S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బంగారుస్వామి (కథ)

భారతదేశం ఎంతోమంది మహాపురుషులకు, సాధువులకు, స్వాములకు నిలయం. దక్షిణా పథంలో ఒక గ్రామంలో ఒక స్వామి చిన్ననాటనే వెలుగులోకి వచ్చారు. క్రమంగా ఆయన కీర్తి రాష్ట్రం ఎల్లలు దాటి, దేశం నలుమూలలా వ్యాపించి, ఆఖరికి ప్రపంచం నలుమూలలా విస్తరించింది. వారి మహిమలు అపారం. అందువలన వారికి దేశీయ, విదేశీయ భక్తులు పెక్కులుండేవారు. కాపాడమని వారిని ఆశ్రయించేవారు.
వచ్చిన భక్తులు స్వామి వారికి, అదే ఆ బంగారు స్వామికి (్భక్తులు ఆయనని అలా పిలిచేవారు. ఎందుకంటే బంగారు గొలుసులు కూడా సృష్టించి ఇస్తూ ఉంటారాయన.) అనేక కానుకలు ఇచ్చేవారు. కొందరు తమ యావదాస్తి వారికి రాసిచ్చేవారు. అలా కోట్లకోట్ల ఆస్తులు ఆయనకు సంక్రమిస్తూ ఉండేవి. దేశ విదేశాల్లోనే అత్యంత ధనిక స్వామిగా పేరు పొందారు బంగారు స్వామి. ఆయన దగ్గరకు వస్తే మనశ్శాంతి కలుగుతుందని భక్తుల నమ్మకం.
ఆయనంటే గిట్టని ఇతర మతస్థులు ఇతను దొంగ స్వామి అని, అక్రమంగా వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నాడని, ఆదాయపు పన్ను ఎగగొడుతున్నాడని ఫిర్యాదులు చేశారు.
ఒకనాడు ఆదాయపన్ను అధికారులు బంగారు స్వామి ఆశ్రమం మీద దాడి చేశారు. వేల కొద్దీ భక్తులు ప్రతిఘటిస్తున్నా పట్టించుకోకుండా ఓ నలుగురు అధికారులు చేత ఆయుధాలు ధరించి బంగారు స్వామి ఆంతరంగిక మందిరంలోకి జొరబడ్డారు దురుసుగా.
ధ్యానం చేసుకుంటున్న స్వామి ఆ నలుగురిని చూసి ‘ఎవరు మీరు? నా అనుమతి లేకుండా మీరెలా లోనికి వచ్చారు?’
‘మాకు ఎవరి అనుమతి అక్కర్లేదు. ఎక్కడికి పడితే అక్కడికి రాగలం. ముఖ్యంగా ఎక్కడ అవినీతి పడగలెత్తుతుందో అక్కడికి దూసుకు రాగలం. నా పేరు బలభద్రుడు. మేము ఆదాయపు పన్ను అధికారులం. నేను నాయకుడిని. ఈ ముగ్గురు నా సహాయకులు’ చెప్పాడు ఒకతను.
‘మీరు ఆదాయపు పన్ను కట్టడం లేదని అభియోగం’ ఇంకోతను చెప్పాడు.
స్వామివారు నవ్వారు పెద్దగా.
ఆ నలుగురు అధికారులు బిత్తరపోయి ఆయన వంక కోపంగా చూశారు.
‘బాగుంది. నాకు ఆదాయమే లేదు. నేను ఆదాయపు పన్ను కట్టలేదా?’ చిద్విలాసంగా అన్నారు ఆయన జపమాల ఊపుతూ.
స్వామి వారు నవ్వుతూ తాళాల గుత్తి అందించారు దిండు కింద నుండి తీసి.
స్వామివారి ఎదురుగా ఆరు బీరువాలున్నాయి. అన్నింటినీ తాళాలతో తెరిచారు. ఒక్కో దానిలో నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు, ఖరీదైన వస్తువులు, రతనాలు, వజ్రాలు, బంగారు దిమ్మెలు కనిపించాయి. వేల కోట్ల ఖరీదైన సంపద కళ్లు జిగేల్ మనిపించింది.
అంత సిరిసంపదలను చూసి ఆ నలుగురు అధికారులు నివ్వెరపోయారు.
‘మిమ్మల్ని వెంటనే నిర్బంధంలోకి తీసుకుంటున్నాం’ బీరువాలకు తాళాలు వేస్తూ చెప్పాడు బలభద్రుడు గర్వంగా నవ్వుతూ.
‘ఎందుకు? ఏ కారణంతో నన్ను నిర్బంధిస్తారు?’ అడిగారు స్వామి నవ్వుతూ.
‘అదేంటి? అక్రమ సంపాదన కూడబెట్టినందుకు. ఆదాయపు పన్ను కట్టనందుకు’ చెప్పాడు ఆదాయపు పన్ను అధికారి అయిన బలభద్రుడు.
‘ఏదీ సంపద? ఎక్కడుంది? నాకేం కనపడటం లేదే?’ స్వామి వారు అన్నారు.
‘అట్లానా! మళ్లీ చూడండి మీ కళ్లతోనే’ అంటూ బీరువాలు తిరిగి తెరిచారు అధికారులు.
ఆశ్చర్యం! ఆ బీరువాలు అన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. అక్కడేమీ లేదు.
అధికారులు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. తెల్ల మొహాలేసుకొని స్వామి వంక చూశారు.
‘ఆశ్రమానికి చేరే ధనం.. పేదలకు, అనాధలకు.. నిరాశ్రయులకు ఖర్చు పెట్టబడుతుంది. ఆకార రూపేణా ఏదీ ఇక్కడ మీకు కనిపించదు. మానవ సేవే మాధవ సేవ అన్నారు. కాబట్టి- ఆశ్రమం ద్వారా ‘మాధవ సేవ’ చేస్తున్నాం. మీరు చూసిందీ చూస్తున్నదీ ఏదీ శాశ్వతం కాదు... మీలాంటి వారి ప్రతాపం అవినీతి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, లంచగొండి ఉద్యోగులపై చూపించండి. సమాజానికి ఎంతో కొంత మేలు కలుగుతుంది. ఇక సెలవు. వెళ్లి రండి’ అంటూ బంగారు స్వామి పలికారు.

-విశాల వియోగి