S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గాంధీ ఆడిన నాటకం-2 (భగత్‌సింగ్-45)

ఒప్పందం వల్ల ఎదురవుతున్న చిక్కుల గురించి ఈ సాయంత్రం నేను మిస్టర్ గాంధితో మూడు గంటలు మాట్లాడాను...
... ... ...
భగత్‌సింగ్ తరఫున అందిన మెర్సీ పిటిషనును గవర్నర్ జనరల్ తిరస్కరించిన సంగతి పత్రికల్లో చూశారా అని నేను అడిగాను. చూశాననీ దాని పర్యవసానాల గురించి ఆందోళన పడుతున్నానని గాంధి చెప్పాడు. ఉరిశిక్ష అమలు చేసేది ఏ తేదీన అన్నది నేను పేర్కొనలేదు. అది కరాచీ కాంగ్రెసుకు ముందా, తరవాతా అనేది ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిశీలించింది; అది ముందైనా, తరవాతైనా సమస్యలు తప్పవని గ్రహించాము; కాని - వాయిదా వేయడం ఉరికంబం ఎక్కబోయేవారికి మంచిది కాదని... శిక్షను మార్చే ఉద్దేశం ఏదీ లేనప్పుడు అలాంటిదేదో జరగబోతున్నదన్న అభిప్రాయాన్ని వ్యాప్తి కానిస్తే గాంధీకీ అన్యాయం చేసినట్టు అవుతుందని ప్రభుత్వం భావించింది - అని నేను గాంధీకి వివరించాను.
He (Gandhi) agreed that of the two alternatives, it is better not to wait, but he suggested, though not seriously, that the third course of commutation of the sentence would have been better still. He did not seem tobe particularly concerned about the matter. I told that we should be lucky if we got through without disorder, and I asked him to do all that he could to prevent meetings being held in Delhi during the next few days and to restrain violent speeches. He promised to do what he could.
... ... ...
He seemed to be confident about the Karachi congress, but he expected opposition from the left and said that the excution of Bhagat Singh might seriously complicate matters.
[Collected Works of Mahatma Gandhi, gandhiserve.org, vol.51, pp.454-460]
... ... ...
(రెంఢు ప్రత్యామ్నాయాల నుంచి ఎంచుకోవలసి వస్తే ఆగక పోవడమే మంచిథి - అని గాంధి అంగీకరించాడు. శిక్షను మార్చే మూడో ప్రత్యామ్నాయం ఇంకా మంచిది అని ఆయన సూచించాడు. కాని - సీరియస్‌గా కాదు. ఈ అంశాన్ని ఆయన పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. కల్లోలం లేవకుండా బయటపడగలిగితే మనం అదృష్టవంతులమే అని నేను ఆయనకి చెప్పాను. రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీలో జరపదలిచిన సభలను నివారించడానికి, ఉద్రేకపూరితమైన ప్రసంగాలను నిరోధించడానికి మీరు చేయగలిగినంతా చేయండి- అని నేను కోరాను. చేయగలిగింది తప్పక చేస్తానని ఆయన హామీ ఇచ్చాడు.
... ... ...
కరాచీ కాంగ్రెసు విషయంలో గాంధీ ధీమాగా ఉన్నాడు. కాని అతివాదుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావిస్తున్నానని, భగత్‌సింగ్ ఉరి వల్ల పరిస్థితి చాలా సంక్లిష్టమవవచ్చని ఆయన చెప్పాడు.
ఇది మార్చి 19 సాయంత్రం గాంధీతో తన సంభాషణ గురించి హోం మెంబరు ఎమర్సన్ లండన్ దేవరలకు పంపిన నివేదిక.
