S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విశ్వరహస్యం గుట్టు విప్పే గ్రావిటీ వేవ్స్

ఇటీవలి కాలంలో శాస్ర్తియ రంగంలో ఓ రెండు ముఖ్య సంఘటనలు జరిగాయి. వాటిలో ఒకటి హెగ్స్ బోసాన్ కణాన్ని కనుగొనటం. దీనినే ‘గాడ్ పార్టికల్’ అంటాము. కాని దీనికన్నా అత్యంత ముఖ్యమైన పరిణామంగా శాస్తజ్ఞ్రులు భావించే స్పేస్ టైమ్ వస్త్రం (Fabric of Space Time) గ్రావిటీ అలలను కనుగొన్నారు. ఇది మానవ చరిత్రలోనే ముఖ్యమైన చారిత్రాత్మక సంఘటన.
ఆ అలలను గ్రావిటేషన్ వేవ్స్ - గురుత్వాకర్షక అలలు అంటారు. ఇవి సుదూర విశ్వంలో జరిగిన ఓ ప్రళయాత్మక సంఘటనP CATACLYSMIC EVENT లో పుట్టి భూమిని చేరాయి. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 1915లో ఊహించిన జనరల్ థియరీ రెలెటివిటీ ప్రతిపాదనలో వీటి ప్రస్తావన ఉంది. వీటిని కనుగొనటంతో విశ్వరూపం మరింత స్పష్టంగా అధ్యయనం చేయడానికి అవకాశం దొరికింది.
గ్రావిటేషన్ అలలు వాటి జన్మ సమయపు ఇన్ఫర్మేషన్‌ని - వాటి డ్రమటిక్ జన్మ సమయ రహస్యాలను మోసుకుంటూ రోదసిలో ప్రవహిస్తుంటాయి. వీటి వలన గురుత్వాకర్షణ శక్తి స్వరూపాన్ని మరింత స్పష్టంగా అధ్యయనం చేసే అవకాశం వచ్చింది.
ప్రస్తుతం శాస్తజ్ఞ్రులు LIGO పరికరాలను వాడి కనుగొన్న అలలు ఎంతో దూరంలో ఏకమైన రెండు బ్లాక్ హోల్స్ కలయిక సమయంలో పుట్టినవి. కాని ఈ పెను సంఘటనలు ఇంతవరకూ ఎవరూ చూడలేదు.
గ్రావిటేషనల్ వేవ్స్ సెప్టెంబర్ 14, 2015 తేదీన అమెరికాలో వున్న రెండు లేజర్ ఇంటర్‌ఫెరామీటర్ గ్రావిటేషనల్ అబ్జర్వర్ (LIGO) -ఈ పరికరం ఉన్నది లూసియానా రాష్ట్రంలో. LIGO ఆటోమేటిక్ సిస్టమ్స్ ఓ సిగ్నల్‌ని గుర్తించింది. ఇతర సాంకేతిక విషయాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా విశే్లషణ జరిగింది.
LIGO పరిశోధకులు ఓ పేపర్‌ని ‘్ఫజికల్ రివ్యూ’ పత్రికలో ప్రచురించటానికి... దానితోపాటు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు.
ఆ డేటాని ఫిల్టర్ చేస్తే వచ్చిన సిగ్నల్ - ఎంతో సాధారణంగా కనిపించి
It was very obvious to the eye and ear
కంప్యూటర్ సహాయంతో పోలికలను విశే్లషించినప్పుడు తేలినది ఇది. ఆ అలలు వచ్చినది -రెండు Object నుంచి.
అవి సూర్యుడికి 29 రెట్లు, 36 రెట్లు పెద్దవి అయిన రెండు బ్లాక్ హోల్స్. అవి 210 కి.మీ.లలో ఒకదానినొకటి దూరంలో విరుగుతూ ఒకదానితో ఒకటి కలిసి Merging జరుగుతున్న సమయంలో జన్మింఛిన గ్రావిటీ వేవ్స్‌వి.
ఆ సంఘటన జరిగినది భూమికి 1.4 బిలియన్ కాంతి సంవత్సరాల దూరాన ఉన్న రెండు బ్లాక్ హోల్స్ మధ్య.
ఆ సంఘటన జరిగిన సమయంలో పుట్టిన గ్రావిటేషనల్ వేవ్స్ ప్రయాణం ప్రారంభమయింది 1.4 బిలియన్ సంవత్సరాల నాడు
అంటే 1.4,000,000,000 సంవత్సరాల నాడన్నమాట. మనం చూస్తున్నది ఓ భూతకాలపు సంఘటనని.
