S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వినాయక వ్రతకల్పము

-శ్రీరస్తు-
(ముందుగా బొట్టు పెట్టుకొని, దీపారాధన చేసి,
నమస్కరించుకుని, ఈ విధంగా ప్రార్థించాలి)
శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే॥
అయం ముహూర్త స్సుముహూర్తో అస్తు
తదేవ లగ్నం, సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ,
విద్యాబలం దైవబలం తదేవ, లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి॥
శ్లో॥ లాభస్తేషాం జయస్తేషాం, కుతస్తేషాం పరాభవః॥ ఏషామిందీవర
శ్యామో హృదయస్థో జనార్దనః॥
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం॥
(అని నమస్కరించుకుని అచమనం చేయాలి)
ఆచమ్య.. ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా,
ఓం మాధవాయ స్వాహా
(మూడు సార్లు కుడిచేతిలోకి కొంచెం నీరు పోసుకొని చప్పుడు చేయకుండా తాగాలి)
ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీ్ధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అథోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః.
(కుడి చేతిలో నీరు తీసుకొని కుడి చేతిమీదుగా ఎడమ వైపునకు చల్లాలి.)
ఉత్తిష్ఠంతు భూత పిశాచాః ఏతేభూమి భారకాః,
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే,
ఓం భూః ఓం భువః ఓం జనః ఓం తపః, ఓగ్‌ంసత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్‌ ఓ మాపోజ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్.
మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్త మానస్య అద్యబ్రహ్మణ, ద్వితీయ పరార్ధే శే్వత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే, అష్టావింశన్మహాయుగే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య..... ప్రదేశే కృష్ణా గోదావర్యౌః మధ్య దేశే.. శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన దుర్ముఖ నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షఋతౌ, భాద్రపదమాసే, శుక్లపక్షే చతుర్ధ్యాం తిధౌ, ఇందు వాసరే, శుభనక్షత్రే శుభయోగే శుభకరణే, ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్... గోత్ర... నామధేయః ధర్మపత్నీ సమేతస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం, పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం, సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ సిద్ధి వినాయక దేవతా ముద్దిశ్య, శ్రీ సిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం, కల్పోక్త ప్రకారేణ యథాశక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. (నీళ్లను చేతితో తాకాలి)
తదంగకలశారాధనం కరిష్యే. కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య.
(కలశమును నీళ్లతో ఉంచి అందులో పుష్పాలు, అక్షతలు, గంధమును వేసి కుడిచేతి ఉంగరపు వేలు అందులో మునిగేట్లుగా అరచేతితో మూయాలి)
కలశస్య ముఖేవిష్ణుః కంఠేరుద్రః సమాశ్రీతః,
మూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాస్మృతాః,
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యుజుర్వేదః స్పామవేదో హ్యథర్వణః,
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రీతాః,
ఓం... గంగేచయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధుకావేరి జలేస్మిన్ సన్నిధింకురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య
(కలశంలోని జలాన్ని దేవునిపైనా, పూజాద్రవ్యాలపై చల్లాలి. తరువాత తమ మీద కొద్దిగా చల్లుకోవాలి. అనంతరం గణపతిని పూజించాలి.)
ఓం గణానాంత్వాగణపతిగ్‌ం హవామహే
కవిం కవీనా, ముపమశ్రవస్తమమ్
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆనశ్శృణ్వన్నూతిభిస్సీదసాధనమ్

శ్రీ మహా గణాధిపతయే నమః
ఏకదంతం శూర్ప కర్ణం గజవక్త్రం చతుర్భుజం,
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్!
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం,
భక్త్భాష్టప్రదం తస్మాత్ ధ్యాయే త్తం విఘ్న నాయకమ్!
(వినాయక ప్రతిమకు నమస్కరించాలి. పూజాక్షతలు తలపై వేసుకోవాలి).
