S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నాన్నకు ప్రేమతో...

నాన్న మారిపోయాడు....
ఔను... ఆధునిక సమాజంలో..
మార్పులకు తగ్గట్టు...
కుటుంబానికి తగ్గట్టు...
ఆ మాటకొస్తే పిల్లలకు నచ్చినట్లు మారిపోయాడు...
చిన్నపిల్లలకు గురువుగా... వారికి వయసు పెరిగేకొద్దీ స్నేహితుడిగా.. వారికి పెళ్లయ్యాక మార్గదర్శిగా మారిపోయాడు.
కుటుంబం కోసం తనను తాను మార్చుకున్నాడు..
తన కలల రూపాలైన పిల్లల కోసం తల్లిలా మారిపోయాడు..
ఉద్యోగం...కష్టాలు...అసౌకర్యాలు...అనర్థాలు ఎన్ని ఎదురైనా...
ఎదురుగా పిల్లలు కన్పిస్తే తానూ చిన్నపిల్లాడిలా మారిపోవడం నేర్చుకున్నాడు.
పిల్లలు ఒంటరితనంతో బాధపడుతున్నప్పుడు..
పరిష్కారం దొరకక సమస్యల్లో సతమతమవుతున్నప్పుడు...
ఓ జవాబుగా మారిపోతున్నాడు.. ఒకప్పటి గాంభీర్యాన్ని మమకారంగా మార్చి కరిగిపోవడం నేర్చుకున్నాడు... పిల్లల మనసులో ఏముందో కనుక్కోవడానికి తన మనసు విప్పే విద్యను అవపోసన పట్టేశాడు. అందుకే అమ్మకు దీటుగా నాన్నకూడా పిల్లలకు దగ్గరైపోయాడు. అందుకే ఇప్పటితరం పిల్లల్లో చాలామంది...నాన్నకు ప్రేమతో...దగ్గరైపోయారు.
***
కొత్తపోకడలు అని కొట్టిపారేయక్కరలేదు కానీ.. ఇప్పుడు ‘్ఫదర్స్ డే’ అంటూ ఓ కొత్త పండుగ.. సంస్కృతిగా మారిపోయింది. మాతృదినోత్సవం మాదిరిగానే దీనికీ ప్రపంచం అంతటా ప్రాధాన్యం పెరిగిపోయింది. దాదాపు 52 దేశాల్లో ఇప్పుడు ఫాదర్స్ డేని జాతీయ వేడుకగా నిర్వహిస్తున్నారు. జూన్ 19 లేదా ఆ నెలలో మూడో ఆదివారం దీనిని పాటిస్తున్నారు. మరికొన్ని దేశాల్లో వేరే రోజున ‘్ఫదర్స్ డే’ పాటిస్తున్నారు. ఆమెరికాలో దాదాపు వందేళ్ల క్రితం ఈ సంప్రదాయానికి బీజం పడింది. ఎక్కడైనా నాన్న పాత్ర అద్వితీయమైనదే. భారతీయ సమాజంలో ‘నాన్న’ ఓ దిగ్గజం. ఏ కష్టం వచ్చినా...‘నాన్నకు చెబుతా’ననడంలో ఆయన ఆ పిల్లలకు ఇచ్చే భరోసా కన్పిస్తుంది. అందువల్ల మన సమాజంలో అప్పట్లో నాన్నపట్ల ఉండే భయం... ఇప్పుడు స్నేహంగా మారిపోయింది. అప్పట్లో కన్పించే ఆరాధనాభావం...ఇప్పుడు స్ఫూర్తిమంత్రంగా మారిపోయింది. పిల్లలు ఏదైనా తప్పుచేస్తే...‘మీ నాన్నకు చెబుతా’నని అప్పట్లో ఎవరైనా బెదిరిస్తే పిల్లుల్లా బెదిరిపోయే పిల్లలు...ఇప్పుడు అన్నీ వారే తండ్రికి చెప్పి తప్పు ఒప్పేసుకుంటున్నారు. ఒప్పులు చేసి మెప్పులూ పొందుతున్నారు. తల్లి, తండ్రి, కుటుంబం, సమాజంలో వచ్చిన ఆధునిక సౌకర్యాలు, అక్షరాస్యత, టెక్నాలజీ, మనోవికాసం, ఆర్థికస్తోమత వంటి పరిణామాలన్నీ తండ్రి-పిల్లల వైఖరిని మేలుమలుపుతిప్పాయి. వారి మధ్య అనుబంధం మరింత చక్కగా, చిక్కగా అల్లుకుపోవడానికి ఈ పరిణామాలు ఉపకరిస్తున్నాయి.
