S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భోజనం

‘త్రీ ఇడియట్స్’ అన్న సినిమాలో ఓ ప్రొఫెసర్ ఏ మాత్రం సమయం వృథా చేయకుండా ఒకేసారి ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. చాలా పనులు చేసుకోవాలి. కానీ భోజనం చేసేటప్పుడు వేరే పనులు చేయకూడదు.
టీవీలు వచ్చిన తరువాత అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ‘మొగలి రేకులు’ ‘శ్రావణ సమీరాలు’ లాంటి రోజువారి సీరియల్స్ వచ్చిన తరువాత ఈ అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. సీరియల్ చూస్తూ భోజనాలు చేయడం చాలామంది మొదలుపెట్టారు. ఇంట్లోకి ఇంటర్నెట్ వచ్చిన తరువాత లాప్‌టాప్‌లో మొఖం పెట్టుకొని తినడం అలవాటు చేసుకున్నారు. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తరువాత వాట్సప్‌లు చూస్తూ మెసేజీలు పెడుతూ భోజనాలు చేయడం మొదలుపెట్టారు. ఈ అలవాటు మానుకోవడానికి ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిన పరిస్థితి వచ్చేసింది.
ఇంట్లో వాళ్లు కలిసి భోజనాలు చేయడంలోని ఆనందమే వేరు. ఇప్పుడు చిన్న కుటుంబాలు వచ్చేశాయి. వున్న నలుగురైనా కలిసి భోజనం చేయకుండా ఎవరి స్మార్ట్ ఫోన్లో వాళ్లు లీనమై పోయి, లేదా టీవీ, లాప్‌టాప్‌ల్లో తలదూర్చి భోజనాలు చేస్తే ఏం ఉంటుంది. ఏమీ వుండదు. అనవసరమైన ఒత్తిడి తప్ప.
కలిసి భోజనం చేయడం వల్ల చాలా విషయాలు మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త సంగతులూ తెలుస్తాయి. ఒకరి అనుభవాలు, ఆ రోజుకు సంబంధించిన విషయాలు చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అవి కాలేజీ విషయాలు కావొచ్చు. స్కూలు విషయాలు కావొచ్చు. ఆఫీసు విషయాలు కావొచ్చు. ఆ రోజు మనం చూడకుండా పోయిన వార్తావిశేషాలు కావచ్చు. కలిసి భోజనాలు చేసే వ్యక్తుల్లో, కుటుంబాల్లో అనుబంధాలు బలంగా ఉంటున్నాయి. ప్రేమలు వ్యక్తపరచుకోవడానికి అది ఒక అవకాశంగా కూడా మారుతుంది. సరదాగా మాట్లాడుకోవడానికి, నవ్వుకోవడానికి అవకాశం చిక్కుతుంది. ఇది ఒక ఇంట్లోనే కాదు. పనిచేసే చోట కూడా ఇదే పద్ధతి అలవర్చుకుంటే ఇంకా బాగుంటుంది. స్క్రీన్ చూడకుండా భోజనం చేస్తే ఎన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. సరదాగా నవ్వుకోవచ్చు. ఆరోగ్యంతోబాటు అనుబంధాలు బలపడుతాయి. అయితే అనవసర విషయాలు మాట్లాడకపోతే మరీ మంచిది.

**
పెద్దల మాట

మన జీవితానికి ఒక ఉద్దేశం, ఒక లక్ష్యం ఉంటేగానీ అది జీవితం అనిపించుకోదు.
-రాబిన్

-జింబో 94404 83001