S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎంతెంత విరామం తీసుకున్నాడు? (పజిల్)

ఒక చాకలి ఒక్కొక్క షర్ట్, దుప్పటి, జీన్స్, చీరని ఉతకాలి. ప్రతీది ఉతికి ఆరేయటానికి పధ్నాలుగు నిమిషాలు పడుతుంది. షర్ట్ ఆరటానికి ఒక గంట పదకొండు నిమిషాలు పడుతుంది. దుప్పటి ఆరటానికి రెండు గంటల ఇరవై నిమిషాలు పడుతుంది. జీన్స్ ఆరటానికి మూడు గంటల ఆరు నిమిషాలు పడుతుంది. చీర ఆరటానికి ఇరవై ఏడు నిమిషాలు చాలు. ఒకేసారి అన్నీ బట్టలు ఆరిన తరువాత తీసుకొని ఎటువంటి జాప్యం లేకుండా ఇంటికి వెళ్లాలి అనుకున్నాడు. మధ్యలో వీలు చిక్కినప్పుడల్లా సరదాగా చెట్టు నీడన సేద తీరదామనుకున్నాడు. ఆ చాకలి ఎప్పుడెప్పుడు ఎంతెంత విరామం తీసుకున్నాడు. మొత్తం ఎంత విరామం తీసుకున్నాడు?

జవాబు: ముందుగా జీన్స్ ఉతికి ఆరేసి 32 నిమిషాలు విరామం
తీసుకున్నాడు. తరువాత దుప్పటి ఉతికి ఆరేసి 55 నిమిషాలు విరామం తీసుకున్నాడు. తరువాత షర్ట్ ఉతికి ఆరేసి 30
నిమిషాలు విరామం తీసుకున్నాడు. తరువాత చీరను ఉతికి ఆరేసి 27 నిమిషాలు విరామం తీసుకుని, ఒకేసారి ఆరిన అన్నీ బట్టలు తీసుకొని ఇంటికి వెళ్లాడు. మొత్తం ఎంత అంటే 144 నిమిషాల విరామం తీసుకున్నాడు.

-చామర్తి వెంకట రామకృష్ణ