 బర్డ్ రెఫ్యూజెస్‌ను, 5 నేషనల్ పార్కులను, 150 నేషనల్ ఫారెస్ట్‌లను రూజ్‌వెల్ట్ నెలకొల్పడం విశేషం.

భగవాన్ ప్రసాదం
న్యూఢిల్లీలోని ఇస్కాన్ టెంపుల్ కాంప్లెక్స్‌లోని గోవిందా రెస్టారెంట్‌లో భోజనాన్ని శ్రీకృష్ణ భగవానుని ప్రసాదంగా భావిస్తారు. ఉల్లి, వెల్లుల్లి లేని శాకాహారాన్ని మాత్రమే ఇక్కడ తయారుచేస్తారు. ఇటువంటి సాత్వికాహారాన్ని ముందుగా కృష్ణ భగవానునికి నైవేద్యంగా సమర్పిస్తారు. రెస్టారెంట్ గోడలన్నీ హరేరామ హరే కృష్ణ మంత్రాలతో నిండి ఉంటాయి. వంటవారు అత్యంత శుచిగా, రుచిగా భోజన పదార్థాలను తయారుచేయడం విశేషం.

-పి.వి.