S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కొత్త సంవత్సరం

కొత్త సంవత్సరం వచ్చి అప్పుడే దాదాపు పది రోజులు గడిచాయి. కాలం ఎవరి కోసం ఆగదు. పరుగెడుతూనే ఉంటుంది. కొత్త సంవత్సరం వస్తుందనగానే ఎన్నో ఆలోచనలు. మరెన్నో ప్రణాళికలు. ప్రతి సంవత్సరం ఎన్నో ప్రణాళికలు వేస్తూనే ఉంటాం కానీ అమలు చేయడంలో చాలామంది విఫలం అవుతుంటారు. వారం పది రోజులు ప్రణాళికల గురించి సీరియస్‌గానే ఉంటారు. ఆ తరువాత ఆ సీరియస్‌నెస్ తగ్గిపోతుంది.
చూస్తుండగానే కాలం గడిచిపోతుంది. మన ప్రణాళికలు అలాగే ఉండిపోతాయి. మన ప్రణాళికలను అమలు చేసుకోవాలంటే దానికొక ఫార్ములాని తయారుచేసుకోవాలి.
ఈ సంవత్సరంలో మనం ఏం సాధిద్దామని అనుకుంటున్నామో దాని గురించి కలగనాలి. కల లేకుండా మనం ఏదీ సాధించలేం. అందుకని కలగనాలి. మనం ఏం కలగన్నామో అది మనకు ఎప్పుడూ కన్పిస్తూ ఉండాలి. దాన్ని సాధించడానికి మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు. ఇది మొదటి అడుగు.
రెండవది - మన కలని సాఫల్యం చేసుకోవడానికి యాక్షన్ ప్లాన్ కావాలి. ఇది లేకుండా కలలు సాఫల్యం చెందవు. మనం కన్న కలలు అమలు అవుతున్నాయా లేదా ప్రతిరోజూ గమనించాలి. కాలం మన కోసం ఆగదు. కాలం వెంట మనం పరుగెత్తాలి.
మన కలల సాఫల్యంలో ఎవరు సహకరించినా వారికి కృతజ్ఞులమై ఉండాలి. చిన్న విజయం అయినా పెద్ద విజయం అయినా దాన్ని ఆనందంగా స్వీకరించాలి. వాటికి కృతజ్ఞత తెలియజేయాలి. మనం ఎంత కృతజ్ఞతతో వుంటే విశ్వం మరిన్ని విజయాలని అందిస్తుంది.
ప్రతి విజయాన్ని, అది చిన్నదైనా పెద్దదైనా ఉత్సవంలా జరుపుకోవాలి. సంతోషం అనేది అంటువ్యాధి లాంటిది. మనం సంతోషంగా ఉంటే అది ఇతరులని సంతోషపరుస్తుంది. ఆశావహ దృక్పథంతో ఉండాలి. ఈ భావన ఎప్పుడూ ఉండాలి.
అందుకని కలగనండి
సాధించండి.
కృతజ్ఞతతో ఉండండి.
ప్రతి విజయాన్ని ఉత్సవంలా జరుపుకోండి.
కొత్త సంవత్సరంలో ఈ సూత్రాన్ని పాటించి చూడండి. విచారించాల్సిన అవసరం ఉండదు.

-జింబో 94404 83001