మార్పు ఇలా...
పెళ్లయ్యాక.. తొలి సంతానం కలిగాక తండ్రిలో మార్పు మొదలవుతుంది. రోజంతా ఇంట్లో తల్లితో గడిపే పసికందు ఎదుగుతున్నకొద్దీ తండ్రికి దగ్గరవుతుంది. అలసిపోయి ఇంటికి వచ్చిన అతడు- పిల్ల లేదా పిల్లలతో గడిపితే కలిగే ఆనందం, అనుభూతికి కొలమానం ఏదీ లేదు. ఎత్తుకున్నప్పుడు.. ఒకటో, రెండో ఒంట్లోనే చేసేస్తే... అసహ్యం బదులు అపురూపంగా భావించడం మన సంప్రదాయంలో ఓ ముచ్చట. అది చిన్ననాటి సరదా అనుకోండి. తల్లికయినా...తండ్రికయినా, దగ్గరి బంధువుకైనా అదే భావన. ఆ తరువాత బుడిబుడి అడుగులు వేసినపుపుడు చేతి చిటికెన వేలు అందించి...ఆసరాగా నిలబడటం దగ్గర మొదలవుతుంది అసలు బంధం. అక్కడినుంచి వారు పెరిగి పెద్దయ్యేవరకు అదే ఆలోచన. అదే వరస. అడుగులు తడబడి బిడ్డ పడిపోతాడేమోనని తల్లి గాభరాపడితే... భయం వద్దంటూ తండ్రి ధైర్యంగా చేతులందించడం అన్ని కుటుంబాల్లో కన్పించే కమనీయ దృశ్యమే. ఒకప్పుడు గోరుముద్దలు తినిపించే తల్లి బాధ్యతను ఇప్పుడు తండ్రికూడా తీసుకున్నాడు. తల్లికన్నా ప్రేమగా, ముద్దుగా ‘కోరి’ ముద్దలు తినిపిస్తున్నాడు. ఆ ముద్దల్లో ముద్దుమురిపాలనూ రంగరించి...అందించి దగ్గరవుతున్నాడు. ఆధునికకాలంలో పిల్లలకు తల్లి, తండ్రి ప్రేమ దండిగానే లభిస్తోంది. ఒకప్పుడు మర్యాదలు, బాధ్యతలు, హుందాతనం, గాంభీర్యం నాన్నను అల్లంతదూరంలో నిలబెడితే ఇప్పటితరం పిల్లలు నాన్న వీపుఎక్కి ఆటలాడేస్తున్నంతగా అతడు మారిపోయాడు. ఉద్యోగం చేస్తున్నా...్భర్యకు తోడుగా, వంటలో చేదోడుగా, బాధ్యతలో భాగస్వామిగా వ్యవహరిస్తున్న తండ్రి పిల్లలకు దగ్గరకొచ్చేసరికి వారికి నచ్చినట్లు మారిపోతున్నాడు. అప్పటి తండ్రులు మందలించడానికి, భయపెట్టడానికి ‘అరుపులు..చరుపులు..విరుపులు, హితవుల’పై ఆధారపడితే ఇప్పటి తండ్రులు మాటామంతీతో పరిస్థితిని చక్కబెట్టేస్తున్నారు. సామ,దాన,్భద, దండోపాయాల స్థానంలో ప్రేమనే ఆయుధంగా మార్చేసుకుంటున్నారు.