ఆనాటికి భూమి మీద జీవావిర్భావం జరగలేదు.
డైనోసార్ల రాజ్యమింకా రాలేదు. పశుపక్ష్యాదులలో ఏవీ ఇంకా పుట్టనే లేదు. మానవజాతి ఆవిర్భావం ఇంకా ఎంతో దూరంలో ఉన్నది. చరిత్ర అసలు లేనే లేదు.
ఇవన్నీ జరిగిన సమయంలో ఈ అలలు విశ్వంలో ప్రయాణిస్తున్నాయి. అన్ని దిశలలోనూ మహా విశ్వంలో ఈ అలలు ప్రయాణిస్తూ గడిపాయి.
చివరికి అవి భూమిని చేరినది సెప్టెంబర్ 2015 నాటికి. అవి ఎంతో ఇన్ఫర్మేషన్‌ని తమతో తీసుకువచ్చాయి. వాటిని ఆహ్వానించడానికి శాస్తజ్ఞ్రులూ, పరికరాలు సిద్ధంగా ఉన్నాయి. వాటి రాక గుర్తించిన సిగ్నల్స్‌ని చూసి శాస్తవ్రేత్తలు అవాక్కయ్యారు.
నూరు సంవత్సరాల నుండే వారు ఎదురుచూస్తున్న, ఊహిస్తున్న ఓ శాస్ర్తియమైన ఊహ నిజమయింది.
ఆ ఊహ పేరు గ్రావిటేషనల్ వేవ్స్. గురుత్వాకర్షక అలలు.
వీటిని మొదటిసారిగా ప్రతిపాదించిన వాడు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. అతడు తన జనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీలో వీటిని ప్రస్తావించారు. ఆ పేపర్ వచ్చినది 1905లో.
సరిగ్గా దాదాపు వందేళ్ల తర్వాత ఈ అలలు నిజంగానే ఉన్నాయనీ కేవలం ఓ సైంటిఫిక్ ఊహ మాత్రమే కాదని రుజువయింది.
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పేపర్లో ప్రతిపాదించిన గ్రావిటీ వేవ్స్ Space, Time లను గురించి విడమర్చి చెప్పే ప్రయత్నంలో ఐన్‌స్టీన్ వీటిని ఊహించారు.
గురుత్వాకర్షణ శక్తి విశ్వవ్యాప్తంగా ఉండే ఓ బలహీనమైన శక్తి దానిని మొదట కనుగొన్నది ఐజాక్ న్యూటన్. కాని న్యూటన్ శాస్తప్రు పరిధి ఓ ప్రత్యేక లిమిటెడ్ పరిస్థితులలో వీటికి ఔచిత్యం ఉంటుంది. విశ్వంలోని అన్ని తారలకూ, తారాపుంజాలకు, గాలక్సీలకీ, ఇతర విశ్వ పదార్థాలకీ వాటిని వర్తింపజేయటానికి ఐన్‌స్టీన్ ప్రయత్నం చేసి సఫలుడయ్యాడు.
కాని ముందుగా మనం Time Space అనేది ఎలా ఉంటుందో ఊహించక తప్పదు.
ఇది పరచుకున్న దుప్పటిలా, ఓ ట్రాంపోలైన్‌లో ఉంటుంది. దీని మీద ఏవైనా వస్తువులూ - గ్రహాలూ, తారలూ ఉంటే ఆ ప్రాంతంలో టైమ్, స్పేస్ వొంగి మడతలు పడుతుంది. ఉదాహరణకి పరుపు మీద పడుకున్న వ్యక్తి శరీరపు వొంపులు పరుపు మీద రకరకాల లోతులను సృష్టిస్తుంది. మళ్లీ తన పడకలో మార్పులు చేస్తే పరుపు శరీరానుగుణంగా మార్పులు చేసుకుంటుంది.
అలాగే టైమ్ స్పేస్ కాస్మిక్ వస్తువులూ, గ్రహాలూ, తారలూ, గాలక్సీలూ, ఇతర పదార్థాలూ ఉంటే దగ్గరలోని స్పేస్ టైమ్‌లో మార్పులు ఉంటాయి. ఆ స్పేస్ టైమ్ ఎత్తుపల్లాలలో గ్రహాలూ, నక్షత్రాలూ ఉంటాయి. వాటిని చుట్టుకుంటూ అనుగుణంగా మార్పు చెందుతూ గ్రావిటీ ఉంటుంది.
గ్రావిటీ అలలు - తారల మరణాల సమయాలలో (NOVA), బ్లాక్ హోల్స్ కలుస్తున్నప్పుడూ - ఇన్ఫర్మేషన్ లీక్‌తో పలు మార్పులు తెస్తాయి. ఇవి తెచ్చే అలలను RIPPLE ని - గ్రావిటీ వేవ్స్ అంటారు.
LIGO

లేసర్ ఇంటర్‌ఫెరామెట్రిక్.. గ్రావిటేషనల్ అబ్జర్వేటర్
ఈ అబ్జర్వేటరీలను స్థాపించటానికి మూలధనం సమకూర్చినది నేషనల్ సైన్స్ ఫౌండేషన్ NSF.
వీటిని వినియోగిస్తున్నది ముఖ్యంగా రెండు సంస్థలు.
కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NSF.
మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CALTECH)

గ్రావిటేషనల్ అలలు ఉంటాయని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ నూరేళ్లనాడు ప్రెడిక్ట్ చేసుకొని, వాటిని డిటెక్ట్ చేయాలంటే ఓ బృహత్తర ప్రణాళిక కావాలి. ఆ ప్రణాళికను అమలుపెట్టే నిబద్ధత, ఓర్పూ వున్న సాంకేతిక బృందం కావాలి. ధైర్య సాహసాలూ, ధన సంపత్తీ కావాలి.
* * *
LIGO రీసెర్చర్స్ -ఓ అల వచ్చి రోదసిని Space -102+-102+ ఒక భాగాన్ని 1021 మరో భాగాన్ని Stretchచేసిందని కనుగొన్నారు. అంటే మన భూమినంతటినీ Expand చేసి మళ్లీ కుంచించుకు పోవటం లాంటిది - అది జరిగినది అతి స్వల్ప ప్రమాణంలో 1/100,000 of Nanometer ప్రమాణంలో - అంటే ఓ ఆటమ్ తాలూకు న్యూక్లియస్ వెడల్పు అంత అన్నమాట. ఈ అబ్జర్వేషన్ ఐన్‌స్టీన్ థియరీ ఆఫ్ గ్రావిటీని Testచేసి -Prove చేస్తుంది. అతడి జనరల్ థియరీ ఆఫ్ రెలెటివిటీకి - Proof ఇస్తుంది. అనితర సాధ్యమైన లాజిక్‌తో బ్లాక్‌హోల్స్ అనేవి నిజంగా ఉన్నాయని రూఢిగా చెబుతుంది.
ఆ ఎరుక ఎంతో ముఖ్యమైనది.
It will win a Noble Prize అన్నాడు Mark Kamionsky. ఇతడు జాక్స్ హాప్కిన్, యూనివర్సిటీ - బాల్టిమోర్ మేరీలాండ్‌లో వున్న థియరిటికల్ సైంటిస్ట్.
LIGO స్పేస్ పెరుగుదల జరిగేది అతి స్వల్ప ప్రయాణంలో - Miniscoop దానికి కావాలని పరికరాలు, పరిసరాలు - దానిని కొలవటానికి కావలసినది శ్రీఆ్ఘ Ultra Precise Rulers.

వీటిని రెండు L-Shaped పరికరాలు Interfero Meter వీటి చేతులు (Arms)నాలుగు కిలోమీటర్ల పొడవు ఉంటాయి. ఈ చేతుల చివర అద్దాలుంటాయి. వీటి చుట్టూ Resonant Cavity ఉంటుంది. దీనిలో లేసర్ లైట్ ముందుకూ, వెనకటా బౌన్స్ అవుతూ ఉంటుంది. శబ్దపు అలలు ఓ ఆర్గన్ ప్రెస్‌లో Resonate అవుతున్నట్లుగా.
ఈ రెండు చేతులు కలిసిన చోట రెండు లేసర్ కిరణాలూ ఒక దాని మీద ఒకటి overlap అవుతాయి. అవి వివిధ దిశలలో ప్రయాణించి - చేతులతో ఆ అలలు ఒకదానితో ఒకటి Out of Step గా ఉండి అడ్డగించుకుంటాయి.
అలా జరిగినప్పుడు కొంత లైట్ Dark Port లోకి నిష్క్రమిస్తుంది. అది జరిగేది అలలలో Synchronise అవుతూ అలల Undulation తో.
ఈ Interference జరిగాక రీసెర్చర్స్ రెండు భుజాల వేర్ లెంగ్త్‌ని 1/10,000 -ఇది ఓ ప్రోటాన్ వెడల్పు అంత అన్నమాట - కొలుస్తారు. ఈ కొలతలలో పోతున్న గ్రావిటీ వేవ్స్ - అవి రెండు భుజాలను వివిధంగా Different Amountsలో Stretch À చేస్తుంది.
The LIGO discoveries have launched a new era in Astronomy.

