S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్పేస్ పెన్

1945 డిసెంబర్‌లో మిల్టన్ రెనాల్డ్స్ బాల్‌పాయింట్ పెన్‌ను రూపొందించి అమెరికాలో ప్రవేశపెట్టాడు. దానిలోని కొన్ని లోపాలను పాల్ సి ఫిషర్ తొలగించి సంపూర్ణం చేశాడు. పారిశ్రామికవేత్త అయిన ఫిషర్ ఈ కొత్త వ్యాపారంలోకి ప్రవేశించాడు. పాల్ విశ్వాసం అతని మాటల్లోనే. ‘బాల్‌పెన్ పరిశ్రమలో సాంకేతిక తొలి వ్యక్తిగా మంచి పెన్ ప్రజలకు అందిస్తాను.’ 1948లో ఆయన చిన్న పెన్‌ను డిజైన్ చేశారు. ఈ బుల్లెట్ పెన్ ఎంతో విజయవంతమైంది. చిన్నగా వున్న దాని డిజైన్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. పెన్నుల రంగంలో అత్యధికంగా అమ్ముడుపోతుంది. 1953లో ఫిషర్ ‘1-్ఫర్ ఆర్’ రిలీఫ్‌ని కనిపెట్టారు. ఆ కాలంలో మార్కెట్‌లో వున్న అన్ని పెన్నులకు సరిపోయే విధం గా రూపొందించిన రీఫిల్ ఇది. డిమాండ్ ఎంతగా ఉందంటే షాపు యజ మానులు పెద్ద మొత్తంలో ఈ రీఫిల్స్‌ను తెప్పించుకుని ఉంచుకునేవారు. తయారీదారులకు లాభదాయకంగా, వినియోగదారులకు ఉపయోగకరంగా ఈ పరికరం ఉండింది. కొనే్నళ్ల తర్వాత ఫిషర్ ఈ పరికరంపై కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు. 1960లో ఫిషర్ బరువు తక్కువగా వుండే మరో పెన్నును రూపొందించాడు. బాల్ పాయింట్ పెన్‌లో ఇంకు లీకు కాకుండా అవి చాలాకాలం మన్నికగా ఉండేలా రూపొందించానని ఫిషర్ చెప్పాడు. ఆయన ప్రత్యేకమైన ఇంక్‌ను తయారుచేయవలసి వచ్చింది. అది దిక్యోట్రాపిక్. విస్కో ఎలాస్టిక్ ఇంక్. అప్పటికి ఈ పదార్థాలు మార్కెట్లో లేవు. కొన్ని కోట్ల రూపాయలు సొంతంగా పెట్టుబడి పెట్టి, అనేక ప్రయోగాలు చేసి ఆయన విజయవంతంగా ప్రెజరైజ్డ్ ఇంక్ కాట్రిడ్జ్‌ని తయారుచేశాడు. 18 నెలల తర్వాత నాసా పరిశోధకుడు ఫిషర్ ఎజి-7 (యాంటీ గ్రేవిటీ 7) స్పేస్ పెన్‌ను అపోలో ఖగోళ యాత్రికులు ఉపయోగించవచ్చని ధృవీకరించారు. కొన్ని దశాబ్దాలపాటు ఫిషర్ ఈ పెన్నుల వ్యాపారాన్ని కొనసాగించాడు. ఫిషర్ పెన్ 30 మైళ్ల పొడవున రాయగలదు. ఒక వ్యక్తి తన జీవితకాలమంతా రాసినా ఇది తరిగిపోదు. ప్రముఖ ఫిషర్ పెన్‌ను అభివృద్ధి చేసి ప్రిజెరైజ్డ్ ఇంక్ కాట్రిడ్జ్‌ను సీల్ చేసి మార్కెట్లో ప్రవేశపెట్టారు.
*

-బి.మాన్‌సింగ్ నాయక్