S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నైరుతి మూల వీధిపోటు -వాస్తు

పూర్ణచంద్రరావు (కంకిపాడు)
ప్రశ్న: వాస్తును ఇంటి వరకే చూసుకోవాలి అని చాలామంది అంటూంటారు. అలానే చూడాలా లేక పక్క ఇంటితో వచ్చే సమస్యలను కూడా పరిశీలించుకోవాలా?
జ: సాధారణంగా చాలామంది తమ ఇంటి వరకే వాస్తును సరి చేసుకుంటారు కానీ పరిసరాలు/ పక్క ఇంటి వాళ్ల స్థలాలను బట్టి కూడా వాస్తును అనుసరించవలసి వస్తుంది. దీనినే నైసర్గిక వాస్తు అంటారు.

మల్లికార్జునరావు (చీరాల)
ప్రశ్న: మేం వ్యాపారం మొదలుపెట్టి 3 సం.లు అయినది. కానీ వ్యాపారంలో ఎప్పుడూ నష్టాలే. ఇలా ఎందుకు జరుగుతున్నది. కారణం తెలీటంలేదు.
జ: ప్లాన్ ప్రకారం నైరుతిలో టాయిలెట్స్ నిర్మాణం చేశారు. అలాగే దక్షిణ నైరుతి మూల వీధి పోటు ఉన్నది. అలాగే నైరుతిలో పల్లంగా ఉన్నది అని చెప్పారు. ఇలా ఇన్ని నైరుతి దోషాలు ఉన్నాయి కాబట్టే మీ వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి. ముందుగా మీరు నైరుతి దోష నివారణ చేసుకోండి. మీ సమస్యలు పరిష్కారమవుతాయి.

సాంబశివరావు (ఆముదాలవలస)
ప్రశ్న: మేం ఇటీవల ఒక స్థలాన్ని కొనుగోలు చేశాము. కానీ ఆ స్థలానికి ఉత్తర మధ్యభాగంలో ఒక వీధి తగులుతున్నది. అలా వుండవచ్చా? దానికి పరిష్కారం తెలుపగలరు.
జ: ఉత్తర మధ్య భాగంలో వీధి తగలడం వలన ఆర్థిక బాధలు ఉంటాయి. కాబట్టి ఆ వీధి పోటుకు సంబంధించి వీధిపోటు నివారణ యంత్రాలు ఉంటాయి. వాటిని ప్రతిష్ఠించుకొని మంచి ఫలితాలను పొందండి.

సీతామహాలక్ష్మి (రంగారెడ్డి)
ప్రశ్న: మా ఇంటికి సంబంధించి పైకి ఎక్కే మెట్లు ఉత్తర మధ్యభాగంలో వచ్చాయి. ఇది డూప్లెక్స్ ఇల్లు. మేము ఈ ఇల్లు కొన్న దగ్గర నుండి ఆర్థిక నష్టాలే ఎక్కువగా ఉన్నాయి.
జ: ఉత్తరం అనేది కుబేర స్థానం. అక్కడ బరువైన మెట్లు ఉండటం వలన ఆర్థిక బాధలు ఉంటాయి. అలాగే ఇది ఒక్కటే కాకుండా నైరుతి దోషాల వలన కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మెట్లను మార్చడానికి అవకాశం ఉన్నదేమో ప్రయత్నించండి. అలా కాకపోతే ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా పరిష్కారం చేసుకోండి.

కార్తీక్‌రెడ్డి (కర్నూలు)
ప్రశ్న: మేం గత 10 సంవత్సరాల నుండి ఒక స్కూల్‌ని నడుపుతున్నాం. కానీ మొదలుపెట్టిన దగ్గర నుండి అనేక సమస్యలు వస్తున్నాయి. ఒకసారి పిల్లలు రాకపోవడం, మరోసారి పిల్లల ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ గత రెండు సంవత్సరాల నుండి ఈ సమస్యలు ఎక్కువయ్యాయి. గత సంవత్సరం ఫలితాలను చూస్తే ఈ సంవత్సరం ఎంతమంది పిల్లలు చేరతారోనని ఆందోళనగా ఉన్నది. ప్లాన్ పరిశీలించి తగిన సూచనలు చేయగలరు.
జ: మీ స్కూల్ భవన నిర్మాణ సమయంలో కొన్ని తప్పులు జరిగాయి. అందువల్లనే ఇలా జరుగుతోంది. భవనంలో కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఉంది. అలాగే మరికొన్ని చోట్ల ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా పరిష్కారాలు చేయవలసిన అవసరం ఉంది.
*

-వాస్తు శిఖామణి చివుకుల రాఘవేంద్ర శర్మ -96 42 70 61 28