ఇది ఓ కొత్త Field of Astrophysics.

ఈ అనుభవం విశ్వదర్శనానికి ఓ నూతన ద్వారాన్ని తెరిచింది.
మరో విధంగా కూడా చెప్పవచ్చు. చరిత్రలో ఇన్నాళ్లూ వాడిన టెలిస్కోప్‌తో అబ్జర్వేటర్‌లో విశ్వాన్ని చూస్తూ తమ పరిశోధనలు సాగించాయి. కాని మొదటిసారిగా తమ చెవులతో పరిశోధనలు చేసే ఉ్ఘ ప్రారంభమయింది.
Normal Matter alone cannot explain Space-Time observations suggest that 5% of the Universe is familiar Atomic Matter, consisting of stars, Galaxies Universes etc., while 25% years is Dark matter and about 70% is Dark energy. Dark matter does not emit or absorb light betraying its existence.
Only through Gravitational effects. Dark energy is a mysterious force that is assimilated with empty space and is thought tobe responsible for the acceleration expansion of the Universe.
.
ఈ మహా విశ్వాన్ని అర్థం చేసుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కళ్లే కాదు, చెవులు కూడా ఈ విశ్వదర్శనంలో, రహస్యానే్వషణలో పాలుపంచుకోబోతున్నాయి. ఇది ముఖ్యమైన మలుపు అన్ని అబ్జర్వేటరీలలో ఇన్నాళ్లుగా కాంతిని ఆధారంగా చేసుకుని, ఇతర పార్టికిల్స్ స్వభావాలని వాడుతూ పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

అంతరిక్షం నుంచి కొన్ని సంకేతాలు భూమికి చేరాయన్న వార్త ఈ మధ్య సంచలనం రేపింది. శాస్తవ్రేత్తలకు సరికొత్త స్ఫూర్తిని, సవాలును, సాధారణ పౌరులకు అమితాసక్తిని కలిగించింది ఈ సంఘటన. అనంత విశ్వంలో కోట్లాది సంవత్సరాల క్రితం రెండు కృష్ణబిలాలు కలసిపోతున్నప్పుడు ఉద్భవించిన గురుత్వాకర్షక తరంగాలు కోట్లాది సంవత్సరాల తరువాత భూమికి చేరడం ఇందులో విశేషం. ఇలా జరుగుతుందన్నది ఐన్‌స్టీన్ శతాబ్దం క్రితమే సిద్ధాంతీకరించగా ఇప్పుడు అది నిజమైందన్నమాట. మనం సినిమాల్లో చూస్తున్న ‘టైమ్‌మిషన్’, భూతకాలంలో ప్రయాణంలాంటి అనుభవాలు నిజం చేసే దిశలో పరిశోధనలకు తాజా సంఘటనలు ఊతమిస్తాయని భావిస్తున్నారు. మానవ పరిణామంలో ఈ సంఘటనలు మేలుమలుపు తిప్పుతాయని భావిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలపై అవగాహనకోసమే ఈ కథనం...

రెండు పందాలు
(Two Bets)

స్టీ ఫెన్ హాకింగ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్. తను నలభై ఏళ్లనాడు గ్రావిటీ వేవ్స్‌ని ఊహించానన్నాడు.
ఇతడు గ్రేటెస్ట్ లివింగ్ సైంటిస్ట్ ఇన్ ది వరల్డ్.
శారీరకంగా ఆరోగ్యంగా లేకపోయినా తన కంప్యూటర్ సహాయంతో, ఆలోచిస్తూ మాట్లాడుతూ పుస్తకాలు రాస్తూ ఎంతో కృషి చేస్తున్నాడు.
అతడు ప్రస్తుతం LIGOపరిశోధనల ఫలితాలు ప్రపంచానికి తెలిశాక ఆ శాస్తజ్ఞ్రుల బృందాన్ని అభినందించాడు.
‘గ్రావిటేషనల్ వేవ్స్ విశ్వాన్ని చూడటానికి ఓ కొత్త పద్ధతిని చూపించి, ఈ ability తో వీటిని కనుగొనటంతో ఎస్ట్రానమీలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. బ్లాక్‌హోల్ బైనరీ సిస్టమ్‌ని కనుగొనటంతో మొదటిసారిగా బ్లాక్‌హోల్స్ శక్తిని అబ్జర్వ్ చేయటం సాధ్యమయింది.’
-స్టీఫెన్ హాకింగ్

1997లో కిప్ ధార్న్, స్టీఫెన్ హాకింగ్ ఒకవేపు సైంటిస్ట్ జాన్ ప్రెస్కెల్ మరోవేపు ఓ పందెం వేశారు. దానిలోని ముఖ్యాంశం ఇది.
Since the general relativity made it impossible for Black Holes to radiate and lose information - The mass, energy muse be "NEW' and must not originate from inside the Black Hole event horizon. Since this contradicts the idea under quantum mechanics of Micro causuality, Quantum mechanics need to be rewritten.'

