S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పక్షి మానవులు ఉండేవారా?

ఈ చరాచర విశ్వంలో మనిషి ఉనికి ఎప్పుడు మొదలయింది? ఎక్కడ తొలి మానవుడు ఉద్భవించాడు? అనాదిగా శాస్తవ్రేత్తలు చెబుతున్నట్లు మనిషికి ఇతర జీవులకు సంబంధం ఉందా? ఇటువంటి ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు చెప్పడం అంత తేలికైన విషయం కాదు. వందలు, వేల మంది శాస్తవ్రేత్తలు, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఘనాపాటిలైన ఎందరో మేధావులు ఈ విషయాలను కూలంకషంగా తెలుసుకుని నిగ్గు తేల్చడానికి అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నారు. అలాంటి ప్రయత్నాల్లో పురాతన కాలం నాటి ఎన్నో అద్భుత విషయాలు బయటికొస్తున్నాయి. అటువంటి ఒక అద్భుతమే శాస్తవ్రేత్తలు కనుగొన్న ‘పక్షి మానవుల’ ఉదంతం. పక్షులకు, మనుషులకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ న్యూజిలాండ్‌లోని డునెడిన్ అనే ప్రాంతంలో మాత్రం పక్షి మానవులు ఉండేవారని పరిశోధకుడు ప్రొఫెసర్ హెర్మన్ అంటున్నాడు. అతనిలా చెప్పడానికి కారణం లేకపోలేదు. డునెడిన్ పట్టణంలో హెర్మన్ బృందం తవ్వకాలు జరుపుతుండగా వారికి ఒకచోట కొన్ని ఎముకలు దొరికాయి. సాధారణంగా ఇలాంటి తవ్వకాల్లో దొరికిన ఎముకలు, ఇతర అవశేషాల కాలగణన కోసం పరిశోధకులు కార్బన్ డేటింగ్ టెస్ట్ చేస్తారు. ఆ టెస్టు ద్వారా చరిత్ర పుటల్లో నిక్షిప్తమైపోయిన వాటి కచ్చితమైన వయస్సు తెలుస్తుంది. హెర్మన్ బృందం అధ్యయనంలో డునెడిన్‌లో దొరికిన ఎముకలకు సంబంధించి కాలగణనతో పాటు షాక్‌కు గురి చేసే మరో అంశం కూడా వెలుగులోకి వచ్చింది. అదే డునెడిన్ పట్టణంలో దొరికిన ఎముకలు వేల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో జీవించిన పక్షి మానవులకు సంబంధించినవి. ఆ ఎముకల్లో నిక్షిప్తమైన డిఎన్‌ఎని పరీక్షించి చూసినప్పుడు అవి పురాతన మనిషి జాతికి చెందినవిగా తేలింది. అది కాదు విచిత్రం... ఆ ఎముకల్లో కాళ్లు, చేతులు, పుర్రె వంటి వాటితో పాటు పక్షి ఎముకలను పోలి, ఎగరడానికి ఉపకరించే రెక్కల ఆకృతిలోని ఎముకలు కూడా దొరికాయి. దాంతో హెర్మన్ బృందం ప్రపంచానికి ఒక కొత్త విషయం చెప్పబోతున్నామన్న ఆనందంతో తవ్వకాలను ముమ్మరం చేసింది. అప్పుడు అక్కడ ఒకటి కాదు రెండు కాదు... కొన్ని వేల మంది పురాతన మానవులకు చెందిన ఎముకల గుట్టలు కనిపించాయి. డిఎన్‌ఎ ఆధారాల ప్రకారం ఎముకలను ఏర్చికూర్చి అన్నింటికీ ఆకృతులు కల్పించారు. అలా ఏర్పడిన ఆకృతులను చూస్తే ఆనాటి మానవులు జెయింట్లు... రాక్షసాకారులు అని తేలింది. నేటి సాధారణ మానవుల కన్నా భారీ పరిమాణంలో ఉండేవారని అర్థమయింది. అలాంటి మానవులు ఎప్పుడు ఉండేవారు? వారి కాలగణన ఎప్పుడు? అనే విషయాలు తెలుసుకోవడానికి హెర్మన్ బృందం చేసిన కృషి ఫలించింది. రాక్షసాకారంలోని ఆనాటి పక్షి మానవులు లక్ష సంవత్సరాలకు మునుపు ఈ భూమీద జీవించినట్లు తేలింది. వారిని ‘నోమాడిన్’గా పేర్కొంటారు. నోమాడిన్ జాతికి ముందుదే హోమో సెపియన్స్ జాతి.
కలకలం రేపిన ఈ విషయాలు ఎంత వరకు నిజమో తేల్చుకోవడానికి సిద్ధమైన మరింత మంది శాస్తవ్రేత్తలు రంగంలోకి దిగారు. వారి పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. లక్ష సంవత్సరాలకు ముందు ఈ భూమీద జీవించిన పక్షి మానవులు గంటకి అరవై మైళ్ల వేగంతో, ఆరువేల అడుగుల ఎత్తులో ఎగరగలిగేవారని తెలిసింది. పక్షిరెక్కలు కలిగి, గాలిలో వేల అడుగుల ఎత్తులో ఎగరగలగడం మానవులకు అసాధ్యం ఏమీ కాదని, అటువంటి ఉదంతాల గురించి ప్రపంచంలోని అనేక పురాణాలు, గ్రంథాల్లో చూస్తూనే ఉంటామని పలువురు సైంటిస్టులు చెబుతున్నారు. పలు దేశాల్లోని ప్రజలు పూజించే దైవాలే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. మన వరకు వస్తే ‘గరుత్మంతుడు’ ఇందుకు చక్కటి ఉదాహరణ అని చెప్పవచ్చు.

చిత్రం... హెర్మన్ బృందానికి కనిపించిన ఎముకలు
నమ్మండి ఇది నిజం

- దుర్గాప్రసాద్