‘కరాచీలో కాంగ్రెసు కొత్త అధ్యక్షుడు అడుగుబెట్టే రోజునే భగత్‌సింగ్‌ని ఉరి తీస్తారట కదా? దానివల్ల జనంలో గగ్గోలు పెడుతుందేమో’ - అని వైస్రాయ్‌తో అన్నవాడు...
‘కరాచీ కాంగ్రెసు తరవాత కంటే దాని ముందే ఉరి తీయించడం మంచిదని అన్నీ ఆలోచించే నిర్ణయించాము’ అని ఇర్విన్ అంటే నోరు మెదపనివాడు...
వైస్రాయ్‌ని కలిసి బయటికి వచ్చిన వెంటనే హోం మెంబరుతో వేసిన మూడు గంటల భేటీలో ‘ముందా? తరవాతా?’ అని అడిగితే కరాచీ కాంగ్రెసు కంటే ముందే భగత్‌సింగ్‌ను ఉరి తీయడం మంచిదని సలహా ఇచ్చినవాడు...
‘శిక్ష మార్చే మూడో ప్రత్యామ్నాయం ఇంకా మేలు కాదూ’ అని సీరియస్‌గా కాకుండా సరదాగా మేలమాడినవాడు...
‘్భగత్‌సింగ్ ఉరి వల్ల కరాచీ కాంగ్రెసులో పరిస్థితి సంక్లిష్టమవుతుంది; అయినా ఫరవాలేదు’ అని భరోసా ఇచ్చినవాడు...
భగత్ ఉరి మూలంగా కల్లోలం లేవకుండా చూసేందుకు సహకరించండి... ఢిల్లీలో నిరసన సభలు పెట్టకుండా, ఉద్రేకపూరిత ప్రసంగాలు చేయకుండా చూడండి - అని ఇంగ్లిషు దొర అడిగితే ‘చేయగలిగిందంతా తప్పక చేస్తాన’ని మాట ఇచ్చిన మహాత్ముడు...
భగత్‌సింగ్ ఉరిని ఆపడానికి శాయశక్తులా కష్టపడ్డాడు; చివరి క్షణం దాకా వైస్రాయ్ మీద ఒత్తిడి పెట్టాడు; ప్రభుత్వం సానుకూల నిర్ణయం తప్పకుండా తీసుకుంటుందని గంపెడాశ పెట్టుకున్నాడు; ఉరిని ఆపుతున్నట్టే నమ్మకం కలిగించి, తీరా వైస్రాయ్ మోసం చేస్తే తెగ బాధపడ్డాడు - అని గాంధీ భక్తులు చెప్పే కాకమ్మ కబుర్లను ఎంత అమాయకుడైనా నమ్మగలడా?
భగత్‌సింగ్ ఉరి కారణంగా దేశం అల్లకల్లోలం కాకుండా చూడటానికి, ఆవేశపూరిత సభలు, ప్రసంగాలు జరగకుండా చూడటానికి తెల్లదొరలకు చేయగలిగినంత ఊడిగం చేస్తానని మహాత్ముడు మాట ఇచ్చాడు కదా? అవతలి వాళ్లు ఊరుకుంటారా? మర్నాడే ఈయనకు ఒక డ్యూటీ వేశారు.
భారత ప్రభుత్వం
హోం డిపార్టుమెంటు, న్యూఢిల్లీ, మార్చి 20, 1931
డియర్ మిస్టర్ గాంధి,
... ... ...
భగత్‌సింగ్ తదితరుల ఉరిని పురస్కరించుకుని ఆవేశాలు రెచ్చిపోయే ప్రమాదం గురించి నిన్న రాత్రి మనం మాట్లాడుకున్నాము. ఈ రాత్రి 7.30కి సుభాష్ చంద్రబోస్ నగరంలో నిరసన సభ నుద్దేశించి ప్రసంగించనున్నాడని చీఫ్ కమిషనర్ నాకు తెలియపరిచాడు. ఈ విషయంలో మీకున్న ఇబ్బందులు నాకు బాగా తెలుసు... ... ఈ రాత్రి సభ జరిగి, అందులో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్టయితే భావోద్వేగాలు ఇంకా పెరుగుతాయి. దీన్ని నివారించడానికి, తీవ్ర పర్యవసానాలకు దారితీసే పరిస్థితులను అదుపు చేయడానికి మీరు ఎలాంటి సహాయం చేసినా ప్రభుత్వం చాలా సంతోషిస్తుంది.
ఇట్లు
హెచ్.డబ్ల్యు.ఎమర్సన్
దీనికి మహాత్ముల వారి ప్రశస్తమైన జవాబును కూడా చిత్తగించండి:
1, Darya ganj, Delhi
March 20, 1931
Dear Mr.Emerson
I thank you for your letter just received. I knew about the meeting you refer to. I have already taken every precaution possible and hope that nothing untoward will happen. I suggest there should be no display of police force and no interference at the meeting. Irritation is undoubtedly there. It would be better to allow it to find vent through meetings, etc.
Yours Sincerely

