S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మర్యాదస్థుడు (స్ఫూర్తి)

రాత్రి భోజనాల దగ్గర ప్రియేష్ తల్లిదండ్రులు రాబోయే శనాదివారాల్లో ఇల్లు ఎలా సర్దాలా అని చర్చించుకుంటూండగా ప్రియేష్ తల్లితో చెప్పాడు.
‘అమ్మా! ఇవాళ స్కూల్లో ఏం జరిగిందో తెలుసా?’
తల్లి జవాబు చెప్పలేదు.
కొద్దిసేపాగి మళ్లీ చెప్పాడు.
‘కూరలో ఉప్పు తగ్గింది. పులుసులోని ముక్కలు నాకు కొన్ని వేయి’
తల్లి వాడి వంక కోపంగా చూస్తూ చెప్పింది.
‘నేనూ, మీ నాన్న సీరియస్‌గా మాట్లాడుకోవడం చూశావుగా? నువ్వు మధ్యలో అడ్డొచ్చావు. ఇది మర్యాద కాదు. ప్లీజ్ ఏమైంది?’
‘ప్లీజ్. నాకు పులుసు వడ్డించవా?’ ప్రియేష్ మళ్లీ కోరాడు.
‘సారీని ఏం చేసావు? అమ్మ నీ తప్పు చెప్పాక నువ్వు సారీ చెప్పాలా? లేదా?’ తండ్రి అడిగాడు.
‘సారీ!’
‘ప్రియేష్. నువ్వు ఈ మధ్య మరీ అమర్యాదగా ప్రవర్తిస్తున్నావు’ తల్లి చెప్పింది.
‘మనం ఏ రెస్ట్‌రెంట్లోనో లేదా ఇంకొకరి ఇంట్లోనో లేము కదా?’ ప్రియేష్ చెప్పాడు.
‘అంటే ఇంట్లో మర్యాదగా ప్రవర్తించవా? బయటేనా?’
‘అవును. నేను బయట వారితో ఉన్నప్పుడు మర్యాదగా ప్రవర్తిస్తాను. కాని ఇంట్లో కూడానా?’ ప్రియేష్ అడిగాడు.
‘అవును. మర్యాద అనేది బయటి వాళ్లకి తప్ప ఇంట్లో వాళ్లకి ఇవ్వక్కర్లేదని ఎవరు చెప్పారు? అది ఇంట్లో అలవాటైతేనే బయట కూడా అలా ప్రవర్తిస్తావు’ తల్లి చెప్పింది.
‘నువ్వు మన సందులో క్రికెట్ ఆటని ప్రాక్టీస్ చేయకుండా ఒకేసారి గ్రౌండ్‌లో ఆడగలవా? నువ్వు చెప్పింది ఎలా ఉందంటే, ఫొటో తీసేప్పుడు నవ్వుతాను. మిగతా అప్పుడు చిటపట్లాడుతాను అన్నట్లుంది. అది మోసం చేయడం కూడా అవుతుంది. ఫొటో తీయనప్పటి నీ మొహం తెలీక ఎప్పుడూ నవ్వుతూంటావని మోసపోతారు. కెమేరా ముందు మంచిగా, దాని వెనక చెడ్డగా. అప్పుడు నువ్వు రెండు మొహాల మనిషివి అవుతావు’ తండ్రి చెప్పాడు.
ప్రియేష్ కొద్ది క్షణాలు ఆలోచించి చెప్పాడు.
‘మీరిద్దరూ చెప్పింది నిజమే. ఇక నించి నేను అన్ని చోట్లా మర్యాదగా ప్రవర్తిస్తాను’
‘నిజానికి ఇంట్లో మర్యాదగా ప్రవర్తించడం మన సంప్రదాయం కాదు. తల్లిదండ్రులకి థాంక్స్ చెప్పక్కర్లేదు. కాని విదేశస్థులు ఎంతో మర్యాదగా ప్రవర్తించడానికి కారణం వారు ఇంట్లో కూడా కుటుంబ సభ్యులతో మర్యాదగా ప్రవర్తించడమే. ఓ మంచి సంస్కృతిని అలవరచుకోడానికి మనం ఓ సంప్రదాయాన్ని వదిలేయడంలో తప్పు లేదు’ తండ్రి చెప్పాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి