S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కొడుకు స్నేహితులే ‘బంగారుబాబు’ను చంపారు!

పూణె: బంగారు చొక్కాతో పాటు వొంటినిండా పసిడి నగలు ధరిస్తూ ‘బంగారుబాబు’గా ప్రసిద్ధి చెందిన పూణె వ్యాపారి దత్తాత్రేయ పుగేను అతని కుమారుడు శుభమ్ స్నేహితులే కత్తులతో పొడిచి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. గురువారం అర్ధరాత్రి దత్తాత్రేయ ఓ పార్టీలో ఉండగా హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు సంబంధించి శుభమ్ స్నేహితులైన అయిదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పరారైన మరో నలుగురు స్నేహితుల కోసం గాలిస్తున్నారు. కేవలం లక్షా 50 వేల రూపాయల కోసం శుభమ్ స్నేహితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. శుభమ్ స్నేహితుడైన అతుల్ మోహిత్ గురువారం రాత్రి విందు ఏర్పాటు చేశాడు. విందుకు శుభమ్‌తో పాటు అతని తండ్రి దత్తాత్రేయను కూడా మోహిత్ ఆహ్వానించాడు. ఆ పార్టీకి దత్తాత్రేయ, అతని కుమారుడు శుభమ్ వేర్వేరు కార్లలో వెళ్లారు. విందుకు అవసరమైన ఆహార పదార్థాలను తీసుకుని శుభమ్ వెళ్లగా అక్కడ తన తండ్రిని మోహిత్‌తో పాటు మిగతా స్నేహితులు కత్తులతో పొడవడం చూశాడు. లక్షన్నర రూపాయలకు సంబంధించి తన తండ్రిని విందుకు పిలిచి తన స్నేహితులు కత్తులతో దాడి చేశారని శుభమ్ చెబుతున్నాడు. కత్తిపోట్లకు గురైన దత్తాత్రేయ ప్రాణాలు కోల్పోవడంతో హత్యకేసును పోలీసులు నమోదు చేశారు.