S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

క్వాంటం మెకానిక్స్

పరమాణువు, పరమాణు అంతర్భాగాల స్థాయిలో పదార్థం ప్రవర్తించే తీరును అధ్యయనం చేసే శాస్త్ర విభాగమే ‘క్వాంటమ్ మెకానిక్స్’. సంప్రదాయ భౌతిక శాస్త్రం కొన్ని దృగ్గోచర విషయాలను వివరించటంలో విఫలమైన పరిస్థితిలో 1920ల్లో ఈ శాస్త్రం వచ్చింది. సుప్రసిద్ధ భౌతిక శాస్తవ్రేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన సాధారణ సాపేక్ష సిద్ధాంతంలో భాగంగా ‘్ఫటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్’కు ఇచ్చిన వివరణలో మొదట ఈ శాస్త్రానికి నాంది జరిగింది. సంప్రదాయ భౌతిక శాస్త్ర దృష్టితో ప్రపంచాన్ని పరిశీలిస్తున్న శాస్తవ్రేత్తలకు ‘క్వాంటం మెకానిక్స్’ను అర్థం చేసుకోవటం కష్టంగా అనిపించింది.
ఈ సిద్ధాంతంలోని ముఖ్య విషయాల్లో తరంగం - రేణువు రెండు రూపాలకు సంబంధించిన విచిత్ర పరిస్థితి మొదటిది. అదే విధంగా అనిశ్చిత (అన్‌సర్టెనిటీ) సూత్రం చివరిగా ఈ సిద్ధాంతానికి సంబంధించి కీలకమైన సూపర్ పొజిషన్ కనిపిస్తున్నాయి. తరంగం - రేణు రూపాల సూత్రం దిగువ శ్రేణిలో పరిశీలిస్తే కాంతి - పదార్థం - తరంగాలు, రేణువుల లక్షణాలు కలిసి ఉంటాయి. అనిశ్చిత సూత్రం ప్రకారం రేణువు స్థానం, చలనం గూర్చి కచ్చితంగా చెప్పగలగాలంటే ఈ రెంటిలో ఏదో ఒక దానినైనా కచ్చితంగా కొలవగలిగి ఉండాలి.
ఇక సూపర్ పొజిషన్ అన్నది క్వాంటం మెకానిక్స్‌కు సంబంధించిన భావన. దీని ప్రకారం రేణువు ఒక సమయంలో రెండు రూపాల్లోనూ ఉండగలదు. ఈ సిద్ధాంతపు ప్రతిపాదనలు విచిత్రంగా తోచవచ్చు. కానీ అతి తక్కువ స్థాయిలో ప్రకృతి వాస్తవ రూపాన్ని వెల్లడి చేసే ఈ అంశాలను భౌతిక శాస్తవ్రేత్తలు ప్రయోగ పూర్వకంగా నిర్ధారించుకున్నారు.

-బి.మాన్‌సింగ్ నాయక్