S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తగిన శాస్తి (కథ)

అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పక్కనే ఒక ఏరు. ఆ ఏటిలో ఎప్పుడూ నీరు సమృద్ధిగా ఉండేది. ఆ ఊరి వారందరికీ అదే ప్రాణాధారం.
ఆ ఊరిలో సమ్మయ్య, సారయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారు చిన్ననాటి నుంచీ ప్రాణ స్నేహితులు. ఆ ఊళ్లోనే చదువుకొని అక్కడే ఉద్యోగాలు సంపాదించుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
సమ్మయ్య, సారయ్య ఇళ్లు పక్కపక్కనే ఉండేవి.
ఇలా ఉండగా ఒకసారి సమ్మయ్య అత్తగారింటికి వెళ్లొచ్చాడు. వచ్చిన రోజే తన వేలికున్న కొత్త ఉంగరాన్ని సారయ్యకు చూపిస్తూ ‘ఇదిగోరా! మా అత్తగారు గృహప్రవేశానికి ఈ ఉంగరం బహూకరించారు. ఎలా ఉంది?’ అంటూ మురిసిపోయాడు.
సారయ్య సంతోషంతో ‘ఇలాంటి ఉంగరమే నాకూ చేయించుకు రారా. నాకు బాగా నచ్చింది’ అంటూ తన చేతికి ఉన్న తన అత్తగారిచ్చిన ఏడు గ్రాముల ఉంగరాన్ని సమ్మయ్య చేతిలో పెట్టాడు.
సమ్మయ్య పది రోజుల్లో ఆ కొత్త రకం ఉంగరం చేయించుకొని వచ్చి సారయ్యకు ఇచ్చాడు.
ఆ ఇద్దరు మిత్రులు తమతమ ఉంగరాలు చూసుకొని మురిసిపోయారు.
నెల రోజులు గడిచాయి. ప్రతి రోజులాగే సమ్మయ్య ఏటికి స్నానానికి వెళ్లాడు. బట్టలు ఉతుక్కున్నాడు. స్నానానికి దిగాడు. ఆ రోజు ఆదివారం కావటంతో ఎక్కువసేపు సబ్బు రుద్దుకొని తీరిగ్గా స్నానం చేస్తున్నాడు. అంతలోనే అనుకోకుండా ఉరుములు మెరుపులతో పెద్ద వాన కురిసింది. ఏరు పొంగి పొరలింది. ఇంతలో - ఉంగరం ఏటిలో జారి పడిపోయింది. సమ్మయ్య గుండెలు గుభేలుమన్నాయి. దుఃఖం పొంగి పొరలింది. ఏడుస్తూనే ఏటిలో ఉంగరం దొరుకుతుందేమోనని వెతికాడు. దొరకలేదు.
ఇంటికి వచ్చీ రాగానే తన భార్యపైన ఎక్కడలేని కోపంతో ఆమె దగ్గరున్న బంగారు పిసరు లాక్కొని సారయ్య దగ్గరకు వచ్చాడు. సారయ్య ఆ బంగారు పిసరు ఉంచి ‘నన్ను క్షమించు సారయ్యా! ఈ పిసరు రెండు గ్రాములు ఉంటుంది. నీ ఉంగరం ఐదు గ్రాములు దిగింది. న్యాయంగా నీకు వెంటనే తిరిగి ఇవ్వాలి కానీ నా భార్య కొత్తరకం కమ్మలు చేయించుకుంటానని నన్ను మభ్యపెట్టి దాచుకుంది. నీకు నేను చేసిన మిత్రద్రోహానికి శిక్షగా నా చేతి ఉంగారం ఏటిలో పడిపోయింది. అనుకోకుండా వచ్చిన వర్షం వల్ల ఏరు పొంగి పొరలింది. ఎంత ప్రయత్నించినా ఉంగరం దొరకలేదు. నీకు చేసిన మిత్రద్రోహానికి జీవితాంతం మర్చిపోలేని శిక్ష పడింది’ అంటూ ముఖం చెల్లక అక్కడి నుండి వచ్చేశాడు సమ్మయ్య.
ఇదంతా చూసిన సారయ్య చాలాసేపు దిగ్భ్రాంతి నుంచి బయటపడలేక పోయాడు. తర్వాత వెళ్లి సమ్మయ్యను ఊరడించాడు.
ఏదైతేనేం - సమ్మయ్య చేసిన ద్రోహానికి తగిన శాస్తి దేవుడు ఆ విధంగా జరిపించాడు.

-వాసాల నరసయ్య