S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కలుపు మొక్కలు (స్ఫూర్తి)

స్వప్న బాలకి విసుగ్గా ఉంది. ఇంటి ముందున్న పూల మొక్కల మధ్యన పెరిగిన కలుపు మొక్కలని పీకసాగింది. ఆమె మిత్రులంతా ఆ రోజు నెహ్రూ జూ పార్క్‌కి వెళ్లారు. స్వప్నబాల కాలికి బేండేజ్ ఉండటంతో వెళ్లలేకపోయింది. కాల్లో అద్దం పెంకు గుచ్చుకోవడంతో డాక్టర్ బేండేజ్ కట్టాడు. సినిమాకి తీసుకెళ్తానన్న తండ్రి బిజీగా ఉండటంతో మర్నాడు తీసుకెళ్తానని చెప్పాడు. ఇవన్నీ ఆలోచిస్తూంటే కలుపు మొక్కలు పీకే స్వప్నబాలకి బాధగా అనిపించింది.
పీకటం పూర్తయ్యాక అక్కడికి వచ్చిన తాతయ్య చూసి మెచ్చుకున్నాడు.
‘మొత్తం కలుపు మొక్కలు పీకేసావు. ఇప్పుడు పూల మొక్కలు అందంగా కనిపిస్తున్నాయి. పని చక్కగా చేసావు’
‘కానీ ఈ పని నాకు నచ్చలేదు’ నిరసనగా చెప్పింది.
‘నచ్చలేదా?’
‘అవును’
ఆయన కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి తర్వాత చెప్పాడు.
‘పూల మొక్కల మధ్యన కలుపు మొక్కలు పెరిగినట్లుగానే మన జీవితాల్లో కూడా కష్టాలు ఎదుగుతూంటాయి. వాటిని ఎప్పటికప్పుడు పీకేయకపోతే అవి పెరిగి పక్కనే ఉన్న సుఖాలనే పూలని కప్పెట్టి, కనపడనీకుండా చేస్తాయి’
స్వప్నబాల కొద్ది క్షణాలు ఆలోచించి చెప్పింది.
‘నువ్వు చెప్పింది నిజమే తాతయ్యా. కలుపు మొక్కలు పీకేదాకా మొక్కలకి ఉన్న ఎర్రటి పూలు నాకు కనపడలేదు. అలాగే ఇందాక నేను నెహ్రూ జూ పార్క్‌కి స్నేహితురాళ్లతో వెళ్లలేదన్నదే ఆలోచించాను తప్ప ఆ పార్క్‌ని ఇప్పటికే మూడుసార్లు చూశానన్న సంగతి మర్చిపోయాను. నాకు బేండేజ్ వచ్చినందుకు నాన్న నాకు ఏభై రూపాయలు ఇచ్చారు. రెండు రోజులు స్కూలుకి వెళ్లకుండా ఎంచక్కా టివిలో పోగో ఛానల్‌ని చూడచ్చు’
‘నువ్వు కోరగానే మీ నాన్న పంపి ఉంటే ఆ పార్క్‌లో బేండేజ్ కాలితో ఎంత ఇబ్బంది పడేదానివో? ఎవరి జీవితం పూల మొక్కల్లా సరిగ్గా ఉండదు. ప్రతీ వారి జీవితాల్లో చిన్న, పెద్ద కలుపు మొక్కలు వస్తూంటాయి. వాటిని తెంపేసి పూలని చూడటం నేర్చుకోవాలి. మనకి ప్రాప్తమైన దాంతో తృప్తి పడాలి’ తాతయ్య బోధించాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి