S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉత్తమ లక్షణాలు అలవరచుకోండి

సమర్థులు వౌనం పాటిస్తే చెడు విజృంభిస్తుంది. మనిషి గొప్పవానిగా ఎదిగేటప్పుడు దానికి చెల్లించాల్సిన మూల్యంగా ‘బాధ్యత’ వహించడం. సంకుచిత మనస్తత్వం మనిషిని బాధ్యతల నుండి దూరం చేస్తుంది. ప్రతి పనికి ఇతరులను బాధ్యులను చేస్తుంది. మనిషి తప్పనిసరిగా ‘సమాజం’ పట్ల ‘కుటుంబం’ పట్ల చివరిగా తన పట్ల బాధ్యతలు తీసుకోవాలి. ఇందులో దేనిని విస్మరించినా దాని పతనం ప్రారంభమవుతుంది. ‘సామాజిక బాధ్యత’ ప్రతి వ్యక్తి తొలి నైతిక బాధ్యత. కర్తవ్య నిర్వహణకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ సంసిద్ధులై ఉండాలి. స్వేచ్ఛ, బాధ్యత ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి.
శ ఇతరుల గురించి మనం ఆలోచించడమే కాదు వారి అవసరాలను తీర్చగల్గితే ఇతరులు మన గురించి ఆలోచిస్తారు. మన అవసరాలకు ఆదుకుంటారు.
శ ప్రకృతిలో మనిషికి మాత్రమే దొరికిన వరం ‘మాట్లాడగల్గడం’. మాట ఎంతో పదునైన ఆయుధం. దానిని ఎంతో జాగరూకతతో వినియోగించుకోవాలి. కోపం, పగ, ద్వేషం వంటి ఆవేశాలతో వదిలే మాటలు చాలా ప్రమాదాలు తెచ్చి పెడతాయి.
శ మనుషుల్లో అంతర్గతంగా ఉండే ప్రతిభలను వెలికితీసే ఆయుధంగా మాటను ఉపయోగించాలి. శత్రుత్వాన్ని పెంచే పరిస్థితులను సృష్టించుకోకూడదు.
శ మనిషి మాట్లాడాలి. వివేకంతో ఆలోచించి మాట్లాడాలి. అనాలోచితంగా అతిగా మాట్లాడడం మూర్ఖుడి లక్షణం అవుతుంది.
తప్పులు - మోసాలు
మనిషి తప్పు చేయకూడదు. తప్పు చేస్తే అది అతని జీవితాంతం ఒక పెద్ద మచ్చగా అనుక్షణం ప్రత్యక్షమవుతూ ఉంటుంది.
శ మనిషి తప్పులు చేయకుండా ఎలా ఉండగలడని అనుమానం అవసరం లేదు. ఎదుటి వారు చేసే తప్పులను గమనించి పాఠాలు నేర్చుకుని అటువంటి తప్పులు చేయకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి.
శ మనుషుల్లో రకరకాలు. కొంతమంది ఎప్పుడూ ఎదుటి వారి తప్పులను ఎత్తి చూపుతూ ఉంటారు. ఇటువంటి వారికి ప్రతిరోజూ చెడు రోజుగానే ఉంటుంది.
శ సమాజంలో చాలా మందికి ఎదుటి వారు సమస్యల్లో వున్నారనే స్పృహలో ఉండరు. మరి కొంతమంది ఎదుటి వారు సమస్యల్లో ఇరుక్కున్నందుకు ఎంతో సంబరపడిపోతూ ఉంటారు.
శ మనం ఏ పని చేసినా దానికొక ప్రయోజనం ఉండాలి. ఎదుటి వారిలో తప్పులను ఎంచడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని వారికి తెలియదు. అది వారి వ్యక్తిత్వ లోపంగా జాలిపడాలి. అంతే.
శ పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటే అంతులేని ఆనందం పొందుతూ తమను తాము మరచి తమ నాశనానికి శ్రీకారం చుట్టుకుంటారు. లేని విషయాలతో మనిషిని మురిపించే మాటలు పొగడ్తలు.
శ ఉన్న విషయాలను అందంగా మలచి ఎదుటి మనిషిలో ఉత్సాహాన్ని నింపడం అభినందనలు. రెండింటికీ తేడా గుర్తించగలగాలి.
శ ఉన్నత వ్యక్తిత్వంగల వారు ఎన్నడూ ఎవ్వరినీ మోసం చేయరు. ఒకసారి ఎవ్వరయినా మోసానికి గురయితే మోసం చేసినవాడు సిగ్గుపడాలి. అదే వ్యక్తి రెండవసారి మోసానికి గురయితే అతడే సిగ్గుపడాలి. అనుకూలమైన ఆలోచనలు అలవరచుకోవాలి. ఆలోచనలు గతితప్పితే మనిషి తప్పటడుగులు మొదలవుతాయి.
