S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎవరి ప్రాణం వారికి తీపి (కథ)

అదొక అడవి. ఆ అడవిలో జంతువులన్నీ చాలా హాయిగా, నిర్భయంగా జీవిస్తున్నాయి. అంతా ఎవరి ఆహారం వారు సంపాదించుకుని తింటూ, తోటి వారికి సాయం చేస్తూ, కలిసి కబుర్లాడుకుంటూ, అన్ని జంతువుల పిల్లలూ కలివిడిగా ఆడుకుంటూ ఐకమత్యంగా ఉన్నాయి. దానికి కారణం ఆ అడవిలో పులులూ, సింహాలూ లేకపోవడమే.
ఒకరోజున యధాప్రకారం తల్లి తండ్రి జంతువులు తమ పిల్లల ఆహారం కోసం వెతుకుతూ వెళుతున్నాయి. పిల్ల జంతువులన్నీ ఇంకా బద్దకంగా పకడల మీదే వాటి నివాసాల్లో పొర్లుతూనే ఉన్నాయి.
ముసలీ ముతకా జంతువులు ఏ స్నేహితుడో తమకు ఇంత తిండి సంపాదించుకొచ్చి పెట్టక పోతాడా అని ఆశగా చూస్తూ ఉన్నాయి.
ఇంతలో ఎక్కడి నుంచో వాటికి పులి గాండ్రింపు వినిపించింది. అడవి దద్దరిల్లింది. ఇంకేముందీ చిన్నా పెద్దా అన్ని జంతువులూ వాయు వేగంతో పరుగు లంఘించుకున్నాయి.
ఒక ఏనుగు గబగబా నడుస్తూ తన పెద్ద శరీరాన్ని ఎక్కడ దాచాలా అని చూస్తూ, వొత్తుగా పెరిగి ఉన్న రెల్లు గడ్డికేసి నడుస్తున్నది. ఇంతలో దానికి ఒక సాలీడు పరుగెట్టడం కనిపించింది. ఆ ఏనుగు సాలీడును పలకరించి ‘ఓ తంతునాభమా! (సాలెపురుగు) ఎక్కడికి అంత వేగంగా వెళుతున్నావు?’ అని అడిగింది.
సాలె పురుగు వేగంగా పరిగెడుతూనే ‘నీవు వినలేదా! పులి గాండ్రింపు? ప్రాణ భయంతో పరిగెడుతున్నాను’ అని సమాధానం చెప్పింది.
దానికి ఆ ఏనుగు పెద్దగా నవ్వి ‘ఏంటీ! నీకూ ప్రాణ భయమా! నీవెంత నీ ప్రాణమెంత? నీవు మరణిస్తే ఎవరికి నష్టం? ఈ అడవికి అలంకారమైన నాలాంటి పెద్ద జంతువు మరణిస్తే నష్టం కానీ, నీ ప్రాణమెంత? నీవెంత?’ అంది.
దానికి సాలీడు ‘నీ ప్రాణం నీకు గొప్పైతే నా ప్రాణం నాకు గొప్ప. నేను మరణిస్తే నా భార్య, నా సంసారం, నా పిల్లలూ, నా తల్లిదండ్రులు ఏమవుతారు? నాకు మాత్రం నా వారి మీద మమకారం లేదని ఎలా అనుకుంటున్నావు? ఎవరి ప్రాణం వారికి తీపి’ అంటూ వెళ్లింది.
తన తొందరపాటుకు సిగ్గుపడ్డ ఆ దంతి తల వంచుకుని వెళ్లిపోయింది.

-హైమా శ్రీనివాస్