S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బోధనలో పాటించాల్సిన మెళకువలు

విద్యార్థులను ఎప్పుడూ బెదిరించకూడదు. ఎటువంటి శిక్షలూ విధించకూడదు. మీరు చేయదలచుకోని పర్యవసానాలను చేసి చూపిస్తానని విద్యార్థులను హెచ్చరించకూడదు.
* విద్యార్థులు తాము నేర్చుకున్న విజ్ఞానాన్ని ‘యధార్థ జీవితంలో’ ఎలా వినియోగించుకోవాలో నేర్పాలి. దానికి తగినంత సమయం తీసుకోవచ్చు.
* తరగతిలో ప్రతిభావంతులయిన విద్యార్థులకు అవకాశం కల్పించి వెనుకబడిన విద్యార్థులకు వారిచే బోధింపజేసే ప్రయత్నం చేయాలి.
* మీరు తమకు సహాయంగా ఉంటారనే నమ్మిక విద్యార్థులకు కల్గించాలి. అదే వారికి గొప్ప ప్రేరణగా ఉంటుంది. ప్రతిభావంతమైన విద్యార్థులను చిన్నచిన్న ప్రోత్సాహకాలతో అభినందించాలి.
* మీరు ఏమి చెప్పదలచుకున్నారో విద్యార్థులకు స్పష్టంగా చెప్పగల్గాలి. అంతేకాదు ఆ విషయాలు నేర్చుకోవడం వల్ల వారికి కలిగే ఫలితాలు కూడా వివరించగల్గాలి.
* ప్రతిభ కల్గిన విద్యార్థులు వర్క్‌షాపులోను, ప్రాజెక్టు పనుల్లోను, స్వతంత్రంగా చదువుకునే స్థితిలోను లేదా ఇతర విద్యా సంబంధిత పనుల్లోను భాగస్వాములయ్యేటట్లు చేసి వారి విజ్ఞానాన్ని సవాళ్లను ఎదుర్కొనేందుకు వినియోగించే నైపుణ్యాలకు అవకాశం కల్పించాలి.
బోధన విషయంలో...
* సంక్లిష్ట భావనలలో వివరించేటప్పుడు వాటి అవగాహన విద్యార్థులలో బాగా కలిగేందుకు వారికి నిత్య జీవితంలో బాగా పరిచయం ఉండే సంఘటనలను ఉదాహరణలుగా తీసుకుని చెప్పాలి.
* విద్యార్థులు చేసే పొరపాట్లు, తప్పిదాలకు వారిని నిందించక సృజనాత్మక ధోరణిలో నిర్మాణాత్మకమైన విధంగా విడమర్చి విమర్శించి చెప్పాలి.
* ఒక జట్టు వాతావరణం తరగతి గదిలో సృష్టించి, చదువులో చురుగ్గా వున్నవారిని, కొంచెం వెనుకబడిన వారిని జట్టుగా ఏర్పరచి ఒకరికొకరు విద్యా సంబంధిత సహకారాలను సమకూర్చుకునే విధంగా వారికి శిక్షణ కల్పించాలి.
* విద్యార్థులను జట్టుగా విభజించి ఏ అంశంపైనైననూ విశే్లషణాత్మకంగా ఎలా ఆలోచించాలో తెలియజేస్తూ వారు చేసిన ప్రాజెక్టు పనిని సమీక్షించాలి.
* సొంతంగా చదివి భావనలు అర్థం చేసుకుని చెప్పగల్గిన వారిని గుర్తించి చిన్నచిన్న ప్రోత్సాహక బహుమతులతో ఉత్సాహపరచాలి.

-సి.వి.సర్వేశ్వరశర్మ