S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నాలుగేళ్లకే వెయ్యి పుస్తకాలు చదివేసింది!

‘చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేది సాహిత్యమే’ - ఈ మాటలన్నది తలపండిన సాహితీవేత్తా కాదు, ప్రఖ్యాత రచయిత అంతకన్నా కాదు. నాలుగంటే నాలుగేళ్ల వయసున్న ఓ చిన్నారి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా - ఈ విషయం తెలిసిన ప్రపంచ పాఠక లోకం ఔరా అంటోంది. ఆడుతూ పాడుతూ అల్లరి చేసే వయసులో, పుస్తకాలన్నా, స్కూలుకెళ్లాలన్నా మారాం చేసే పిల్లలు అన్నిచోట్లా కనిపిస్తారు. కానీ కింటర్‌గార్టెన్ క్లాస్‌లో ఉండాల్సిన ఓ చిన్నారి ఇన్ని పుస్తకాలు చదవడమే కాదు, చిన్న వయసులోనే పుస్తకాలు ఎలా చదవాలో నేర్పిస్తుందట కూడా. పసి వయసులోనే అరుదైన ఘనత సాధించిన ఈ చిచ్చర పిడుగు జార్జియా దేశానికి చెందిన దాలియా మేరీ అరానా. పద్దెనిమిది నెలల వయసులోనే పదాలు గుర్తించడం, పలకడం మొదలుపెట్టిన దాలియాకు క్రమంగా పఠనంపై ఆసక్తి పెరిగింది. తన సోదరుడికి తల్లి హలీమా పాఠాలు చెబుతుంటే పక్కన కూర్చుని ఆలకించేది. తల్లి చెప్పే పదాలను పుస్తకంలో వెతికేది. ప్రతిరోజూ ఇది అలవాటుగా మారి, చివరకు తనకుతాను పుస్తకం తీసుకుని చదివేందుకు ప్రయత్నించేదని హలీమా వాషింగ్టన్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించింది. తనకు తెలియకుండానే ఎప్పుడూ ఏదో ఒక పుస్తకాన్ని తీసుకుని చదివేందుకు ప్రయత్నించేదట. అలా మొదలైన ప్రయత్నం మూడేళ్ల వయసుకు ఒక నెల ముందు అంటే రెండు సంవత్సరాల 11 నెలలకు తనకు తానుగా తొలి పుస్తకాన్ని చదివేసింది. దీంతో కిండర్‌గార్టెన్‌లో చేరడానికి ముందే వెయ్యి పుస్తకాలను చదివించాలని తల్లి హలీమా లక్ష్యంగా నిర్ణయించింది. అది పూర్తికావడమే కాదు, కిండర్‌గార్టెన్‌లో చేరే నాటికి 1500 పుస్తకాలను చదివి రికార్డు సృష్టించే పనిలో పడింది దాలియా. కాలేజీ స్థాయి పుస్తకాలను కూడా చదివేసే స్థాయికి చేరిపోయింది. కఠినమైన పదాల ఉచ్ఛారణ కూడా స్పష్టంగా పలుకుతోందట. దాలియా ప్రతిభ ప్రపంచంలోనే పెద్ద లైబ్రరీల్లో ఒకటైన లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌కు పాకింది. ఇంకేముంది... ‘ఒకరోజు లైబ్రేరియన్’గా వ్యవహరించేందుకు లైబ్రేరియన్ కార్లా హేడెన్‌నుంచి ఆహ్వానం అందుకుంది. ఈ ఘనత సాధించిన తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళగా కూడా దాలియా చరిత్ర పుటల్లోకెక్కింది. ‘పుస్తకాలు సరైన వరుసలో ఉన్నాయో లేదో పరిశీలించడమంటే నాకు చాలా ఇష్టం’ అంటోంది దాలియా. లైబ్రేరియన్‌గా దాలియా ఠీవి చూస్తే ముచ్చటపడాల్సిందే.

- ఎస్‌ఎమ్