S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లక్ష్యసాధనలో మరువకూడనివి!

వైఫల్యం లక్ష్య సాధనలో ఒక అడుగు అని అంగీకరించాలి.
* మీరు ఆశించినది దక్కనపుడు విచారించడంకన్నా మరొక ఉన్నతమైనది మీకు దక్కేందుకే మీరు ఆశించినది మీకు దక్కలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
* ఎప్పుడూ ఏ ప్రయత్నాన్ని వదలకూడదు.
* మీరు మీరుగా ఉండాలి. ఇతరుల సానుభూతి చూపులకు చలించిపోకూడదు.
* జీవితం అంతా సమస్యలను ఎదుర్కోవడమే అని భావించడం కన్నా ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకునే అవకాశాలు వస్తున్నాయని అనుకోవాలి.
* మీ కలలు మీ భవిష్యత్‌కు సూచికలుగా గుర్తించాలి.
* ఎవరో ఒకరు, ఎక్కడో ఒకచోట మీకు సహాయపడతారు. అటువంటి వారి కోసం వెతకాలి.
* అపజయాన్ని మరింత మెరుగైన చర్యలకు దారిచూపేదిగా ఉపయోగించుకోవాలి.
* చిన్నచిన్న వైఫల్యాలు ఎదురయినపుడు మీ దృష్టి ఈ వైఫల్యాలు మీ లక్ష్య సాధనను ఎంతవరకు ప్రభావితం చేస్తాయో అంచనా వేసుకోవాలి.
* చిన్నచిన్న చికాకులు పెద్దవిగా తయారయ్యేటందుకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
మార్పులు చేసుకోవాలి!
* అనుదినం పని ప్రారంభించే సమయంలో మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే పనులు ప్రారంభించుకుంటే మనసుకు పని కొనసాగించాలనే ధోరణికి వస్తుంది.
* సమస్యాపూరకమైన పని లేదా మనసుకు నొప్పి కల్గించే పని ప్రారంభించి మనసు ఉత్సాహ ధోరణిని పాడు చేసుకోకూడదు.
* ఏ పనులు ప్రారంభిస్తే ముందుకు దూసుకు వెళ్లేందుకు మానసికంగా తయారుగా ఉంటారో అటువంటి పనులు చేసేందుకు మార్పులు మీకు మీరే చేసుకోవాలి.
* మీ ఆనందం కోసం కొంత సమయాన్ని అనుదినం మీరు కేటాయించుకోవాలి.
* అనుదినం ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దానిని సాధించే దిశలో కృషి చేయాలి.
* నిన్నటికన్నా ఈ రోజున నా పని తీరు ఎంత మెరుగయ్యింది అంచనా వేసుకోవాలి.
* ఇతరుల కోసం ఏదో ఒక మంచి పని చేస్తూ ఉండాలి.
* కలసి ఉండటం ఎంతో ముఖ్యం. సమిష్టి కృషి గొప్ప ఫలితాలు తెచ్చి పెడుతుంది.
* ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు దానిని విజయవంతంగా పూర్తి చేసేందుకు శారీరక, మానసిక సంసిద్ధత ఎంతో అవసరం.
* విజయం సాధించిన వెంటనే కఠినమైన, అయిష్టమైన సమస్యల పరిష్కారం చేపట్టాలి.
* మీ విజయాన్ని మీరు అభినందించుకునేందుకు, ఆనందం పొందేందుకు సమయాన్ని తీసుకోవాలి.
* మనసుకు, అంతరాత్మకు లక్ష్యం, కృషి గురించి బాగా తెలియజేసుకోవాలి.
తీసుకోవలసిన చర్యలు
* ఒక పని చేయడానికి అంకిత భావంతో ముందడుగు వేయడానికి ఒక అనుకూలమైన దృక్పథం ఎంతో అవసరం.
* ఇతరులతో పోల్చుకోవద్దు.
* మీరు సాధించిన ఫలితాలను మదింపు చేసుకనేటప్పుడు మీ గత ఫలితాలు, మీ శక్తిసామర్థ్యాలతో సరిపోల్చుకోవాలి.
* పని పరిమాణంకన్నా పనిలోని నాణ్యతను ఎంచుకోవాలి.
* మంచికి గొప్పకి తేడా మీరు చేసే పని పట్ల మీరు ఎంత శ్రద్ధ వహిస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
* మీరు అనుకున్న స్థాయికి తక్కువ స్థాయికి దిగజారి రాజీపడకూడదు.
* మీ లక్ష్యానికి సంబంధించి ఇతరుల ప్రతికూల అభిప్రాయాలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకూడదు.
* పనిలో నిమగ్నమై పోవాలి. మీతో కలిసి పని చేస్తున్న వారి గురించి తగినంతగా శ్రద్ధ చూపాలి.
* మిమ్మల్ని నిరుత్సాహపరచేవి, మీ దృష్టిని మళ్లించే అంశాలను మీరు పక్కన పెట్టాలి. టీవీని ఆఫ్ చేయాలి. ఇతర టాబ్లాయిడ్స్ ఉంటే తొలగించాలి.
* పని ఫలానాచోట, ఫలానా సమయంలో ప్రారంభించాలని ఉండదు. ఇప్పుడు, ఇక్కడే పని ప్రారంభించేందుకు మించిన మంచి సమయం ఉండదు.
బాస్‌తో ఎలా ఉండాలి?
* మీ భార్యకన్నా మీ బాస్ ముఖ్యం అనుకుని ప్రవర్తిస్తే త్వరలోనే ఇబ్బందుల్లో పడతారు.
* పనులు పూర్తయిపోవడంతో సరిపోదు, వాటిని పూర్తి చేసేటప్పుడు మీ పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి.
* విజ్ఞానం మీ పవర్. దానిని మీ బాస్‌తో పంచుకోవాలి. అప్పుడే మీ పలుకుబడి పెరుగుతుంది.
* దుష్ట స్వభావంగల బాస్ దగ్గర పని చెయ్యడం మీకు ఇష్టం లేకపోవచ్చు. అతడు పురమాయించిన పనులను తప్పించుకునే ప్రయత్నాలు మీరు చేసే అతడు మరింత దుష్టుడుగా తయారవుతాడు.
* మీ బాస్ అంటే మీరు ఇష్టంగా ఉండాల్సిన అవసరం లేదు. అతడి పట్ల మర్యాదగా మాత్రం ఉండాలి.
* మీకు ప్రేరణ కల్గించే అంశాలను తొలగిస్తామనే హెచ్చరికలు కూడా మీకు అద్భుతమైన ప్రేరణ కల్గిస్తాయి.
* అనుకూల దృష్టితో ఎదురుచూసేవి అనుకూలంగానే లభిస్తాయి.
* ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒకటి కావాలనుకుంటారు. మీ బాస్ ఏ కారణంగా మీతో కఠినంగా మాట్లాడుతున్నాడో మీకు తెలుసా?
* ఇవ్వండి. అప్పుడు మీకు తిరిగి వస్తుంది.
* అడగండి. అప్పుడు మీకు రావచ్చు.
* జయ విజయాలకు మించిన ఆదర్శ ప్రేరణ మరొకటి ఉండదు.
* మీ కొత్త ఆలోచనలు మీ బాస్‌తో పంచుకునేటప్పుడు దానిలో పెద్ద భాగస్వామి మీ బాస్ అయ్యాడంటే వెనుకాడకూడదు.

-సి.వి.సర్వేశ్వరశర్మ