S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘టేకు’ మంచి ఔషధం!

ఇంటి పనులకు, మంచి ఫర్నిచర్ కోసం టేకు కలప అందరూ వినియోగిస్తారు. ఇందులో విశేషం ఏమీ లేదు. నిజానికి టేకుకు మరెన్నో విశిష్టతలు ఉన్నాయి. బ్యాక్టీరియా, చెదలు, క్రిమికీటకాలు టేకును ఏమీ చేయలేవు. ఎండ, గాలి, నీరు తగలకుండా ఉంటే టేకు కలప వెయ్యేళ్లైనా చెక్కుచెదరకుండా ఉంటుందని తెలుసా! చిమ్మెటలు, ఒకరకం సీతాకోక చిలుకలు (మోత్)లు మాత్రమే టేకు ఆకులను ఆహారంగా తీసుకుంటాయి. అంతకుమించి టేకుకు చీడపీడలేమీ ఉండవు. ఇవి చాలాకాలం పాటు నీటి ప్రభావానికి లోనుకాకుండా తట్టుకోగలవు. అందుకే పడవలు, స్టీమర్లు తయారీలో టేకు కలపకు ప్రాధాన్యం ఎక్కువ. ఇవన్నీ ఒక ఎత్తు. టేకు ఆకులు, కలప, బెరడు, పూలు మంచి ఔషధాలని ఎందరికి తెలుసు. డీసెంట్రి, బ్రాంకైటిస్, ఆస్తమా, నోటిపూత, కీళ్లనొప్పులు వంటి వ్యాధులకు కలప ఆకులు, బెరడుతో చేసిన రసం, కలపతో చేసిన ద్రావకం, పూలతో చేసిన ఔషధాలు పనిచేస్తాయి. ఇప్పటికీ తూర్పు ఆసియా దేశాల్లో వీటిని వినియోగిస్తున్నారు. ఆయుర్వేదంలోనూ దీనికి ప్రత్యేక స్థానం ఉంది. టేకు ఉత్పత్తిలో మయన్మార్‌దే అగ్రస్థానం. ప్రపంచ టేకు ఆవసరాలలో ఒక్క మయన్మార్ మూడోవంతు సమకూరుస్తోంది. థాయ్‌లాండ్, మలేషియా, భారత్ మిగతా టేకును అందిస్తున్నాయి. కనీసం 5వేల ఏళ్లనుంచి టేకును వాడుతున్నారు. టేకు చెట్టును నరికిన తరువాత ఒకటి రెండు సంవత్సరాలు వదిలేశాకే కలపగా పనికి వస్తుంది.

- ఎస్.కె.కె. రవళి