ఈ ఐడియాకి వ్యతిఠేకంగా ప్రెస్కెల్ వాదించాడు.
2004లో స్టీఫెన్ హాకింగ్ తన బెట్ ఒప్పుకుని ప్రెస్కెల్‌కి
‘టోటల్ బేస్‌బాల్ - ది అల్టిమేట్ ఎన్‌సైక్లోపిడియా ఆఫ్ బేస్‌బాల్‌ని బహూకరించాడు.
దీనికి ముందు మరో బెట్ ఉంది. అది హాకింగ్‌కీ, కిప్ ధార్న్‌కీ మధ్య. దీనిని గురించి స్టీఫెన్ హాకింగ్ తన బెస్ట్ సెల్లర్ పుస్తకం
A Brief History of Time లో ప్రస్తావించాడు.
ఆ పందెం ఏమిటంటే-
నిజంగా బ్లాక్‌హోల్స్ అనేవి లేకపోతే హాకింగ్‌కి కిప్ ధార్న్ ఓ నాలుగేళ్ల చందా ప్రైవేట్ ఐ -Private Eye పత్రికకి ఇవ్వాలి.
ఒకవేళ కిప్ గెలిస్తే అతడికి హాకింగ్ Penthouseమేగజైన్‌కి చందా ఓ సంవత్సరానికి ఇవ్వాలి. ఈ బెట్ ఇంకా సెటిల్ కాలేదు. బహుశా ఇప్పుడు కిప్ ధార్న్ తన Penthouse పత్రిక చందా హాకింగ్ నుండి పొందుతాడేమో చూడాలి.

ఆ ముగ్గురూ...
ఈ పరిశోధనలో ముఖ్యంగా వాడినది లేసర్ ఇంటర్‌ఫెరామెట్రిక్ గ్రావిటేషనల్ అబ్జర్వేటరీలోని పరికరాలను. ఈ అబ్జర్వేటరీని స్థాపించటంలో, దానిని నడపటంలోనూ ముఖ్య పాత్రని పోషించినది ముఖ్యంగా ముగ్గురు శాస్తవ్రేత్తలు.
1.రాయినర్ వెయిస్ Rainer Weiss
(29.9.1932)
ఇతడు ప్రొఫెసర్ ఎమెంటస్ మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT). ఇతడు కనిపెట్టిన లేసర్ ఇంటర్‌ఫెరా మెట్రిక్ టెక్నిక్ LIGOపరికరాలలోని ముఖ్యమైన సాంకేతికాంశం. అతడు కాస్మిక్ బాక్‌గ్రౌండ్ రేడియేషన్, ఇంటర్‌ఫెరామెట్రిక్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేషన్ల విభాగాలలో కృషి చేశాడు. అతడికి ఫిజిక్స్ రంగంలో ప్రపంచంలోని అన్ని ముఖ్యమైన ప్రైజులూ వచ్చాయి.
1.గ్రూబర్ ప్రైజ్ 2.ఐన్‌స్టీన్ ప్రైజ్
ఇతడి విద్యార్థులు ఎందరో డాక్టరేట్లు పొంది రీసెర్చ్ చేస్తున్నారు.
2.రొనాల్డ్ డ్రెవెర్ (Ronald Drever) (1931)
ఇతడు ఓ స్కాటిష్ ఎక్స్‌పెరిమెంటల్ ఫిజిసిస్ట్. కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎమెరిటస్ ప్రొఫెసర్‌గా పని చేశాడు. ఇతడు LIGO నిర్మాణంలో గ్రావిటేషనల్ వేవ్ ప్రాజెక్ట్‌లో ముఖ్య పాత్రని పోషించాడు. అనారోగ్య కారణాల వల్ల ప్రస్తుతం స్కాట్లండ్ (తన దేశం)లో ఉంటున్నాడు.
3.కిప్ ధార్న్
(Kip Thorne) 4.6.1940
ఇతడు థియొరిటికల్ ఫిజిసిస్ట్. ప్రముఖ సైంటిస్ట్ జాన్ వీలర్ వద్ద శిష్యరికం చేశాడు. ప్రస్తుతం కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CALTECH) లో పని చేస్తున్నాడు. ఇతడు ఎన్నో అంతర్జాతీయ సంస్థలలో సభ్యుడు. ఎన్నో ముఖ్యమైన అవార్డులు పొందాడు.
ఇటీవల వచ్చిన క్రిస్ట్ఫర్ నొలన్ సినిమా Interstellar కు తన సాంకేతిక సహకారమూ, సలహాలూ ఇచ్చి ఆ సినిమాలో మనం చూసిన Wormhole ప్రయాణాలు ఎలా ఉంటాయో చూపి ఆ సినిమా ఎంతో Authentic గా ఉండేలా చేశాడు.
ఈ ముగ్గురికి రానున్న అక్టోబర్ రెండవ వారంలో ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతులు వస్తాయని అందరి నమ్మకం.

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

14.3.1879 జర్మనీ - జననం
18.4.1955 ప్రిన్స్‌టన్ న్యూజెర్సీ యు.ఎస్. - మరణం
ప్రపంచ సాంకేతిక చరిత్రలో అత్యంత ప్రతిభావంతుడైన సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 1915వ సం.లో తన జనరల్ థియరీ ఆఫ్ రెలెటెవిటీని ప్రకటించి దానిలో టైమ్, స్పేస్ (Time, Space)లక్షణాలని తిరగరాశాడు. అప్పటికి రెండు వందల సంవత్సరాలుగా అమలులో వున్న ఐజాక్ న్యూటన్ ఆలోచనలకి పదును పెట్టాడు. సాంకేతిక రంగంలో పెను ప్రకంపనలు పుట్టించాడు. న్యూటన్ ప్రతిపాదిత సూత్రాలను విప్లవాత్మకంగా మార్చివేసి విశ్వావగాహనకు వీలు కల్పించాడు.
ఐన్‌స్టీన్ వాదనలో Matter, Energy - ఈ రెంఢూ యూనివర్సల్ జామెట్రీని(Distort) వికృతీకరిస్తాయి అని ప్రతిపాదించాడు. దానికి ఉదాహరణ ఓ పరుపు మీద పడుకున్న వ్యక్తి పరుపు ఉపరితలం మీద తన శరీర భాగానికి అనుగుణంగా ఎత్తుపల్లాలను సృష్టిస్తాడు. ఈ ఎఫెక్ట్‌ని ఐన్‌స్టీన్ గ్రావిటీ (గురుత్వాకర్షణ శక్తి)గా వర్ణించాడు.
విశ్వంలో జరిగే పెను కదలికల వలన (Disturbances) Space, Time పొడుగ్గా పెరగవచ్చు, లేదా పొట్టిగా మారవచ్చు. గలగల (Jiggle) సృష్టింఛవచ్చు. పరుపు మీద నిద్రించే మనిషి దాని మీద చేసే రకరకాల విన్యాసాల వలన వచ్చే మార్పులలాగా ఇవి జరుగుతాయి. వీటినీ గ్రావిటీ వేవ్స్ అన్నాడు ఐన్‌స్టీన్.
కాని ఐన్‌స్టీన్ ఈ అలల మీద పూర్తిగా నమ్మకం లేదు. అతడు 1916లో భౌతిక శాస్తజ్ఞ్రుడు కార్ల్ ష్వార్జ్‌చైల్డ్ (ఇతడు బ్లాక్‌హోల్స్‌ని కనుగొన్న శాస్తవ్రేత్త)తో చర్చిస్తూ, గ్రావిటేషనల్ వేవ్స్ అనేవి ఉండవు అన్నాడు. తర్వాత బాగా ఆలోచించి తన అభిప్రాయాన్ని మార్చుకుని ఉంటాయి అని చెప్పాడు.
భౌతిక శాస్తవ్రేత్తల లెక్కల ప్రకారం గ్రావిటీ వేవ్స్ ఓ దిశగా స్పేస్‌ని పొడిగిస్తాయి. మరో దిశగా పొట్టిగా చేస్తాయి. వాటి ప్రయాణంలో ఇలా ప్రవర్తిస్తూ అవి కదులుతూ ఉంటాయి.
1905వ సం. మానవ సాంకేతిక చరిత్రలో ఓ Miracle Year
Annus Mirabilis అంటారు.
ఎన్నో అలౌకిక సంఘటనల అపూర్వ సంవత్సరం.
ఆ సంవత్సరంలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన అసమాన జీనియస్‌తో, తన సాంకేతిక వ్యాసాలలో అతి స్వల్ప విషయాల గురించీ, అతి పెద్ద విషయాల గురించీ - Microscopic, Macroscopic ప్రాథమిక అంశాలైన
Nature of Energy
Matter
Time
Space

