S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

H2O

‘నది పొంటి (వెంట) మనిషి ఉండేవాడు
వాగు వెంట అతని మనసుండేది
నీటి ధార వెనక ఆ మనిషి రాజేసుకునే నిప్పుండేది
కానీ
ఇప్పుడు ఆ మనిషి నీటి వెనకా లేడు
కన్నీటి వెనకా లేడు
మనిషి రోడ్డు వెనక ఉన్నాడు
రోడ్డు పొంటి ఉన్నాడు’
అన్నాడు ఓ తెలుగు కవి కన్న ‘రోడ్డు’ అన్న కవితలో. మనిషి జీవితం నీటి దగ్గర మొదలయ్యేది. ఎక్కడ వాగు ఉంటే, ఎక్కడ నది ఉంటే అక్కడ నాగరికత పరిఢవిల్లేది. ఇప్పుడు అంతా రోడ్డుమయం. అవుటర్ రింగ్ రోడ్డూ, ఈ రోడ్డూ ఆ రోడ్డూ. వీటి చుట్టూ మనిషి జీవితం పరిభ్రమిస్తుంది.
నీరు లేకుండా మనిషి జీవితం లేదు. మన శరీరం నిండా నీళ్లే. మన భూమి నిండా నీళ్లే. భూమి చుట్టూ నీళ్లే. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే దాకా నీటితోనే పని.
నీటి శబ్దం వినసొంపుగా ఉంటుంది. నీటి ధార కన్పిస్తే మనిషి పరవశించిపోతాడు. జలపాతాలు మనిషిని ఎన్నో యుగాలుగా ఆనందాన్నిస్తున్నాయి. జలపాత శబ్దాలు, నీటి గలగలలు, అలల అల్లరి మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీటిని వాడతాం. వస్తువులని శుభ్రం చేసుకోవడానికి నీటిని వాడతాం. పూజల్లో పూలని, ఇతర సామాగ్రిని పవిత్రం చేసుకోవడానికి నీటిని వాడతాం.
ఆకాశం ఇచ్చే ఆశీర్వాదం నీరు. మనల్ని ఆకాశం నీరుతో ఆశీర్వదిస్తుంది. నదులు, చెరువులు, సముద్రాలు మనకు సంవత్సరాలుగా ఎంతో ఉపశమనాన్ని ఇస్తున్నాయి. నీరుని ఎక్కువ తాగండి. ఆరోగ్యం బాగుంటుందని ఎంతోమంది మనకు చెబుతున్నారు. అయినా మనలో చాలామంది వాళ్ల శరీరాలకి తగినంత నీరు ఇవ్వడం లేదు. అవసరమైనంత నీరు శరీరానికి అందితేనే శరీరం ఉత్సాహంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉండే మనిషి ఆనందంగా ఉంటాడు. ఆనందంగా ఉండే మనిషి ఇతరులను ఆనందపరుస్తాడు.
హ2్జ సూత్రం మన జీవన సూత్రం కావాలి.
ఒక్క చుక్క నీటిలో సముద్రాల సముద్రాల రహస్యం దాగి వుంది అన్నాడు ఖలీల్ జిబ్రాన్. మరి ఒక్క నీటి చుక్కను వృథా చేయడం తగునా?