ఆవాహయామి: శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః, ఆసనం సమర్పయామి, తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ :
వౌక్తికైః పుష్పరాగైశ్చ
నానా రత్నైర్విరాజితం,
రత్న సింహాసనం చారు ప్రీత్యర్థం
ప్రతి గృహ్యతామ్(అక్షతలు వేయాలి)
అర్ఘ్యం: గౌరీ పుత్ర నమస్తేస్తు
శంకర ప్రియనందన,
గృహాణార్ఘ్యం మయాదత్తం
గంధ పుష్పాక్షతైర్యుతం!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి.(ఉద్ధరిణితో పళ్లెములో నీళ్లు వదలాలి)

పాద్యం: గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణద్విరదానన!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి. (ఉద్ధరిణితో పళ్లెములో నీళ్లు వదలాలి)
ఆచమనీయం: అనాథ నాథ సర్వజ్ఞ, గీర్వాణ పరిపూజిత
గృహాణాచమనం దేవ తుభ్యందత్తం మయా ప్రభో!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. (ఉద్ధరిణితో పళ్లెములో నీళ్లు వదలాలి)
మధుపర్కం: దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి.
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక! అనాథ నాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః పంచామృతస్నానం సమర్పయామి. (పాలు, తేనె, పంచదార, పెరుగు, నెయ్యి కలిపిన పంచామృతాన్ని సమర్పించాలి.)
స్నానం: గంగాది సర్వతీర్థ్భే్యః అమృతైరమలైర్జలైః
స్నానం కురుష్వ భగవ న్వుమా పుత్ర నమోస్తుతే!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధ్ధోక స్నానం సమర్పయామి.
(ప్రతిమపై నీళ్లు చల్లాలి.)
వస్త్రం: రక్తవస్తద్వ్రయం చారు దేవయోగ్యం చ మంగళమ్
శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః వస్తయ్రుగ్మం సమర్పయామి
(వస్తమ్రులు కానీ, లేదా పసుపుతో తడిపిన పత్తిని కానీ సమర్పించాలి)
యజ్ఞోపవీతం: రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనోత్తరీయకమ్
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. (వినాయకునికి నమస్కరించి యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి)
గంధం: చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్
విలేపనం సుర శ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతి గృహ్యతామ్!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి.
(స్వామిపై గంధం చల్లాలి)
అక్షతాభరణం: అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్
గృహాణ పరమానంద శంభుపుత్రనమస్తుతే!
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి. (అక్షతలు చల్లాలి)
పుష్పం: సుగంధాని చ పుష్పాణి జాతి కుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే! శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః పుష్పాణి పూజయామి. (జాజి, మల్లె వంటి 21 రకాల సుగంధ పుష్పాలతో పూజించాలి.)
అథాంగ పూజ:
(పాదముల నుంచి శిరస్సు వరకు సర్వాంగాలకు పూజ చేయవలెను.)
ఓం గణేశాయనమః పాదౌ పూజయామి, ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజాయామి, శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి; విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి; ఆఖువాహనాయ నమః ఊరుం పూజయామి; హేరంబాయ నమః కటిం పూజయామి; లంబోదరాయ నమః ఉదరం పూజయామి; గణానాథాయనమః నాభిం పూజయామి; గణేశాయ నమః హృదయం పూజయామి; స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి; స్కంధాగ్రజాయ నమః స్కంధౌ పూజయామి; పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి; గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి; విఘ్న హంత్రే నమః నేత్రే పూజయామి; శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి; ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి; సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి; విఘ్న రాజాయనమః సర్వాణ్యంగాణి పూజయామి.
ఏకవింశతి పత్రపూజ
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః అథైక వింశతి పత్ర పూజాంచ కరిష్యే (21 రకాల ఆకులతో పూజించాలి.)
