S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అనుగుణం

కలం... రాయడం మరిచింది
కీబోర్డ్.. రాయడం మొదలెట్టాక!
మాట.. పలకడం మరిచింది
మెసేజ్.. పంపడం మొదలెట్టాక!
ఛాయాచిత్రం.. నవ్వడం మరిచింది
సెల్ఫీ.. దిగడం మొదలెట్టాక!
భాషణం.. సాగడం మరిచింది
రింగ్టోన్.. మోగడం మొదలెట్టాక!
తోడు.. వెతకడం మరిచింది
ఫోన్.. చేతపట్టడం మొదలెట్టాక!

గాలి.. వీయడం మరిచింది
యంత్రం.. తిరగడం మొదలెట్టాక!
నీరు.. పారడం మరిచింది
మట్టి.. మింగటం మొదలెట్టాక!
నిప్పు... కాలం మరిచింది
నిజం.. వెతకడం మొదలెట్టాక!
వెలుగు.. నింపడం మరిచింది
చీకటి.. రాజ్యమేలడం మొదలెట్టాక!
భూమి.. తిరగడం మరిచింది
మనిషి.. బద్దకం మొదలెట్టాక!
దైవం.. ఒకటని మరిచింది
జీవం.. విడిపోవడం మొదలెట్టాక!

-పుట్టి గిరిధర్ 9491493170