S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సండేగీత

నివారం వచ్చిందంటే చాలు వాట్సప్‌లలో ఎన్నో బొమ్మలు వస్తూ వుంటాయి. ‘హ్యాపీ సాటర్‌డే’ లాంటివి. సోమవారంనాడు విషాదం బొమ్మలు వస్తూ ఉంటాయి. సరదాగా పంపించుకుంటే ఫర్వాలేదు. కానీ చాలామంది నిజంగానే ఆ విధంగా పంపించుకున్నట్టు అన్పించింది. ఇలాంటి మానసిక పరిస్థితి ఎందుకు ఏర్పరచుకుంటున్నారో అర్థంకాదు. గతంలో ఇలా వుండేవాళ్లు కాదు. పనిని ఎంతో ఆనందంగా చేసేవాళ్లు.
మా బాపు ఆయుర్వేద డాక్టర్. ఉదయం నుంచి సాయంత్రం దాకా దవాఖానాలో వుండి వైద్యం చేసేవాడు. ఎప్పుడన్నా హైదరాబాద్‌కి వస్తేనే సెలవు వుండేది. అది కూడా ఎక్కువ రోగులతోనే వచ్చేవాడు. ఆ కాలంలో డాక్టర్లు సేవా దృక్పథంతో పనిచేసేవాళ్లు. ఇప్పటిలా వ్యాపార దృక్పథం అప్పుడు లేదు. ఇచ్చిన డబ్బులని ఎప్పుడూ లెక్క చూసుకున్న సందర్భం మా బాపుకి లేదు. ఎవరినీ ఫీజు అడిగిన సందర్భం అంతకన్నా లేదు.
ఆయనకు తన డెబ్బై ఐదేళ్ల వయసులో ఆరోగ్యం దెబ్బతిన్నది. గొంతు కేన్సర్ వచ్చింది. మా అన్నయ్య కూడా డాక్టర్. మా బాపుని హైదరాబాద్ తీసుకొచ్చి వైద్యం చేయించాడు. రేడియన్ చికిత్స చేశారు. ఓ ఆరు మాసాల తరువాత తిరిగి మా ఊరొచ్చారు. ఆ ఆరు నెలలు మా దవాఖానా మూతబడింది.
మా ఆర్థిక పరిస్థితి బాగుండటం వల్ల దవాఖానాకి వెళ్లాల్సిన అవసరం లేదని మా అమ్మ, మా అన్నయ్య చెప్పారు. కానీ మా బాపు వినలేదు. ఓ వారం రోజుల తరువాత దవాఖానా తెరిపించాడు. ఎప్పటిలా దవాఖానాకి వెళ్లడం మొదలుపెట్టారు. దాదాపు 12 సంవత్సరాలు దవాఖానా నడిపారు. ఎంతోమందికి వైద్య సేవలు అందించారు.
ఆ తరువాత కొంత అనారోగ్యానికి లోనై ఓ రెండు నెలల తరువాత చనిపోయారు. ఆయన వైద్యం చేసిన డాక్టర్ల ప్రకారం ఆయన ఒకటి రెండు సంవత్సరాలకి మించి బతకరు. ఆ విషయం మా బాపు చనిపోయిన తరువాత మా అన్నయ్య ఇంట్లో వాళ్లకి చెప్పాడు. నిజమే ఆయన తన దవాఖానాని తిరిగి ప్రారంభించడం వల్ల ఆ విధంగా జరగలేదు.
మా బాపు తన పనిలో ఆనందం అనుభవించాడు. అందుకని మరో 12 సంవత్సరాలు ఆరోగ్యంగా బతికాడు. ఏదో రివార్డు కోసం, గుర్తింపు కోసం, ఎవరి మెప్పు కోసమో కాకుండా మన ఆనందం కోసం మనం పని చేయాలి. అప్పుడు కష్టంగా ఉండదు.
ఆదివారం కూడా ఆనందంగా పని చేయాలన్పిస్తుంది.