S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విమర్శే ప్రశంస

ఒకానొక అడవిలో.. వసంత రుతువు రాగానే శిశిరంలో... ఆకులు రాల్చిన చెట్లన్నీ కొత్త చిగుళ్లు తొడిగి, నూతన వస్త్రాలు కట్టుకున్నట్లు ఆహ్లాదంగా కనిపించాయి.
గానుగ చెట్టు చిలకాకుపచ్చ చీరె కట్టుకుంటే, రావిచెట్టు.. లేత ఎరుపు రంగుతో కూడిన ముదురాకు పచ్చ చీరె సింగారించుకుంటుంది. నిద్ర గనే్నరు ఊదారంగు పూల చీరె చుట్టుకుంది. తురాయి చెట్లు.. ఎర్రని పూమొగ్గలు ఎప్పుడు ఆకాశం వైపు తలెత్తి చూడాలా అన్నట్లు ఎదురుచూస్తున్నాయి.
వేపచెట్లు.. మిలమిల మెరిసే లేత చిగుర్లతో... తెల్లటి పూలగుత్తులతో విరబూసింది. మామిళ్లు సరేసరి.. గుప్పెడంత కాయలతో, చిలుక కొట్టుళ్లతో, కోకిల కుహుకుహు రావాలతో ఎప్పుడూ సందడిగానే కనిపించాయి.
చెంగుచెంగుమని తిరిగే కుందేళ్లతో... ఉడుత పాపాయిలతో, కాకుల అరుపులు... పక్షుల కిలకిల ధ్వనులతో అడవంతా రోజురోజుకి.. కొత్త అందాల్ని సంతరించుకుంది.
ఇలాంటి సమయంలో అడవికి రాజైన సింహానికి.. తమని ఎంతో చక్కగా పెంచిపోషించి కాపాడుతున్న.. అడవి తల్లికి ‘వనమహోత్సవం’ చెయ్యాలని, ప్రకృతి అందాల్ని ప్రతిఫలించే విధంగా.. జంతువులకు ‘చిత్రలేఖనం పోటీ’ నిర్వహించాలని అనిపించింది.
ఓ రోజు జంతువులన్నింటిని సమావేశపరచి, విషయం వివరించింది. అందుకు జంతువులన్నీ సంతోషపడి, వన మహోత్సవం రోజుకి.. ఎవరెవరు ఏ చిత్రాలు వెయ్యాలనుకున్నారో... ఆ చిత్రాలను పదేపదే అభ్యసించసాగాయి.
అన్నిటికంటే ఓ కుందేలుకి సహజసిద్ధంగానే.. చిత్రలేఖనం అబ్బింది. అది వేసే చిత్రాల్ని అన్ని జంతువులూ మెచ్చుకునేవి. ఆ కుందేలుకి మంచి మిత్రుడు తాబేలు.
గతంలో ఓసారి పరుగు పందెంలో.. కుందేలుని, తాబేలు ఓడించిన దాఖలాలున్నా.. అవన్నీ మనసులో ఉంచుకోకుండా అవి రెండూ కలిసే ఉండేవి. అయితే తాబేలుకి అంత బాగా చిత్రలేఖనం రాదు. కాబట్టి, ఆ రోజుకి ఉపయోగపడేలా కుందేలుతో ఓ చిత్రం వేయించుకుంది.
తాబేలు అలా వేయించుకోవడం తెలుసుకుని, ఎలుగుబంటి, కోతి, పావురం వంటివి... కుందేలుని మంచి చేసుకుని.. దానికి ఇష్టమైన క్యారెట్లు.. ముల్లంగి వంటి చిన్నచిన్న బహుమతులు.. ఒకదానికి తెలియకుండా ఒకటి ఇచ్చి చక్కటి బొమ్మలు వేయించుకున్నాయి.
అనుకున్న రోజు రానే వచ్చింది. అన్ని జంతువులూ.. సింహం చూడకుండా కుందేలు వేసిచ్చిన చిత్రాలకే కొద్దిగా రంగులద్ది.. అవే వేసినట్లు చూపించాయి.
అన్నింటికి చక్కటి బొమ్మలు వేసి ఇచ్చిన కుందేలుకి.. తన దగ్గరకు వచ్చేసరికి ఏ బొమ్మ వెయ్యాలో తోచలేదు. వేసిన బొమ్మలే వేద్దాం అంటే.. వాళ్ల ఆలోచనలు తను అనుకరించినట్లు ఉంటుందని, అనుకుని సమయం మించిపోతుండటంతో.. తనకు తోచిన చిత్రాన్ని చిత్రించి ఇచ్చింది. కానీ, హడావిడిలో రంగులే సరిగా అద్దలేకపోయింది.
న్యాయనిర్ణేతగా వ్యవహరించిన నెమలికి మాత్రం.. కుందేలు వేసిన చిత్రంకన్నా.. అన్ని జంతువుల చిత్రాలూ బాగున్నాయి. తాబేలు వేసిన చిత్రానికి మొదటి బహుమానం ప్రకటించి, మిగిలిన వాటికీ ప్రశంసా పత్రాలు అందజేసింది.
కుందేలుతో.. ‘నీవు వేసిన చిత్రం ఏమీ బాగుండలేదు. నీకు సాధన కొరవడింది’ అంది.
అందుకు కుందేలు బాధపడకపోగా.. మనసు పెట్టి తాబేలుకి వేసిచ్చిన చిత్రానికి మొదటి బహుమానం వచ్చినందుకు, మిగిలిన వాటికీ ప్రశంసా పత్రాలు వచ్చినందుకు న్యాయనిర్ణేత విమర్శను.. నిజమైన ప్రశంసగానే తీసుకుని సంతోషపడింది.

-పి.ఎల్.ఎన్.మంగారత్నం