ఉత్సాహం వదలకూడదు
శ ఏ పని సాధించాలన్నా దానికి తొలి విజయ సంకేతం ఉత్సాహం. మనిషిలో ఉత్సాహం కొరవడితే అతని సమర్థత బాగా దెబ్బతింటుంది.
శ విజయం, ఉత్సాహం జంటగా ఉంటాయి. ఒకటి కోల్పోతే మరొకటి అందదు.
శ‘మనిషిని ఉన్నతునిగా మార్చే ఆయుధాలు అతనిలో ఉండే లక్ష్యాలు, ఉత్సాహాలు మాత్రమే. కోరికలు, లక్ష్యాలు ఒకటికావు.
శ లక్ష్యం మనిషి చేతిలో ఉంటుంది. కోరికల సాధనకు ఇతరుల ప్రమేయం ఉంటుంది. మంచి భార్య కావాలనుకోవడం కోరిక అవుతుంది. పరీక్షలో ప్రథమునిగా ఉత్తీర్ణుడు కావాలనుకోవడం లక్ష్యం అవుతుంది.
శ ఉత్సాహం మనిషిలోని చైతన్యానికి ఊపిరి పోస్తుంది. మనిషిని లక్ష్యం వైపు దౌడు తీయిస్తుంది.
శ ఉత్సాహంతో అడుగులు ముందుకు వేసేవారు అసాధ్యాలను సుసాధ్యం చేయగల్గుతారు. నిరుత్సాహవంతులు సుసాధ్యాలను కూడా అసాధ్యాలుగా భావిస్తారు.
శ ప్రతి మనిషి సమాజంలో భాగస్వామిగా జీవించాలి. తాను ఎవ్వరికి అక్కర్లేదనే భావన మనిషిలో ప్రారంభమయ్యిందంటే అంతకన్నా ప్రమాదకరమైన వ్యాధి మనిషికి మరొకటి ఉండదు. అందుకే పెద్దవారిని, వయసు మళ్లిన వారిని ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలపై తమకు దృష్టి, బాధ్యత ఉందని వారికి అర్థమయ్యేలా ప్రవర్తించాలి.
నిజాయితీ, నమ్మిక
శ నిష్కళంకంగా, సహజంగా ఉండాలి మనిషి. విశ్వసనీయతను ఏర్పరచుకుని, నిజాలే మాట్లాడే లక్షణాలు నిజాయితీకి ప్రతిబింబాలు. నిజాయితీ అనేది సహజసిద్ధంగా ఉండాలి. పైకి నిజాయితీ నటిస్తే, సులువుగా వారి అసలు రంగు బయటపడిపోతుంది.
శ అబద్ధానికి స్పీడు ఎక్కువ. నిజానికి స్తబ్దత ఎక్కువ. కాని కాలానికి చెక్కుచెదరకుండా నిలిచేది నిజం మాత్రమే. సమగ్రత, నిజాయితీ విజేతల సొంత ఆస్తి.
శ నిజాయితీగా ఉన్న కొంతమంది మాటల తూటాలతో ఎదుటి మనిషి అహాన్ని దెబ్బతీస్తారు. అది తమ నైజం, గొప్పతనం అని మురిసిపోతూ ఉంటారు. ఇటువంటి ప్రవర్తన వారిలోని క్రూరత్వానికి గుర్తుగా కన్పిస్తుంది కాని, నిజాయితీకి ఆనవాలుగా ముద్ర వేసుకోలేదు.
శ నిజాన్ని నిర్భయంగా చెప్పగల లక్షణాన్ని స్వాగతించాల్సిందే. ఈ చెప్పే విధానంలో ఎంచుకునే మాటలు, బుద్ధి కుశలత ప్రముఖ పాత్ర వహిస్తాయి. వాటిని ఆసరా చేసుకుని చెప్పేవారు సమాజంలో గొప్ప గౌరవ స్థానాన్ని పొందగల్గుతారు.
శ నిజాయితీగల వ్యక్తిగా మనిషి మారితే ఈ ప్రపంచంలో ఒక తుచ్ఛుడినైనా తగ్గించిన నమ్మకం ఆ వ్యక్తికి కలుగుతుంది అని అంటారు.
శ ఉన్న విషయం చిన్నదయినా దానిని గొప్పగా చిత్రీకరించి అతిశయోక్తులతో గొప్పగా చెప్పే లక్షణం మనిషి గౌరవాన్ని తగ్గిస్తుంది. అతనిపై ఇతరులు నమ్మికతో ఉండలేరు.
శ కొంతమందికి ఈ లక్షణం ఒక అలవాటుగా మారుతుంది. చివరకు నిజం చెప్పడం మరచిపోతారు.

-సి.వి.సర్వేశ్వరశర్మ