S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మాకు గృహయోగం ఉందా?

చిన్న రాజారావు (ఇంకొల్లు)
ప్రశ్న: మేం అద్దె ఇంట్లో నివసిస్తున్నాం. చాలాకాలంగా సొంత ఇంటి కోసం ప్రయత్నాలు చేసిచేసి విసుగు వస్తున్నది? అసలు మాకు గృహ యోగం ఉన్నదా లేదా?
జ: మీరు నివసిస్తున్న ఇంటికి ఉత్తర వాయవ్య వీధిపోటు వలన మీ సొంత ఇంటి కల నెరవేరడం లేదు. ముందుగా ఆ వీధిపోటు దోష నివారణ చేసుకోండి. మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది.
అమ్మాజీ (్భమడోలు)
ప్రశ్న: మా ఇంటికి ఈశాన్యం మూల త్రికోణాకారంలో పెరిగి ఉంటుంది. అలా ఉండవచ్చా? ఎందుకంటే మేం ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి పిల్లలతో సమస్యలు చాలా వస్తున్నాయి. పెద్ద సంతానం ఇంకా సెటిల్ కాలేదు. పరిష్కారం చూపగలరు.
జ: ఈశాన్య మూల అలా త్రికోణాకారంలో పెరగకూడదు. దీనివల్ల పిల్లలతో సమస్యలు వస్తాయి. ముందుగా పెరిగిన ఆ త్రికోణాన్ని వేరుచేస్తూ గోడను నిర్మించండి. దీనివల్ల ఆ త్రికోణాకారం వేరు చేయబడుతుంది. తద్వారా మీ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు.
హనుమత్ ప్రసాద్ (రాచపూడి)
ప్రశ్న: మా స్థలంలో నైరుతి మూలలో వ్యవసాయ పరంగా ఉపయోగించే ‘పొగాకు బ్యార్నీ’ ఉన్నది. అలా వుండవచ్చా? ఎందుకో ఈ బ్యార్నీని నిర్మించిన దగ్గర నుండి మాకు చాలా సమస్యలు వస్తున్నాయి?
జ: చాలామంది తమ అవసరాల కోసం ఇష్టం వచ్చినట్లుగా ఈ బ్యార్నీలని నిర్మిస్తున్నారు. దీనివల్ల తర్వాత చాలా కష్టాలను/ నష్టాలను ఎదుర్కొంటున్నారు. ముందుగా ఈ నైరుతిలో గల బ్యార్నీని తీసివేసి ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. మీకు వున్న సమస్యలు కూడా తొలగిపోతాయి.
బాషావలీ (పమిడిపాడు)
ప్రశ్న: మా దుకాణానికి ఎదురుగా అనగా ఉత్తర వాయవ్యంలో వీధి పోటు ఉన్నది. అలా వుండవచ్చా? అసలు మా వ్యాపారం సాగడం లేదు. నివారణ తెలుపగలరు.
జ: ఉత్తర వాయవ్యంలో వీధి పోటు వలన వ్యాపారంలో నష్టాలు వస్తాయి. అలాగే మీ వ్యాపారం అభివృద్ధిలోకి రాదు. కావున ఈ వీధిపోటుకు సంబంధించి, వీధిపోటు నివారణ యంత్రాన్ని ప్రతిష్ఠించుకొని మంచి ఫలితాలను పొందండి.
రామచంద్రారెడ్డి (ఇంకొల్లు)
ప్రశ్న: మా ఇంటిలో ప్రతిరోజూ ఏదో ఒక సమస్య వస్తున్నది. మేం ఈ ఇంటిని ఇటీవలే నిర్మించాం. మా ఇంటి గృహప్రవేశం నాడు కూడా మా నాన్నగారికి ఆరోగ్యపరమైన సమస్య రావడం, ఆయన ఆస్పత్రిపాలు కావడం జరిగింది. అప్పటి నుండి కూడా సమస్యలు మా వెన్నంటి వస్తున్నాయి.
జ: మీ ఇంటికి నైరుతి (పడమర) వీధిపోటు ఉన్నది. అందువల్లనే మీ ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తున్నది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా కలుగుతున్నాయి. కాబట్టి ఆ వీధిపోటు నివారణకు సంబంధించి ‘వీధిపోటు నివారణ’ యంత్రాన్ని ప్రతిష్ఠించుకొని శుభ ఫలితాలను పొందండి.
సుబ్బారెడ్డి (ఎమ్మిగనూరు)
ప్రశ్న: మా పిల్లల భవిష్యత్తు అర్థం కాకుండా వున్నది. ఇద్దరు పిల్లల వివాహం చేశాం. చేసిన సంవత్సరం తిరిగే లోపల ఇద్దరు పిల్లలకి విడాకులు అయ్యాయి. కారణాలు వెదికితే చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ ఆ గొడవల నుండి బయటపడటానికే చాలా సమయం పట్టింది. అసలు ఎందువల్ల ఇద్దరు పిల్లలకి ఇలా జరిగిందో అర్థం కావడంలేదు.
జ: మీ ఇంటికి ఆగ్నేయ దోషాలు ఉన్నాయి. అందువల్లనే విడాకులు అయినాయి. ఆగ్నేయంలోగల సెప్టిక్ ట్యాంక్ తీసివేసి తూర్పు మధ్యభాగంలోకి మార్చుకోండి. అలాగే ఆగ్నేయంలోగల మెట్లను ఇంటి ప్రహరీగోడకు ఆనించి నిర్మించారు. ఇది కూడా పెద్ద దోషం. కాబట్టి ఈ రెండు దోషాలను తొలగించుకొని మంచి ఫలితాలను పొందండి.
*

-వాస్తు శిఖామణి చివుకుల రాఘవేంద్ర శర్మ -96 42 70 61 28