ఆ నాలుగు ఉపాయాలకు దారికిరాని మొండిఘటాలు సైతం ఈ మంత్రానికి తంత్రీలైపోతున్నారు. అప్పట్లో తండ్రి అనుమతికోసమో...ఆయనతో చెప్పాల్సిన విషయాలకో అమ్మ లేదా తాత, మరొకరో మధ్యవర్తి అవసరమయ్యేవారు. ఇప్పుడు అటు తండ్రి, ఇటు పిల్లలు మూడో వ్యక్తిని మధ్యలోకి రానీయడం లేదు. మరోమాటలో చెప్పాలంటే ఆ పరిస్థితినీ రానివ్వడం లేదు.
ఓ మాట చెప్పుకుందాం. ఓ నాలుగైదు దశాబ్దాల క్రితం.. పిల్లలు సినిమాకో, పిక్నిక్‌కో... లేదా స్నేహితుని ఇంటికో వెళ్లాంటే ఓ ప్రహసనం నడిచేది. అబద్ధాలు చెప్పో, తిట్లు తినో ఆ పని పూర్తి చేయాల్సి వచ్చేది. కానీ పిల్లల మనసులో ఏముందో, వారికి ఏది ఇష్టమో, ఏం చేస్తే వారు ఆనందిస్తారో ముందే కనిపెట్టేసి...‘నాన్నా...సినిమా చూద్దామా’...‘అమ్మారుూ... షాపింగ్ చేద్దామా’ అంటున్న నాన్నను చూసి పిల్లలు ఎగిరిగంతేస్తున్న ఇళ్లే ఎక్కువ. అప్పుడు డబ్బులు పిల్లలకు ఇవ్వాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుని, వృథా చేయొద్దని చెప్పే తండ్రి...ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. పిల్లలకు అన్నీ అనుభవంతో తెలుస్తాయిలెమ్మంటూ...తగుమాత్రం సలహాలిచ్చి వదిలేస్తున్నారు. అంతమాత్రాన అప్పటివారు కఠినాత్ములని, ఇప్పటివారు సహృదయులని కాదు అర్థం. అప్పటి తండ్రుల ప్రేమ మనసులో ఉండేది. ఇప్పటి తండ్రుల ప్రేమ..పిల్లలకు మనసుకు అర్థమయ్యేలా ఉంటోంది. అంతే తేడా. ఎదురైన కష్టం లేదా చేసిన తప్పు లేదా సాధించిన ఘనతను తండ్రికి స్వయంగా చెప్పుకోవడానికి అప్పట్లో ఎక్కువమంది పిల్లలు సంశయించేవారు. ఇప్పుడు ఏదైనా సరే ముందు తండ్రికి చెప్పుకోవడం మొదటి విధిగా మారిపోయింది. అడుగులు వేసినప్పుడు పిల్లలతో దగ్గరగా ఉండే తండ్రి, వారు పెద్దవుతున్నకొద్దీ హుందాగా ఉండిపోవడం అప్పటి సంప్రదాయం అయితే... ఇప్పుడు మరింత దగ్గరగా కన్పించడం సాధారణమైపోయింది. ఒకప్పుడు తల్లికి మాత్రమే చెప్పుకునే అంశాలు ఇప్పుడు తండ్రికీ చెప్పుకోగలిగే స్థాయికి వారిమధ్య అనుబంధం అల్లుకుపోయింది. ఆటపాటల్లో, ఆనందంలో, బాధల్లో, జయాపజయాల్లో అన్నింటినీ పంచుకునే బంధం నానే్న. పిల్లలకోసం తండ్రి ఎంతగా మారిపోయాడంటే...