S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

టీమ్ లీడర్

సంస్థల్లో పని చేయడం వేరు. ఏదో ఒక ఆఫీసులో పని చేయడం వేరు. సంస్థల్లో పని చేసినప్పుడు ఉద్యోగిగా పని చేయడం వేరు. ఆ సంస్థకి ‘హెడ్’గా పని చేయడం వేరు. ప్రధానమైన వ్యక్తిగా పని చేస్తున్నప్పుడు చాలా బాధ్యతాయుతంగా పని చేయాల్సి ఉంటుంది. తన కొలీగ్స్‌ని తన కింద పని చేస్తున్న ఉద్యోగులని కలుపుకొని పని చేయాల్సి ఉంటుంది. అట్లా చేయనప్పుడు సరైన ఫలితాలు రావు. అన్నీ తన వల్లే జరుగుతున్నాయన్న భ్రమలో ఉంటే ఆ వ్యక్తి ఆ సంస్థకి నాయకుడిగా పని చేయలేడు. తనే ‘స్టార్’ని అనుకోకుండా టీమ్ నాయకుడిని అని అనుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. చాలా మంది ఈ విషయాన్ని విస్మరించి తన వల్లే సంస్థ పురోగతి చెందుతుందని భావిస్తూ ఉంటారు.
ఈ మధ్య ఓ ఇద్దరు వ్యక్తులు పరిచయం అయ్యారు. ఇద్దరూ స్నేహితులే. కలిసి చదువుకున్నారు. ఇద్దరూ ఒకే కంపెనీలోనే పని చేస్తున్నారు. ఇద్దరిలో మొదటి వ్యక్తి చాలా తెలివి గలవాడు. ప్రతిసారీ అతనికే ఎక్కువ మార్కులు వచ్చేవి. బి.టెక్‌లో కూడా అతనికే ఎక్కువ మార్కులు వచ్చాయి. రెండవ వ్యక్తి బాగానే చదివేవాడు. మంచి మార్కులే వచ్చేవి. కానీ అతనికి కాలేజీలో ఎప్పుడూ మొదటి స్థానం రాలేదు. కానీ నేర్చుకోవాలన్న జిజ్ఞాస ఉండేది.
మొదటి వ్యక్తి తన తెలివితేటలని చూసి తన మార్కులని చూసి అతనిలో అతనికే తెలియని గర్వం ఏర్పడింది. అందరికన్నా తానే గొప్పవాడినన్న అభిప్రాయం అతనిలో బాగా బలపడింది. అతని మార్కులు చూసి అతన్ని ఆ కంపెనీలో టీమ్ లీడర్‌గా ఎంపిక చేశారు. ఆ టీమ్ బాగా పని చేసినప్పుడు, తన వల్లే అదంతా జరిగిందని చెప్పుకునేవాడు. అతని టీమ్‌లోని మిగతా వ్యక్తులని గుర్తించడం తగ్గించాడు. అతని టీమ్‌లోని ఇతర సభ్యులు బాగా పని చేసినప్పుడు కూడా వాళ్లతో మంచిగా ఉండేవాడు కాదు. ప్రశంసాపూర్వకంగా మాట్లాడేవాడు కాదు. ఆ కంపెనీ యాజమాన్యం ఈ విషయాన్ని గమనించి అతణ్ని టీమ్ లీడర్ బాధ్యత నుంచి తొలగించి అతని మిత్రుడిని టీమ్ లీడర్‌గా నియమించింది.
ఆ వ్యక్తి టీమ్ లీడర్‌గా బాగా పనిచేశాడు. తన టీమ్‌లోని వ్యక్తులు బాగా పని చేసినప్పుడు వాళ్లతో ప్రశంసాపూర్వకంగా మాట్లాడేవాడు. తన టీమ్‌లో వున్న వ్యక్తుల దగ్గర వున్న మంచి విషయాలని నేర్చుకునేవాడు. తనకు తెలియని విషయాలు టీమ్‌లోని వ్యక్తులకి తెలిపినప్పుడు తెలుసుకునేవాడు. వాళ్ల ద్వారా ఆ కొత్త విషయాలు తెలుసుకున్నానని కూడా అందరితో చెప్పేవాడు. అందరినీ కలుపుకొని పని చేసేవాడు.
అతని నాయకత్వ లక్షణాలు ఆ కంపెనీ యాజమాన్యానికి బాగా నచ్చి అతనికి రెండు ప్రమోషన్లని ఇచ్చి ఆ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్‌ని చేసింది. మొదటి మిత్రుడు అదే స్థానంలో ఉండిపోయాడు.
కంపెనీలకి స్టార్ ప్లేయర్లు కాదు. టీమ్ ప్లేయర్లు కావాలి. కంపెనీలకే కాదు. ఎవరికైనా కావల్సింది టీమ్ ప్లేయర్లే. నేర్చుకుందామన్న జిజ్ఞాస ఉన్న వ్యక్తులే.

-జింబో 94404 83001