S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎడ్వర్డ్ జెన్నర్ (ప్రముఖ శాస్తవ్రేత్తలు)

మశూచికి మందు కనిపెట్టిన జెన్నర్ బాలబాలికల పాలిట దేవుడని చెప్పవచ్చు. కుక్కకాటు, క్షయ, కలరా, కామెర్లు, మలేరియా, కేన్సర్ల వంటి వ్యాధులకు పూర్వం సరైన మందులు లేవు. మశూచి వ్యాధి ప్రపంచమంతా భయంకరంగా వ్యాపించి ఉండేది. ఇంగ్లండ్‌కు చెందిన ఎడ్వర్డ్ జెన్నర్ అనే మహనీయుడు ఈ స్మాల్‌ఫాక్స్ వ్యాధి సోకకుండా ఉండటానికి వ్యాధి నిరోధక ‘వాక్సినేషన్’ మందు కనిపెట్టి మానవాళికి ఎంతో మేలు చేశాడు.
ఎడ్వర్డ జెన్నర్ 1749 మే17న ఇంగ్లండ్‌లోని బర్కిలి అనే పట్టణంలో జన్మించాడు. జెన్నర్‌కు 13 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతని తండ్రి ఒక పెద్ద వైద్యుడి దగ్గర 8 సంవత్సరాలపాటు శిక్షణ ఇప్పించాడు. అనంతరం అతను లండన్ వెళ్లి సెయింట్ జార్జి హాస్పిటల్‌లో ప్రత్యేక శిక్షణ పొంది 1773లో బర్కిలీలో ప్రాక్టీసు ప్రారంభించాడు. మంచి వైద్యుడిగా ఆయన కీర్తి ఇతర పట్టణాలకు కూడా పాకింది. వైద్య వృత్తిలో ఎంతో రాణించినా, మశూచికి మందు కనిపెట్టే వరకు విశ్రమించరాదనే జెన్నర్ కృతనిశ్చయంతో నిరంతరం ప్రయోగాలతోనే గడిపేవాడు. అనేక ప్రయోగాల ఫలితంగా 1796లో జేమ్స్ ఫిలిప్స్ అనే మశూచి సోకిన బాలుడికి వాక్సిన్ ఇచ్చాడు జెన్నర్. ముందుగానే మశూచిని ఎదుర్కొనే వ్యాధి నిరోధక వాక్సిన్ ఇవ్వడం వలన ఆ బాలుడికి మశూచి సోకలేదు. ఆ విధంగా బాలురకు, బాలికలకు వ్యాధి నిరోధకమైన మశూచి మందును వాక్సిన్‌గా ఇవ్వడం ఆరంభించాడు. వారు ఎటువంటి మశూచి వ్యాధికి గురి కాకుండా ఆరోగ్యంగా జీవించసాగారు. ఈ వార్త దేశమంతా పాకిపోయింది. ఒక రాజుగారు తగినంత డబ్బు ఇవ్వజూపి ఆ ఫార్ములా చెప్పమని కోరినా ‘తాను డబ్బు కోసం పరిశోధన చేయలేదని, ప్రపంచంలోని బాలబాలికల అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేశానని వినయంగా చెప్పి ఆ రాజుగారి కోరికను తిరస్కరించాడు.
జెన్నర్ సృష్టించిన సిద్ధాంతాల మూలాన్ని తీసుకుని శాస్తవ్రేత్తలు పోలియో, డిఫ్తీరియా వంటి పిల్లల వ్యాధులకు వాక్సిన్‌లు కనిపెట్టి కృతకృత్యులయ్యారు. జెన్నర్ మహాశయుడు 1823వ సం.లో చనిపోయాడు.

-పి.వి.రమణకుమార్