ఇంటి బాధ్యతలతో సతమతమయ్యే భార్య పనుల్లోనూ పాలుపంచుకుంటున్నాడు. ఒకవేళ భార్యకూడా ఉద్యోగి అయితే ఇంటి పనులను షేర్ చేసుకుంటున్నాడు. పిల్లలు కాస్త పెద్దవాళ్లయ్యాక వారి భవిష్యత్‌కు మార్గదర్శిగా వ్యవహరిస్తున్నాడు. ఎంతవయసు మీరినా పిల్లలతో కలసి ఆడటం, సినిమాలు చూడటం, రోజువారీ వ్యవహారాలపై చర్చించడం, భావోద్వేగాలను పంచుకోవడం, వారితో కలసి వెళ్లడం ఇలా అన్నింటా తండ్రి, పిల్లలు ఏకమైపోతున్నారు. మంచిచెడులను చెప్పేటపుడు భయపెట్టి, భూతద్దంలో చూపించకుండా విడమరచి, వారికి మనసుకు తాకేలా, అర్థమయ్యేలా విశే్లషణాత్మకంగా చెప్పడంలో ఆధునిక తండ్రి మాస్టర్స్ డిగ్రీ చేసేశాడు. స్వార్థం లేకుండా పిల్లలు పెద్దవాళ్లవ్వాలని, బాగా స్థిరపడాలని, కీర్తిప్రతిష్టలు సాధించాలని కోరుకునే తండ్రి..వారిని పెంచి పెద్దచేస్తాడు. అందుకోసం కష్టపడతాడు. అందుకే పిల్లలకు అతడు మరో తల్లిలాంటివాడే. ఓ సైకిలో, మోటారు సైకిలో పిల్లలకు నేర్పించినప్పుడు...ఆ అబ్బాయో, అమ్మాయో కిందపడితే...అమ్మో అని తల్లి ఏడిస్తే...తండ్రి మాత్రం గుండెల్లో గుబులున్నా...పడితేకాని రాదులే...అంటూ రోడ్డుమీదకు వదిలేస్తాడు...జాగ్రత్తలు చెబుతూ...తానూ వెంటపడుతూ.. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యం చెబుతూ, స్ఫూర్తి రగిలిస్తూ ముందడుగు వేయమంటున్నాడీ గైడ్. ఆ మార్గదర్శి తాపత్రయంలో కన్పించే ప్రేమను ఇప్పటి పిల్లలు కనిపెట్టి మారాం చేస్తున్నారు. నాన్న చంక ఎక్కి చక్కర్లు కొడుతున్నారు. చక్రం తిప్పేస్తున్నారు. నాన్నకు ప్రేమతో అంటూ.. ఏదో ఒకటి చేస్తామంటున్నారు. చాలామంది వారికి నచ్చేలా నడుస్తున్నారు.. వారు కోరుకున్న బాటలోనే. అదేకదా.. నాన్నకు కావలసింది.
తండ్రికే ప్రాధాన్యం
ప్రేమ, అభిమానం విషయాలు పక్కనపెడితే చాలా విషయాల్లో తండ్రికే ప్రాధాన్యం ఇస్తారట పిల్లలు. ఈమాట ఎవరో చెప్పినదికాదు. చాలా అధ్యయనాలు తేల్చిన విషయం. తండ్రితో తమ మనసులోని విషయాలు పంచుకోవాలని, అతడితో కలసి భోజనం చేయాలని, పర్యటనలకు వెళ్లాలని పిల్లలు భావిస్తారట. తండ్రికి బహుమతులు కొనే విషయంలో మగపిల్లలకన్నా ఆడపిల్లలే ఎక్కువ ఉత్సాహం చూపుతారట. బహుమతులు కొనే విషయంలో మాత్రం ఫాదర్స్‌డేకు పెట్టే ఖర్చుకన్నా మదర్స్‌డేకు పెట్టే ఖర్చు కాస్త ఎక్కువ. అమెరికాలో 2008లో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం 71శాతంమంది పిల్లలు తండ్రితో కలసి భోజనం చేయాలని, 53శాతం మంది తండ్రితో కలసి అల్పాహారం తీసుకోవాలని భావించారట.
ఇదీ తండ్రి మనసు!
పిల్లల్లో ఎక్కువగా తండ్రి పోలికలు, గుణాలే ఉంటాయని, దీనికి జన్యుపరమైన అంశాలే కారణమని యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా నిర్వహించిన ఓ అధ్యయనం తేల్చింది. తమ కూతుళ్లు ఎలా మసలుకుంటున్నారో, ఎలా జీవిస్తున్నారో, వారి నడవడిక ఎలా ఉందో, చివరికి లైంగికజీవనం పట్ల వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో వారి తల్లులకన్నా తండ్రులే ఎక్కువగా ఆలోచనల్తో గడుపుతున్నారని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. తండ్రి, పిల్లల మధ్య ‘కాన్వర్సేషనల్ బ్రిడ్జ్’ నిర్మించి వారిని ఉత్తములుగా తీర్చిదిద్దే వ్యక్తిగా పిల్లలు భావిస్తున్నట్లు ఆ అధ్యయనం పేర్కొంది. పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలివెళ్లినపుడు తల్లి కంగారుపడిపోతుందని అందరికీ తెలుసు. ఆమె ఎక్కడికి వెళ్లినా మనసు వీరిపైనే ఉంటుంది. నిజానికి ఉద్యోగం చేస్తూ పిల్లలను సాకుతున్న తండ్రులు కూడా పిల్లలను ఇంట్లో వదిలివెళ్లినపుడు అంతకంటే ఎక్కువగానే బాధపడతారట, బెంగపెట్టుకుంటారట. ఇది కాన్సాస్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. ఒక సందర్భంగా వారు ఉద్యోగ బాధ్యతలు వదిలించికోవడానికి సిద్ధపడతారట. పిల్లలకోసం, భార్యతో ఇంటి పనులను పంచుకోవడానికి ఎక్కువమంది తండ్రులు ఇష్టంగా ఉంటారని ఓహియో యూనివర్శిటీ సర్వేలో తేలింది. ఉద్యోగం, ఇల్లు, సమాజం కన్నా పిల్లలతో కలసి జీవించడం, వారితో కలసి ఆడుకోవడం ఎక్కువ ఇష్టమని చెప్పిన తండ్రులే ఎక్కువని కెంట్ స్టేట్ యూనివర్సిటీ సర్వేలో తేలింది. తండ్రి పెంపకంలో పెరిగినవారు, అతడితో అన్ని విషయాలు పంచుకుని, ఆటపాటలతో అన్నింటా అతడితో మెలిగిన పిల్లల వ్యవహారశైలి మర్యాదపూర్వకంగా ఉంటుందని తేలిందని ఆ సర్వే స్పష్టం చేసింది. తండ్రి సంరక్షణలో పెరిగిన పిల్లలు తెలివైనవారిగా ఎదుగుతారని సర్వే తెలిపింది. ఇది తల్లులను తక్కువ చేయడం కాదు. ఆ సమాజంలో భార్యాభర్తలు విడివిడిగా ఉండే సంప్రదాయం ఎక్కువకనుక అక్కడి సర్వేల్లో ఆయా అంశాలపై సర్వేలు చేశారన్నమాట. ఒకటీఅరా మినహా దాదాపు ప్రపంచంలో అందరి భావనలూ ఇలాగే ఉంటాయని సర్వేలు చెబుతున్నాయి. ఇక తండ్రి తోడులేకుండా ఎదిగిన పిల్లల్లో భావోద్వేగ సమస్యలు ఎక్కువగా ఉంటాయని కెనడియన్ జర్నల్ ఆఫ్ బిహేవిరియల్ సైన్స్ అధ్యయనం చెబుతోంది.
***

ఆ తండ్రి జ్ఞాపకం..
ప్రపంచంలో ఎక్కువమంది జరుపుకునే వేడుకల్లో ‘్ఫదర్స్ డే’ నాలుగోది. క్రిస్మస్, వాలెంటైన్స్ డే, మదర్స్ డే తొలిమూడు. మదర్స్ డేకు సరిసమానంగా ఫాదర్స్‌డేని కూడా నిర్వహిస్తారు. 1910లో అమెరికాలోని స్పొకెనలో తొలిసారిగా ఈ వేడుక నిర్వహించినట్లు చెబుతారు. చిన్నప్పుడే తల్లి చనిపోతే తనతో పాటు ఆరుగురు పిల్లలు ఒంటరిగా పెంచిపెద్దచేసిన తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్ జ్ఞాపకార్థం 27 ఏళ్ల కుమార్తె సొనొరొ లూరుూస్ స్సార్ట్ డాడ్ తొలిసారి ‘్ఫదర్స్ డే’ నిర్వహించినట్లు ఆధారాలున్నాయి. ఆమె తండ్రి జన్మించిన నెల జూన్. అందుకే అమెరికా సహా చాలా దేశాల్లో జూన్‌లో ఈ వేడుక నిర్వహిస్తారు. 1966లో ఈ వేడుక కోసం జూన్‌లో మూడో ఆదివారం జాతీయ సెలవుదినంగా అమెరికా ప్రకటించింది. దీనికి అప్పటి అధ్యక్షుడు లిండన్ జాక్సన్ ఆమోదముద్రవేస్తే నిక్సన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 1972లో జూన్ 19ని అధికారికంగా ఫాదర్స్‌డేగా ప్రకటించారు. ప్రస్తుతం 52 దేశాలు ఇదే తేదీని ఫాదర్స్ డేగా పాటిస్తుండగా మరో ముప్పై దేశాలు ఇదే నెలలో వేరే రోజుల్లో నిర్వహిస్తున్నాయి. ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌వంటి కొన్ని దేశాలు వేరే వేరే తేదీల్లో పాటిస్తున్నాయి. థాయ్‌లాండ్‌లో అక్కడి రాజు భూమిబల్ అద్లుయెథ్ పుట్టినరోజు (డిసెంబర్‌లో)న ఫాదర్స్ డే నిర్వహిస్తారు. జర్మనీలో అయితే ఫాదర్స్ డే రోజున పబ్లిక్ పార్కులు, ఉద్యానవనాల్లో తండ్రులు రోజంతా బీరు తాగుతూనే ఆనందంగా గడపడం ఆనవాయితీ.
****
ఇదీ లెక్క..
ప్రపంచం మొత్తం మీద 105 కోట్లమంది తండ్రులున్నారని అంచనా. అమెరికాలో 2008 లెక్కల ప్రకారం, 7 కోట్లమంది తండ్రులు పిల్లలను తీర్చిదిద్దడానికి ప్రాధాన్యం ఇచ్చారు. చివరకు ఒంటరిగా ఉంటూ వారిని పెంచిపెద్దచేశారు. తల్లి ఉద్యోగం చేస్తూంటే తండ్రి వారికి అన్నీ అయి పెంచిన తండ్రుల సంఖ్య 199,000.
బహుమతులకూ అర్థం...
ఫాదర్స్ డే సంకేతం గులాబీ. ఎర్రగులాబీ జీవించి ఉన్న తండ్రికి శుభాకాంక్షలు చెబుతూ ఇస్తారు. మరణించిన తండ్రికి తెల్లగులాబీతో నివాళి అర్పిస్తారు. గులాబీలు మారితే ఏకంగా అర్థం మారిపోతుంది. ఇక అమెరికా సహా పాశ్చాత్య ప్రపంచంలో మదర్స్ డే తరువాత అత్యధికంగా గ్రీటింగ్ కార్డులు ఇచ్చే వేడుక ఇదే. ఈ ఒక్కరోజు 7.4కోట్ల కార్డులు అమ్ముడవుతాయని అంచనా. ఫాదర్స్ డే గిఫ్ట్‌గా ఎక్కువమంది ఇచ్చే బహుమతి నెక్‌టై. ప్రత్యేకంగా రూపొందించిన నెక్‌టైను బహుమతిగా ఇవ్వడం అక్కడ పరిపాటి. ఇవికాకుండా ఇచ్చే బహుమతుల్లో ఎక్కువగా ఉండేవి ఏమిటో తెలుసా? స్క్రూ డ్రైవర్, సుత్తి, రెంచ్ అంటే నమ్మాల్సిందే. ఇక విందులు, పార్టీలు ఆ తరువాతి స్థానంలో ఉన్నాయి.
*

-ఎస్.కె.రామానుజం