వంటి అంశాల మీద అసమానమైన సైంటిఫిక్ పేపర్స్ రాశాడు.
మార్చి 1905లో ఐన్‌స్టీన్ ఓ నాలుగు పేపర్స్‌ని పబ్లిష్ చేశాడు.
ఆ నాలుగు పేపర్స్‌లో
1.్ఫటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీదా
2.బ్రౌనియన్ మోషన్
3.స్పెషల్ థియరీ ఆఫ్ రిలెటెవిటీ
4.Matter Energy కి వున్న సంబంధాన్ని సూచించే ఈక్వేషన్.
ఈ అపూర్వ రచనలలో ఐన్‌స్టీన్ ప్రపంచ సాంకేతిక రంగంలో అనితర సాధ్యమైన ప్రగతికి తోడ్పడ్డాడు.
తన నాలుగో పేపర్‌లో అతడు తన ఫేమస్ ఈక్వేషన్ ఇచ్చాడు.
E=Mc2
చిన్నచిన్న మాటర్ పార్టికల్స్‌లో అపారమైన శక్తిని పుట్టించే అవకాశం ఉన్నదని ఈ ఈక్వేషన్‌లో సూచించాడు. ఆ సూచనలోంచి వచ్చినవి ఆటమ్ బాంబ్స్, న్యూక్లియర్ రియాక్టర్, ఆటమిక్ శక్తి గురించి మానవాళికి తెలిసింది.
1926లో ఐన్‌స్టీన్‌కి నోబెల్ ప్రైజ్ ఇచ్చినప్పుడు అతడికి ఫొటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్‌కి ఆ అవార్డుని ఇచ్చారు. స్వీడిష్ అకాడెమీ సభ్యులకి రెలెటివిటీ సిద్ధాంతం పూర్తిగా అర్థమయినట్లుగా అది పూర్తిగా నిర్థారణ అయినట్లుగా పరిగణించలేదు. కాని తన నోబెల్ లెక్చర్‌లో ఐన్‌స్టీన్ రెలెటివిటీ గురించి మాట్లాడాడు.