సుముఖాయనమః మాచీపత్రం పూజయామి (మాచీపత్రం)
గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి(వాకుడు)
ఉమాపుత్రాయనమః బిల్వపత్రం పూజయామి(మారేడు)
గజాననాయనమః దుర్వాయుగ్మం పూజయామి(గరిక)
హరసూనవేనమః దత్తూర పత్రం పూజయామి(ఉన్మత్త)
లంబోదరాయనమః బదరీపత్రం పూజయామి(రేగు)
గుహాగ్రజాయనమః అపా మార్గపత్రం పూజయామి(ఉత్తరేణి)
గజకర్ణాయనమః తులసీపత్రం పూజయామి(తులసి)
ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి(మామిడి)
వికటాయ నమః కరవీర పత్రం పూజయామి
భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి(విష్ణుక్రాంత)
వటవే నమః దాడిమీ పత్రం పూజయామి(దానిమ్మ)
సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి(దేవదారు)
ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి(మరువం)
హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి
శూర్పకర్ణాయనమః జాజీపత్రం పూజయామి(జాజి)
సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి(ఏనుగు చెవి)
ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి(జమ్మి)
వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి(రావి)
సుర సేవితాయ నమః అర్జున పత్రం పూజయామి(మద్ది)
కపిలాయ నమః అర్కపత్రం పూజయామి(జిల్లేడు)
శ్రీగణేశ్వరాయనమః ఏకవింశతి పత్రాణి పూజయామి.
(మిగిలిన పుష్పాలన్నీ వేసి నమస్కరించాలి)
దూర్వాయుగ్మ పూజ
ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
సర్వసిద్ధి ప్రణాయకాయ నమః దుర్వాయుగ్మం పూజయామి
ఏకదంతాయనమః దుర్వాయుగ్మం పూజయామి
ఇభవక్త్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి
మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి
శ్రీ వినాయక అష్టోత్తర శతనామ పూజ
ప్రతి నామమునకు మొదట ‘ఓం’ అని, చివర ‘నమః’ అని చదువుతూ పుష్పములతో, పత్రితో పూజ చేయాలి.
ఓం గజాననాయ నమః, గణాధ్యక్షాయ, విఘ్నరాజాయ, వినాయకాయ, ద్వైమాతురాయ, ప్రజ్ఞనిధయే, ద్విముఖాయ, ప్రముఖాయ, సుముఖాయ, కృత్తినే, సుప్రదీపాయ, భవాత్మజాయ, శృంగారిణే, ఆశ్రీతవత్సలాయ, శ్రీఘ్రకారిణే, శాశ్వతాయ, బ్రహ్మచారిణే, సురాధ్యక్షాయ, విశ్వదృశే, విశ్వరక్షాకృతే, మహా బలాయ, పూష్ణే, హేరంబాయ, లంబజఠరాయ, హ్రస్వగ్రీవాయ, మహావీరాయ, దన్తినే, మంగళస్వరాయ, ప్రమదాయ, విఘ్నకర్త్రే, విఘ్నహన్రే్త, విశ్వనేత్రే, విరాట్పతయే, అవ్యక్తాయ, కుంజసురభంజనాయ, ప్రమోదాత్తాననాయ, మోదకప్రియాయ, శాంతిమతే, ధృతిమతే, కృతిమతే, కామినే, కపిత్థ్ఫలప్రియాయ, అపాకృతపరాక్రమాయ, సత్యదర్శినే, సంసారామ్బునిధయే, అగ్రగణ్యాయ, అగ్రగామినే, అగ్రపూజ్యాయ, మంత్రకృతే, చామీకరప్రదాయ, సర్వయన్రే్త, సర్వోపన్యాసాయ, సర్వవిద్యప్రదాయ, సర్వనేత్రే, సర్వసిద్ధి ప్రదాయకాయ, సర్వసిద్ధయే, పంచహస్తాయ, మహోదరాయ, మదోత్కటాయ, కుమారగురవే, అక్షోధ్యా, శ్రీపతయే, పార్వతీనందనాయ, ప్రభవే, పతయే, మహేశాయ, మణికింకిణి మేఖలాయ, దివ్యాంగాయ, సమస్తదేవతామూర్తయే, సహిష్ణవే, సతతోత్థితాయ, విభూతికారిణే, జిష్ణవే, విష్ణవే, బ్రహ్మరూపిణే, విష్ణుప్రియాయ, భక్తజీవితాయ, జితమన్మథాయ, ఐశ్వర్యకారణాయ, జ్ఞాననిధయే, యక్షకిన్నర సేవితాయ, గౌరీసుతాయ, బలాయ, బలోత్థితాయ, గణాధిపాయ, గంభీరనినదాయ, సఖ్యై, వటవే, అభీష్టవరదాయ, భక్తనిధయే, భావగమ్యాయ, మంగళప్రదాయ, కళ్యాణగురవే, ఉన్మత్తవేషాయ, పరజితే, శత్రుజితే, సమస్త జగదాధారాయ, సర్వైశ్వర్యప్రదాయ, పురాణపురుషాయ, అక్రాంతచిదచిత్ప్రభవే, శ్రీవిఘ్నేశ్వరాయ, భక్తపారిజాతాయ, విఘ్నేశాయ, శ్రీసిద్ధివినాయకాయ, శ్రీమహాగణాధిపతయే నమః
ధూపం:
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం
ఉమాసుత నమస్త్భ్యుం గృహాణ వరదోభవ
శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి.