[NAI File No.4/21/1931, Home Department Political]
(Quoted by A.G.Noorani in "The Trial of Bhagat Singh", pp.242-43]

(ఫ్రియమైన ఎమఠ్సన్,
మీ ఉత్తరం ఇప్పుడే అంథింది. ధన్యవాదాలు. మీరు ప్రస్తావించిన సభ సంగతి నాకు తెలుసు. సాధ్యమైన జాగ్రత్తలన్నీ నేను ఇప్పటికే తీసుకున్నాను. అవాంఛనీయ ఘటన ఏదీ జరగబోదని ఆశిస్తున్నాను. పోలీసు బలగాలను ప్రదర్శించకుండా, సభలో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని నా సూచన. చికాకు తప్పక ఉంటుంది. సభల ద్వారా దానిని బయటపడనివ్వటమే మంచిది.)
చూశారా? జాతీయ వీరుడు భగత్‌సింగ్ ఉరిశిక్షను నిరసిస్తూ జాతీయ నాయకుడు సుభాష్ చంద్రబోస్ ఢిల్లీలో బహిరంగసభలో మాట్లాడనుండగా, దానివల్ల ఉద్రిక్తత రగిలి ఎక్కడ కొంపలంటుకుంటాయోనని ప్రజాకంటక విదేశీ ప్రభువులు లబలబలాడి, తన సహాయం కోరితే-
‘ఆ సంగతి నాకు చెప్పాలా? తీసుకోవలసిన జాగ్రత్తలు నేను ఇప్పటికే తీసుకున్నాలే! అక్కడ ఏమీ కాదు. కాని మీరుమాత్రం పోలీసు బలగాల్ని మరీ హడావుడి చేయనివ్వకండి. సభలో జోక్యం చేసుకోకుండా చూడండి. ఆగ్రహాన్ని సభల ద్వారా వెలగక్కనివ్వడమే మంచిది.’
- అని సోకాల్డ్ ‘జాతిపిత’గారు ప్రజాగ్రహాన్ని ఎలా తట్టుకోవాలో, నిరసన సభలో పోలీసులు ఎలా ఉండాలో, ఏమి చేయకూడదో, ఉద్రిక్త పరిస్థితిని ఎలా మేనేజ్ చేయాలో చక్కగా ఉపదేశించారు.
ఈ సిగ్గుచేటు ఉత్తరం అందరి కంటపడితే బాగుండదనుకున్నారేమో - స్వతంత్ర భారత సర్కారువారు సంకలించిన గాంధీ రచనల 51వ సంపుటిలో ఎమర్సన్ జాబును మాత్రం ఉంచి, దానికి గాంధీగారి జవాబును తీసేశారు!
సాధ్యమైన జాగ్రత్తలన్నీ ఎమర్సన్ లేఖ అందేసరికే తాను తీసుకున్నానన్న మహాత్ముడి మాట నిజమే. అదే రోజు (మార్చి 21)న అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియా వార్తాసంస్థ కరాచీ నుంచి ఇలా రిపోర్టు చేసింది.

"In view of Sardar Bhagat Singh's execution, which is expected to take place shortly, Mahatma Gandhi has wired to the Karachi Congress officials this morning, asking them to cancel all processions and demonstrations arranged during the congress week'
[Noorani, p.244]