కాంతి ఎన్నో రకాలుగా లభిస్తుంది. దానిని మనం
x-rays.. Gamma Rays.. Ultra Violet.. Infra Red.. Ordinary Light.. Radio Waves ల రూఫంలో వాడి పరికరాలను సృష్టించుకుని శాస్తజ్ఞ్రులు తమ పరిశోదనలను కొనసాగిస్తున్నారు.
బ్లాక్‌హోల్స్ - వీటికి అత్యంత శక్తివంతమైన గ్రావిటేషనల్ శక్తి ఉంటుంది. ఆ శక్తి కౌగిలి నుండి కాంతి కూడా తప్పించుకోలేదు. అందువలన వీటి ఉనికిని కనుగొనటం దాదాపు అసాధ్యం.
మొట్టమొదటిసారిగా LIGO పరిశోధనల వలన రెండు బ్లాక్‌హోల్స్‌ని, వాటి ప్రవర్తననీ మనం తెలుసుకునే అవకాశం దొరికింది.
కాని LIGO వాడకంలో కొన్ని పరిధులున్నాయని ఈ బృంద శాస్తజ్ఞ్రుల నమ్మకం. సూర్యుడి కంటే పది రెట్లు నుండి 100 రెట్లు Mass ఉన్న బ్లాక్‌హోల్స్‌కి మాత్రమే ఈ పద్ధతి పని చేస్తుంది.
దానికి కారణం ఆ బ్లాక్‌హోల్స్ చుట్టూ ఏ పదార్థమూ ఉండదు. బ్లాక్‌హోల్స్ ఒకదాని చుట్టూ ఒకటి ప్రదక్షిణ చేస్తూMerge అయ్యే సమయంలో ఫుట్టే గ్రావిటేషనల్ వేవ్స్ LIGO సహాయంతో కనిపెట్టవచ్చు.
గ్రావిటేషనల్ వేవ్స్ సహాయంతో ఇంకా ఎన్నో విశ్వ రహస్యాలను కనుగొనే అవకాశం ఉన్నదని శాస్తజ్ఞ్రుల నమ్మకం.
LIGO ఇతర అబ్జర్వేటరీలు ఏదీ చూపలేని వాటిని చూడగలవు, వినగలవు.
ఇది Astro Physics లో ఓ ముఖ్యమైన మలుపుగా భావించవచ్చు.
LIGO మరణించే తారలను గుర్తుంచుకునే Novae.
న్యూట్రాన్ స్టార్స్ ఒకదానితో ఒకటి కలియటాన్ని కనిపెడుతుంది.
తారల మరణాలకి ముందు జరిగే ఎక్స్‌ప్లోజన్స్ (Explosions) అవి బ్లాక్‌హోల్స్‌గా మారక ముందు ఉండే పరిస్థితులను గుర్తిస్తుంది.
ముందు ముందు రోజులలో LIGO - కాంతి ఆధారిత టెలిస్కోప్‌లూ అబ్జర్వేటరీలూ, కంప్యూటర్లూ కలిసి పని చేసే సమయంలో - ఇవన్నీ కలిసి
చూచి (see), విని (hear)
ఈ రెండు రకాల పరికరాలను సమన్వయపరిస్తే వచ్చేది
Multi Messenger.. Astronomy
ధీని వాడకంతో ప్రపంచ సాంకేతిక చరిత్రలో ఓ మహోన్నత అధ్యాయం ప్రారంభమవుతుంది.
LIGO పనిచేసే విధానం
లేసర్ ఇంటర్‌ఫెరామీటర్ గ్రావిటేషనల్ అబ్జర్వేటరీ (LIGO) స్పేస్ - టైమ్‌లో వచ్చే Disturbances్ఘశషళఒ కోసం వెదికి, ఆ సమయంలో Time Space లో వచ్చే కొలతల మార్పులను కొలిచి పని చేస్తుంది.
A,B= LIght Storage arms.
ఇవి నాలుగు కిలోమీటర్ల ఫొడవు ఉంటాయి.
లేసర్ నుండి వచ్చిన బీమ్ 4 కిలోమీటర్ల దూరం ప్రయాణం రెండు భుజాల (A,B)లోనూ చేస్తాయి. వాటిని మిర్రర్స్ రిఫ్లెక్ట్ చేసిన వెంటనే తిరిగి వచ్చి Crux of the Arm వద్ద కలిసి ఒకదానిని ఒకటి కాన్సిల్ చేసుకుంటాయి. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది.
గ్రావిటేషనల్ వేవ్ వచ్చినప్పుడు ఈ Arms కొలతలలో మార్పులు వస్తాయి. అప్పుడు లేసర్ బీమ్స్ ప్రయాంలో మార్పులు వస్తాయి. ఈ Mismatcitని కొలిస్తే - దానిని లైట్ డిటెక్టర్ సహాయంతో కొలవటం సాధ్యం.
LIGO అబ్జర్వేటర్‌లు అమెరికాలో రెండు చోట్ల ఉన్నాయి.
అవి లివింగ్‌స్టన్ - లూయిసియానా
హాన్‌ఫర్డ్ - వాషింగ్టన్‌లోను
లొకేట్ అయి ఉన్నాయి. వాటి నుండి వచ్చిన డాటాని Triangulation ఫద్ధతిలో విశే్లషించి Waveని కనుగొంటారు.
ఇదంతా ఎంతో సెన్సిటివ్ కొలతలకు సంబంధించిన వ్యవహారం.
మనం కొలవబోతున్న పొడవు ఓ ప్రొటాన్ వెడల్పులో సగ భాగం ఉంటుంది.
అంటే 1/10,000 పదివేల వంతు అన్న మాట
అబ్జర్వేటరీలో అల్ట్రాహె వాక్యూమ్, ట్యూబ్‌లు ఇంకా ఎన్నో సెన్సిటివ్ పరికరాలు పని చేస్తుంటాయి.
1990లో LIGO ప్రాజెక్ట్‌కి నేషనల్ సైన్స్ ఫౌండేషన్ 250 మిలియన్ డాలర్ల గ్రాంట్ ఇచ్చింది.
తర్వాతి కాలంలో - జర్మనీలో GEO.. ఇటలీలో VIRGO.. ఇండియాలో INDIGO

ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములయ్యాయి.
2002-2010 మొదటి టెస్ట్ చేయడం ప్రారంభమయింది.
2010-2015 మరో 205 మిలియన్ డాలర్ల గ్రాంట్; డ ఇచ్చింది. దీనితో పరికరాలను అప్‌డేట్ చేశారు.
ఈ ప్రాజెక్ట్ CALTECH, MIT యూనివర్సిటీల ఫిజిసిస్ట్ ఆధ్వర్యంలో జరుగుతోంది.
2015 సెప్టెంబర్‌లో ఫలితాలు వచ్చాయి.
2016- 11 ఫిబ్రవరి నాడు NSF, LIGO సైంటిస్టులు విజయవంతంగా గ్రావిటీ వేవ్స్‌ని కనుగొన్నామని ప్రకటించారు. *

కె.సదాశివరావు