(గణపతికి ధూపము వేయాలి)
దీపం: సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాజ్యోతితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్ఛామిదేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోరాద్దివ్య జ్యోతిర్నమోస్తుతే!
శ్రీ సిద్ధివినాయక స్వామినేనమః దీపం దర్శయామి. (దీపం చూపించాలి.)
నైవేద్యం: సుగంధాన్ సుకృతాం శ్చైవమోదకాన్ ఘృత పాచితాన్
నైవేద్యం గృహ్యతాం దేవగణముద్గైః ప్రకల్పితాన్
భక్ష్యం భోజ్యంచ చోష్యం పానీయమేవచ
ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక
శ్రీ సిద్ధి వినాయక స్వామినేనమః, నైవేద్యం సమర్పయామి.
(నైవేద్యం సమర్పించాలి.
ఓం ప్రాణాయస్వాహా, అపానాయస్వాహా, వ్యానాయ స్వాహా, ఉదానాయ స్వాహా, సమానాయ స్వాహా, (నైవేద్యాన్ని స్వామికి చేయి చూపుతూ సమర్పించాలి)
మధ్యే మధ్యే అమృత పానీయం సమర్పయామి,
ఉత్తరాపోశనం సమర్పయామి,
హస్తౌ ప్రక్షాళయామి,
పాదౌ ప్రక్షాళయామి,
శుద్ధం ఆచమనీయం సమర్పయామి
(తాగుటకు, చేతులు కడుగుకొనుటకు నీళ్లు ఉద్ధరిణితో సమర్పించి, పళ్లెములో వదలాలి)
తాంబూలం: పూగీఫలసమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః, తాంబూలం సమర్పయామి.
( తాంబూలం ప్రతిమ దగ్గర ఉంచాలి.)
నీరాజనం: సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే
లక్ష్మీరాష్టస్య్ర యాముఖేతయా మాసంగ్‌ం సృజామహి
హిరణ్యపాత్రం మథోః పూర్ణందధాతి
మథవ్యో సానీతీ ఏకథా బ్రహ్మణ ఉపహరతి
ఏకథైవ యాజమాన ఆయుస్తేజో దధాతి
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః కర్పూర ఆనంద నీరాజనం దర్శయామి (హారతి ఇవ్వాలి)
మంత్రపుష్పం: గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర గజానన
వినాయకేశతనయ సర్వ సిద్ధిప్రదాయక
ఏకదంతైక వదన తథా మూషికవాహన
కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిమ్.
సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజానన,
వక్రతుండః శూర్పకర్ణో, హేరంబః స్కంధ పూర్వజః
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే॥
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః
సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి.
అర్ఘ్యం: గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక
గంధ పుష్పాక్షతై ర్యుక్తం పాత్రస్థం పాపనాశనం.
శ్రీసిద్ధి వినాయక స్వామినే నమః పునరర్ఘ్యం సమర్పయామి.(నీళ్లు చల్లాలి)
ప్రదక్షిణ: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే.
పాపోహం పాపం కర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాం కృపయాదేవ శరణాగతవత్సల అన్యధా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్య భావేన రక్షరక్షో గణాధిప
శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
(మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణం చేసి స్వామివారికి నమస్కరించాలి)
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప
యత్పూజితం మయాదేవ పరిపూర్ణంతదస్తుతే
శ్రీ సిద్ధి వినాయక స్సుప్రీతస్సుప్రసన్నో వరదోభవతు.
సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు లోకాస్సమస్తాస్సుఖినోభవంతు.
శ్రీ సిద్ధి వినాయక దేవతా ప్రసాదం శిరసాగృహ్ణామి.
*