(సర్దార్ భగత్‌సింగ్ ఉరి మరి కొథ్ది రోజుల్లో జరుగుతుందనుకుంటున్నందున కాంగ్రెస్ సప్తాహంలో ఏర్పాటైన సభలను, ప్రదర్శనలను అన్నింటినీ రద్దు చేయవలసిందని మహాత్మాగాంధీ కరాచీ కాంగ్రెసు పదాధికారులకు ఈ ఉదయం టెలిగ్రాం ఇచ్చారు.)
ఈ ప్రకారంగా - జాతీయ వీరుల ఉరిని ఎలా ఆపిద్దామా అని ఆరాటపడకపోగా... ఉరి ఆపే ప్రసక్తే లేదు; వాయిదా ముచ్చట లేదు అని వైస్రాయ్ ఒకటికి రెండుసార్లు తెగేసి చెప్పినా కిమ్మనకపోగా ‘అలాగే కానివ్వండి’ అని సమ్మతించి... ఉరితీత మూలంగా దేశం అల్లకల్లోలమై బ్రిటిషు ప్రభువులకు ఇబ్బంది కలగకుండా, పక్కా బ్రిటిషు ఏజంటులా వ్యవహరించి, నిరసన సభలను, ఊరేగింపులను రద్దు చేయించి... ఉద్రిక్త పరిస్థితిని ఎలా మేనేజ్ చేయాలో తెల్లదొరలకు ఉపాయం చెప్పి బ్రిటిషు సేవలో తరించిన మహాత్ముడు - లాలూచీ ప్రకారం చెయ్యాల్సిందంతా చేశాక-
ఉరిశిక్షలను ఆపండి అంటూ వైస్రాయ్‌కి ఉత్తరం పంపాడు.
అదీ ఎప్పుడు?
1931 మార్చి 23న. ఆ సాయంత్రమే ఉరితీత జరుగుతుందనగా దానికి కొన్ని గంటల ముందు.
1, దర్యాగంజ్, ఢిల్లీ
మార్చి 23, 1931
ప్రియ మిత్రుడా,
ఈ ఉత్తరాన్ని మీ మీద వేయడం క్రూరమే. కాని శాంతి కోసం ఆఖరు అపీలు చేయక తప్పదు. భగత్‌సింగ్, మరి ఇద్దరి మరణశిక్షను మార్చే ఆశ లేదని అయినా శనివారం నేను చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తానని మీరు చెప్పారు... పునః పరిశీలనకు ఏ మాత్రం అవకాశం ఉన్నా, ఈ కింది విషయాలు మీ దృష్టికి తెస్తున్నాను.
మంచో, చెడో - ప్రజలు శిక్షను మార్చాలని కోరుతున్నారు. ప్రిన్సిపుల్ ఏదీ ఇమిడిలేనప్పుడు, ప్రజాభిప్రాయాన్ని గౌరవించటం విధి. ప్రస్తుత సందర్భంలో శిక్షను తగ్గించే పక్షంలో దేశంలో శాంతి పెంపొందే అవకాశం ఉంది. ఉరితీత వల్ల శాంతికి నిస్సందేహంగా ప్రమాదం.
వారి ప్రాణాలను కాపాడేటట్లయితే తమ కార్యకలాపాలను నిలుపు చేస్తామని విప్లవ పార్టీ నాకు హామీ ఇచ్చింది. దీన్ని గమనించి విప్లవ హత్యలు ఆగిపోయేందుకు అనువుగా ఉరిశిక్షలను సస్పెండు చేయటం ప్రభుత్వ ధర్మం. రాజకీయ హత్యలను క్షమించిన సందర్భాలు ఇంతకు ముందూ ఉన్నాయి. ఇంకా చాలా ప్రాణాలు బలి కాకుండా కాపాడటానికి, బహుశా విప్లవ నేరాలను తుడిచిపెట్టటానికి ఉపకరిస్తాయనుకుంటే వీరి ప్రాణాలను రక్షించటం మంచిది...
... ఉరితీత మళ్లీ వెనక్కి తీసుకోలేని చర్య. పొరపాటుకు ఏ మాత్రం ఆస్కారం ఉందని మీరు అనుకున్నా, పునః సమీక్ష దాకా ఈ శిక్షలను
సస్పెండు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అవసరమైతే నేన మీ దగ్గరికి రాగలను. ఈ రోజున (వౌన దినం కాబట్టి) మాట్లాడలేక పోయినా వినగలను. నేను చెప్పదలిచింది రాసి చూపించగలను.
ధర్మం ఎప్పుడూ వ్యర్థం కాదు.
ఇట్లు
మీ నిజమైన స్నేహితుడు
[CWMG, gandhiserve.org, vol.51, pp.290-291]

వైస్రాయ్ ఇర్విన్ ఆలస్యం ఛెయ్యలేథు. ‘ఇంతకు ముందు మీకు నేరుగా వివరించిన కారణాల వల్ల, మీ కోరికను మన్నించటం కుదరదు’ అని వెంటనే దీనికి జవాబు ఇచ్చాడు. ఆ సాయంత్రమే ముగ్గురు వీరులను లాహోర్‌లో ఉరి తీశారు.
గాంధీగారు రాసిన ఈ ఉత్తరాన్ని భగత్‌సింగ్‌ని కాపాడటానికి కడదాకా ఆయన చేసిన కృషికి తిరుగులేని రుజువుగా చూపిస్తారు ఆయన వీరాభిమానులు. ఔను సుమీ! వాళ్లను ఎలాగైనా కాపాడాలన్న ఆరాటం ఆయనకు లేకపోతే, ఉరి తీయడానికి కొన్ని గంటల ముందు కూడా వైస్రాయ్‌కి అంత చక్కని విన్నపం ఎందుకు చేస్తాడు? మదించిన తెల్లదొరతనం తన మాట వినకపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడు... అని ఈ ఇచ్చకాలకు కొంతమంది మోసపోతారు. భగత్‌సింగ్‌ను కాపాడాలన్న ఆసక్తిని వైస్రాయ్ ముందు అప్పటిదాకా ఏ మాత్రం కనపరచనివాడు, కరాచీ కాంగ్రెసుకు ముందే ఉరి తీసెయ్యమని సలహా ఇచ్చినవాడు; ఆఖరి క్షణంలో వైఖరి మార్చి ఈ ఉత్తరం ఎందుకు రాశాడబ్బా - అని గాంధీభక్తులు కాని వారు సైతం తికమక పడుతూంటారు.
నిజానికి ఇందులో ఆశ్చర్యానికి తావులేదు. వైరుధ్యం ఏమీ లేదు. భగత్‌సింగ్, మరి ఇద్దరి ప్రాణాలు కాపాడండంటూ చేసిన ఈ చివరి విన్నపం గాంధీ ఆడిన నాటకంలో పతాక సన్నివేశం. నాలుగు రోజుల కిందట (మార్చి 19న) వైస్రాయ్‌కీ ఆయనకూ కుదిరిన రహస్య అవగాహనలో భాగం.
మార్చి 19 మతలబు గురించి వైస్రాయ్ ఇర్విన్ పైవాళ్లకు పంపిన రిపోర్టులోగాని, ఏ ప్రభుత్వ రికార్డులోగాని లేదు. కాబట్టి మామూలుగా అయితే గాంధీగారి అతి రహస్యం లోకానికి తెలియకుండా శాశ్వతంగా సమాధి అయ్యేదే. కాని ఆయన కర్మంచాలక, ఇర్విన్ ఉన్నవాడు ఉన్నట్టు ఊరకుండకుండా పావు శతాబ్దం తరవాత (1957లో) ‘ఆత్మకథ’ రాశాడు. (అప్పటికి ఆయన Earl of Halifax గా పెద్ద బిరుదు పొందాడు) గతానుభవాలు నెమరువేసుకుంటూ 1931 మార్చి 19న గాంధీతో తన ఏకాంత చర్చలో ఏమి జరిగిందన్న గుట్టును బయటపెట్టాడు ఇలా:

‘ఆ పడుచువాడిని ఉరితీస్తే జాతి దృష్టిలో అమరవీరుడవుతాడని, దేశంలో వాతావరణం సంక్షుభితమవుతుందని మిస్టర్ గాంధి నాతో అన్నాడు... ఆ విషయంలో నేను ఏదో ఒకటి చేయకపోతే మా ఒప్పందం ధ్వంసం కావచ్చనీ ఆయన చెప్పాడు. ఆ విషయంలో ఆయనకున్నంత విచారం నాకూ ఉంది; కాని నా ముందు ఉన్నవి మూడే మార్గాలు; మొదటిది - ఏమీ చెయ్యకుండా ఉరితీతను నిర్ణీత ప్రకారం జరగనివ్వటం. రెండోది - ఆర్డరును మార్చి భగత్‌సింగ్‌కి ప్రాణభిక్ష పెట్టటం. మూడోది - కరాచీ కాంగ్రెసు ముగిసేదాకా నిర్ణయాన్ని వాయిదా వేయటం. అతడికి ప్రాణభిక్ష పెట్టటం నాకు అసాధ్యం. నిర్ణయాన్ని వాయిదా వేసి శిక్ష తగ్గింపేదో జరగబోతున్నదన్న అభిప్రాయం ప్రజల్లో రేకెత్తించడం రుజువర్తన కాదు... నిజాయతీ అనిపించుకోదు. కాబట్టి సమస్యలు ఎన్ని వచ్చినా మొదటి ప్రత్యామ్నాయమే అనుసరణీయం - అని నేను వివరించాను.Mr.Gandhi thought for a moment, and then said, 'would your Excellency see any objection to my saying that I pleaded for the young man's life?'
[Fullness of Days, Earl of Halifax, pp.149-50]
[Quoted by A.G.Noorani in "Trial of Bhagat Singh', p.246]

మిస్టఠ్ గాంథి ఒక క్షణం ఆలోచించి, నాతో అన్నాడు: ‘ఆ యువకుడి ప్రాణాన్ని కాపాడమని నేను వాదించినట్టు నేను చెప్పుకుంటే యువర్ ఎక్స్‌లెన్సీకి ఏమైనా అభ్యంతరమా?’
అదీ సంగతి! లోపల తెల్లదొరతో లాలూచీ! బయటికి వచ్చాకేమో తాను భగత్‌సింగ్‌ను కాపాడటానికి విశ్వ ప్రయత్నం చేసినట్టు బోలెడు బిల్డప్!
ఇదీ సత్య ప్రవక్తగారి సత్యవాక్కుల లోగుట్టు.
*

ఎం.వి.ఆర్.శాస్ర్తీ