S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పరిణితి (స్ఫూర్తి)

వేసవి సెలవుల్లో అంతా అమ్మమ్మ, తాతయ్యల ఊరు వెళ్లాలని నిర్ణయించుకున్నాక ఉద్ధవ్‌కి సమ్మర్ క్లాసెస్ మొదలవుతాయని తెలిసింది. దాంతో ఉద్ధవ్‌ని తీసుకెళ్లాలా? వద్దా అన్న చర్చ ఇంట్లో మొదలయింది. ఆ క్లాస్‌లకి హాజరవడం మంచిదని చివరికి ఉద్ధవ్ తండ్రి నిర్ణయించాడు. వాడిని చూసుకోవడానికి తను ఆగిపోవాలని కూడా నిర్ణయించాడు.
‘పెద్దవాడ్ని అయ్యాను. నేను ఒంటరిగా ఇంట్లో ఉండగలను. మీరు వెళ్లండి నాన్నగారు’ ఉద్ధవ్ చెప్పాడు.
‘నీలో ఇంకా పరిణితి లేదు. కాబట్టి నాన్నగారు ఉండటమే సబబు’ ఉద్ధవ్ తల్లి చెప్పింది.
‘నా వయసిప్పుడు ఆరేళ్లు కాదే? ఎందుకు లేదు?’ వాడు రోషంగా చెప్పాడు.
కొద్ది క్షణాలు ఆలోచించి ఆమె నవ్వుతూ అడిగింది.
‘పరిణితి అంటే ఏమిటో అసలు నీకు తెలుసా?’
‘నేను ఇంట్లో ఒంటరిగా ఉండగలగడం’
‘పరిణితి మీద నిపుణులు అనేక వ్యాఖ్యానాలు చేశారు. నీకు తేలిగ్గా అర్థం అయ్యే భాషలో చెప్తాను. దాన్నిబట్టి నీలో పరిణితి వచ్చిందా? లేదా అన్నది నువ్వే చెప్పు’
‘అలాగే. చెప్పు’
‘పరిణితి అంటే కుక్క పిల్ల నీ స్వంతం అవడమే కాదు. దానికి రోజూ ఆహారం, నీరు ఇవ్వడం కూడా. నువ్వా పని చేస్తున్నావా?’
‘పరిణితి అంటే చక్కగా డ్రెస్ చేసుకోవడమే కాదు. విడిచాక వాటిని రోజూ ఉతికే బట్టల మూటలో ఉంచడం కూడా. నువ్వా పని చేస్తున్నావా?’
పరిణితి అంటే ఫోన్‌లో మాట్లాడటమే కాదు.
ఇతరులు మాట్లాడే అవకాశం ఇవ్వడం కూడా. నువ్వా పని చేస్తున్నావా?’
పరిణితి అంటే రాత్రి ఎక్కువసేపు మేలుకొని ఉండడమే కాదు.
ఉదయం ఆలస్యం చేయకుండా లేవడం కూడా. నువ్వా పని చేస్తున్నావా?’
ఉద్ధవ్ దానికి జవాబులు చెప్పలేకపోయాడు.
‘జీవితంలో బాధ్యతని అంగీకరించే కొద్దీ పరిణితి వస్తుంది తప్ప వయసుతో రాదు. పరిణితి పెరిగే కొద్దీ కొత్త బాధ్యతలు కూడా వస్తూంటాయి.
పరిణితి అంటే ఇంట్లో ఒంటరిగా ఉండడమే కాదు.
మిత్రులతో తప్పులు పనులు చేయకుండా నీ మీద నమ్మకాన్ని కాపాడుకోవడం కూడా. నీలో ఆ పరిణితి ఉందని నేను అనుకోను. కాబట్టి నేను ఇంట్లో ఉండిపోతాను’ తండ్రి చెప్పాడు.
‘నిజమే. ఇక నించి నేను నాలో పరిణితిని పెంచుకుంటూంటాను’ ఉద్ధవ్ చెప్పాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి