S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హంఫ్రీడేవీ (ప్రముఖ శాస్తవ్రేత్తలు)

హంఫ్రీడేవీ 1778లో ఇంగ్లండ్‌లోని పెంజాన్స్ అనే పట్టణంలో జన్మించాడు. పెంజాన్స్ ఆ రోజుల్లో చిన్న కుగ్రామం మాత్రమే. అక్కడ చదువుకున్నవారు చాలా తక్కువ. డేవీ మాత్రం అందరికీ విరుద్ధంగా ఉండేవాడు. ప్రకృతిని చూసి పరవశిస్తూ కవితలు రాసేవాడు. తల్లిదండ్రులు అన్ని పెద్ద కవిగా చూడాలనుకునేవారు. కానీ డేవీ వైద్య శాస్త్రంలో చేరాడు. ‘డేవీస్ గిల్బర్ట్’ అనే శాస్తజ్ఞ్రుడితో పరిచయమయింది. గిల్బర్ట్ అప్పటికే ప్రఖ్యాత శాస్తజ్ఞ్రుల కోవలోకి చెందిన వ్యక్తి. అతడు హంఫ్రీడేవీలోని ఉత్సాహాన్ని పసిగట్టి తన వద్ద శాస్త్ర పరిశోధక సహాయకుడిగా చేర్చుకున్నాడు.
గిల్బర్ట్ ప్రోత్సాహంతో డేవీ రసాయన శాస్త్రంలో అనేక పరిశోధనలు చేసి, పది మంది దృష్టిలో పడ్డాడు. అతని మేధాశక్తి, కల్పనాశక్తి గమనించిన ఇతర శాస్తజ్ఞ్రులు డేవీకి అవసరమైన సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అనుకోకుండా డేవీ తన పరిశోధనల ద్వారా ‘లాఫింగ్ గ్యాస్’ అన్న పేరుబడిన ‘నైట్రస్ ఆక్సైడ్’ని కనిపెట్టాడు. అది ఈనాటికీ వాడుకలో ఉండటం విశేషం.
ఆ ప్రయోగం డేవీకి మంచి పేరు తెచ్చింది. ఫలితంగా 24 సంవత్సరాలకే అతను లండన్‌లోని ప్రతిష్ఠాకరమైన రాయల్ ఇనిస్టిట్యూషన్‌లో ప్రొఫెసర్‌గా నియమించబడ్డాడు. రాయల్ ఇనిస్టిట్యూట్‌లో ఒకపక్క పాఠాలు చెబుతూ, మరోపక్క తన పరిశోధనలు చేస్తూ సోడియం, పొటాషియం వంటి రసాయనాలను వేరుచేసే పద్ధతి కనిపెట్టి మానవాళికి మహోపకారం చేశాడు.
ఆ కాలంలో గనులు తవ్వే సమయంలో కార్మికులు ఉపయోగించే నూనె దీపాలు భయంకరమైన ప్రమాదాలు సృష్టించేవి. అందుచేత ప్రభుత్వం డేవీని వాటిని నివారించే సాధనం కనిపెట్టమని కోరింది. డేవీ పరిశోధనలు చేసి 1815లో ‘మైనర్స్ సేఫ్టీ ల్యాంపు’ను కనిపెట్టి కార్మికులకు మహోపకారం చేశాడు. 1820లో హంఫ్రీ డేవీ లండన్‌లోని రాయల్ సొసైటీకి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. అనేక పరిశోధనలకు సహాయ సహకారాలను అందించిన హంఫ్రీ డేవీ ఆధునిక పరిశోధకులకు గురువుగా కొనసాగాడు. మానవ జాతి మనుగడకు ఎంతో కృషి చేసిన ఆ మహనీయుడు 1829 సం.లో మరణించాడు.

-పి.వి.రమణకుమార్